2025‌లో అంతరిక్షంలోని మానవుడి తొలి ప్రయాణం

అంతరిక్షం లోగుట్టు తెలుసుకునేందుకు చాలా దేశాల శాస్త్రవేత్తలు పోటీపడుతున్నారు. ఇండియన్‌ ‌సైంటిస్టులు కూడా అదే పనిమీద ఉన్నారు.

Update: 2024-01-08 10:05 GMT

ఇస్రో 2025లో తొలి మానవసహిత అంతరిక్ష నౌకను పంపనుందని కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ‌తెలిపారు.

‘‘గగన్‌యాన్‌ను 2025లో ప్రయోగించనున్నారు. అంతకంటే ముందు అన్ని ట్రయల్స్ ‌పూర్తవుతాయి. మానవుడిని అంతరిక్షంలోకి పంపడం, తిరిగి క్షేమంగా వెనక్కు తీసుకురావడం చాలా ముఖ్యమైన ఘట్టాలని’’ సింగ్‌ ‌పేర్కొన్నారు.

గగన్‌యాన్‌ ‌గురించి వివరిస్తూ.. ఏపీలోని సతీష్‌ ‌ధావన్‌ ‌స్పేస్‌ ‌సెంటర్‌ ‌నుంచి టెస్ట్ ‌వెహికల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ఫ్లయిట్‌ (‌టీవీ-డీ1) అంతరిక్షంలోని పంపుతారని తెలిపారు. తొలుత ‘‘వ్యోమ్‌మిత్ర’’ అనే మహిళా రోబో అంతరిక్షంలోకి పంపి, దాని సహాయంతో అక్కడి వాతావరణ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేశాక మానవుడిని పంపుతారని చెప్పారు.

ముగ్గురు వ్యోమగాములు కూర్చోడానికి వీలుగా తయారుచేసే వ్యోమనౌకలో ఆక్సిజన్‌, ‌కార్బన్‌ ‌డైయాక్సైడ్‌ ‌లెవెల్స్ ‌తెలుసుకునేందుకు వీలుగా సెన్సార్లు ‌కూడా ఏర్పాటు చేశారని తెలిపారు.  వారితో నిరంతరం టచ్‌లోకి ఉండేందుకు వీలుగా ఇంటర్‌నెట్‌ ‌సౌకర్యం, రెండు టీవీ మోనిటర్లను ఉంచనున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News