తెలంగాణలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. ఈరోజు ఈ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది. కీలకమైన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 5న వెల్లడి కానున్నాయి. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉంది. రాష్ట్ర అసెంబ్లీకి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన నేపథ్యంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో ముఖ్య అభ్యర్థులు BRS నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గతంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 605 పోలింగ్ కేంద్రాల్లోనే ఈసారి కూడా పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బందిని ఎన్నికల కేంద్రాలకు పంపించటం వంటి కార్యక్రమాలు పూర్తి చేశారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో 12 కొత్త జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఐదుగురు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.