టారిఫ్ తుఫాన్ లను భారత్ తట్టుకుంటుందా?
సంక్షోభాలను కొత్త అవకాశాలుగా మలుచుకోవాలన్నా ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్;
By : The Federal
Update: 2025-08-14 14:19 GMT
విజయ్ శ్రీనివాస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో న్యూఢిల్లీ, వాషింగ్టన్ కు చేసే ఎగుమతుల్లో సగానికి పైగా ప్రభావం చూపనుంది. దీని వలన పది బిలియన్ డాలర్ల వాణిజ్యం, కార్మిక, భారీ పరిశ్రమలలో లక్షలాది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లనుంది.
ఇది దశాబ్ధాలుగా భారత్- అమెరికా మధ్య పెరుగుతున్న ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను వెనక్కి నెట్టే అవకాశం ఉందని ‘ది ఫెడరల్ ఎడిటర్ ఇన్ చీఫ్’ ఎస్ శ్రీనివాసన్ ‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’ కార్యక్రమంలో హెచ్చరించారు.
ప్రధాన ఎగుమతులపై ప్రభావం..
‘‘భారత్, అమెరికాకు చేసే ఎగుమతుల్లో యాభై ఐదు శాతం ప్రభావితమయ్యాయి’’ అని శ్రీనివాసన్ చెప్పారు. ‘‘ఈ సుంకాలలో ఇరవై అయిదు శాతం ఇప్పటికే అమలులో ఉన్నాయి. మరో 25 శాతం అదనంగా పడనున్నాయి.
ఈ ముప్పు వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, సముద్ర ఉత్పత్తుల వంటి పరిశ్రమలకు ఎదురుదెబ్బ కలిగించింది’’ అని ఆయన అన్నారు. ఈ రంగాలు మానవ శక్తితో కూడుకున్నవని, ఎంఎస్ఎంఈలపై ఆధారపడుతున్నాయని, ఈ చర్యలు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మినహయింపులు..
ఔషధాలను మినహయించినప్పటికీ, మినహయింపులు వక్రీకరణకు గురయ్యాయని శ్రీనివాసన్ గుర్తించారు. ‘‘దేశాలు వ్యాపారం చేయవు, కంపెనీలు చేస్తాయి. ఆపిల్ లేదా గూగుల్ బారత్ నుంచి ఎంత తీసుకుంటాయో చూడండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. కానీ వాటిని అనుసంధానమైన స్మార్ట్ ఫోన్ లు, ల్యాప్ టాప్ వంటి ఉత్పత్తులకు సౌకర్యంగా మినహయింపు ఇచ్చుకున్నారు’’ అన్నారు.
రక్షణ, అణు, సహకారం, సాంకేతికతలో భారత్- అమెరికా సంబంధాలు ‘‘దశాబ్ధాలుగా స్థిరంగా మెరుగుపడుతున్నాయి’’ ఆయన అన్నారు. ప్రస్తుత కాలంలో వాణిజ్యం అనేది వ్యూహాత్మక సంబంధాలలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు జరిగింది ఒక కఠినమైన షాక్. ట్రంప్ 2.0 ఆయన మొదటి పదవీకాలం కంటే చాలా భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
అసమర్థత వాదన..
ట్రంప్.. ఏప్రిల్ 4న ప్రకటనను ఉటంకిస్తూ వాణిజ్య లోటుల నుంచి అమెరికా భద్రతకు అసాధారణ ముప్పులను పరిష్కరించేందుకు వైట్ హౌజ్ తన చర్యను సమర్థించుకుందని శ్రీనివాసన్ అన్నారు. అయితే ఈ వాదన ఎడిటర్ ఇన్ చీఫ్ అసంబద్దంగా తోసిపుచ్చారు.
ఇది దౌత్య వైఫల్యాన్ని సూచిస్తుందా అనే అంశంపై మాట్లాడుతూ.. ‘‘ఇది జరగబోతుందని ప్రపంచం అనుకోలేదు. ఇది కేవలం భారత్ మాత్రమే కాదు. కానీ మనం అమెరికాకు దగ్గరగా వెళ్తున్నాము. గతంలో మన అలీన వైఖరి నుంచి దూరంగా ఉన్నాము. ఇప్పుడు మనం చాలా క్లిష్ట స్థితిలో ఉన్నాము’’ అని అన్నారు.
అలస్కాలో జరగనున్న ట్రంప్- పుతిన్ శిఖరాగ్ర సమావేశం శిక్షలు(టారీప్ పెనాల్టీ) తగ్గించవచ్చనే ఆశలను ఆయన ‘‘కోరికాత్మక ఆలోచన’’( విష్ పుల్ థింకింగ్) అని విశ్లేషించారు. ఉపశమనం వచ్చినప్పటికీ, గోల్ పోస్ట్ లు మారుతునే ఉంటాయని ఆయన హెచ్చరించారు.
సంస్కరణకు అవకాశం..
1991 ఆర్థిక సంక్షోభానికి సమాంతరంగా నేటీ సవాల్ లేనప్పటికీ, ధైర్యమైన సంస్కరణలకు అవకాశం కల్పిస్తుందని శ్రీనివాసన్ అన్నారు. ‘‘సంక్షోభం ఎల్లప్పుడూ సంస్కరణలకు అవకాశాన్ని అందిస్తుంది.
మనం మార్కెట్లను వైవిధ్యపరచాలి. లాజిస్టిక్ లను మెరుగుపరచాలి. ఎంఎస్ఎంఈలకు సాయం చేయాలి. మన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో ఉండేలా చేసుకోవాలి. బహుపాక్షిక వేదికలలో కూడా మనం నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి’’ అని ఆయన అన్నారు.
డబ్ల్యూటీవో నానాటికి క్షీణిస్తున్న నేపథ్యంలో భారత్ కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని శ్రీనివాసన్ అన్నారు. ‘‘మనం స్వంత కాళ్లపై నిలబడాలి. యూరప్, ఆగ్నేయాసియా, చైనా, వంటి దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి’’ అని ఆయన సూచించారు.
సుంకాల తుఫాన్ ట్రంప్ చేసే పని.. కానీ భారత ఆర్థిక వ్యవస్థను వాతావరణ నిరోధకతను తట్టుకునే విధంగా సిద్దం చేయాలని ఆయన ముగించారు.