మూడొంతుల మంది వైద్యులు ఆ భయంతోనే ఉంటున్నారంట? ఎందుకు?

దేశంలోని వైద్య పరిస్థితులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో మూడొంతుల మంది వైద్యులు, ముఖ్యంగా ట్రైనీ వైద్యులు పని ప్రదేశంలో అసౌకర్యంగా..

Update: 2024-08-30 09:45 GMT

దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు సర్వసాధారణమై పోయింది. తాజాగా కోల్ కతలో ట్రైని వైద్య విద్యార్ధిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనతో దేశం మొత్తం దిగ్భాంతి చెందింది. నిందితుడిని వెంటనే శిక్షించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా ఐఎంఏ ఒక అధ్యాయం చేసింది. ఈ సర్వే కోసం ప్రతిస్పందించిన వైద్యులలో మూడింట ఒక వంతు మంది మహిళలు, వారి రాత్రి షిఫ్ట్‌లలో చాలా భయాందోళనలకు గురువుతున్నారు. తమకు రక్షణ కోసం ఆయుధాలు కూడా ఉండాలని భావిస్తున్నారు.

రాత్రి షిఫ్ట్‌లలో 45 శాతం మందికి డ్యూటీ రూమ్ అందుబాటులో లేదు. కోల్ కత దుర్ఘటన తరువాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) చేపట్టిన ఆన్‌లైన్ సర్వే లో ఈ విషయం బయటపడింది.
దేశంలోనే అతిపెద్ద సర్వే..
3,885 వైద్యులను సంప్రదించినట్లు ఐఎంఏ తెలిపింది. దేశంలో ఇటువంటి సర్వే ఇంతకుముందు వైద్యరంగంలో జరగలేదని పేర్కొంది. కేరళ రాష్ట్ర IMA రీసెర్చ్ సెల్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, అతని బృందం సంకలనం చేసిన సర్వే ఫలితాలు IMA కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ 2024 సంచికలో ప్రచురించడానికి అనుమతి లభించింది.
సర్వేలో పాల్గొన్న వారు 22 రాష్ట్రాలకు చెందినవారు, వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు కాగా, 61 శాతం మంది ఇంటర్న్‌లు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు. కొన్ని MBBS కోర్సులలో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం వరకూ ఉన్నారని తేలింది.
"చాలా మంది వైద్యులు అసురక్షితంగా (24.1 శాతం) లేదా చాలా అసురక్షితంగా (11.4 శాతం) ఉన్నట్లు వెల్లడించారు. ప్రతివాదులలో మూడింట ఒకవంతు మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మహిళల్లో అసురక్షితంగా భావిస్తున్న వారి నిష్పత్తి ఎక్కువగా ఉంది," అని సర్వే ఫలితాలు చూపించాయి.
20-30 సంవత్సరాల వయస్సు గల వైద్యులు అత్యంత తక్కువ భద్రతను పొందుతున్నారు. ఈ సమూహంలో ఎక్కువగా ఇంటర్న్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు ఉంటారు.
డ్యూటీ రూమ్ ఉన్నవాళ్లు..
రాత్రి షిఫ్ట్‌లలో 45 శాతం మంది డాక్టర్లకి డ్యూటీ రూమ్ అందుబాటులో లేదు. డ్యూటీ రూమ్‌ ఉన్న వాళ్లు మాత్రం భద్రతగా ఫీల్ అవుతున్నారు. రద్దీ, గోప్యత లేకపోవడం, తాళాలు లేకపోవడం వల్ల డ్యూటీ రూమ్‌లు తరచుగా ఇబ్బంది మారుతున్నాయని, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుగోనాలని కూడా కొంతమంది డాక్టర్లు కోరుతున్నారు. డ్యూటీ రూమ్‌లలో మూడింట ఒక వంతుకు అటాచ్డ్ బాత్రూమ్ లేదని సర్వే కనుగొంది.
"సగానికి పైగా సందర్భాలలో (53 శాతం), డ్యూటీ రూమ్ వార్డ్/క్యాజువాలిటీ ప్రాంతానికి దూరంగా ఉంది" అని పరిశోధనలు పేర్కొన్నాయి. "అందుబాటులో ఉన్న డ్యూటీ రూమ్‌లలో దాదాపు మూడింట ఒక వంతుకు అటాచ్డ్ బాత్రూమ్ లేదు, అంటే ఈ సౌకర్యాలను యాక్సెస్ చేయడానికి వైద్యులు అర్థరాత్రి సమయాల్లో బయటికి రావాల్సిన అవసరం వస్తోంది" అని పేర్కొన్నారు.
భద్రత పెంచాలి..
శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచడం, CCTV కెమెరాలను అమర్చడం, సరైన వెలుతురు ఉండేలా చూసుకోవడం, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ (CPA) అమలు చేయడం, పేషంట్లను చూడటానికి వచ్చే ప్రేక్షక సంఖ్యలను నియంత్రించడం, అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయడం, తాళాలతో సురక్షితమైన డ్యూటీ రూమ్‌లు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడం వంటివి భద్రతను పెంపొందించే వంటి సూచనలు ఉన్నాయి.
"ఆన్‌లైన్ సర్వే గూగుల్ ఫారమ్ ద్వారా భారతదేశం అంతటా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు పంపబడింది. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయి" అని డాక్టర్ జయదేవన్ చెప్పారు. దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు, రాత్రి షిఫ్టుల సమయంలో తాము సురక్షితంగా లేమని భావిస్తున్నారు.
ప్రతి రోగికి వారి పని వాతావరణం వల్ల బెదిరింపులు లేకుండా వైద్యులు అవసరమైన శ్రద్ధను అందించగలరని నిర్ధారించడానికి తగిన సిబ్బందిని నియమించడం, సమర్థవంతమైన ట్రయజింగ్, పేషెంట్ కేర్ ఏరియాల్లో క్రౌడ్ కంట్రోల్ కూడా అవసరమని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వైద్యులు అనేక అదనపు అంశాలను హైలైట్ చేశారు.
అదనపు కారకాలు
తగిన సంఖ్యలో శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది లేకపోవడం, కారిడార్‌లలో సరిపడా వెలుతురు లేకపోవడం, సీసీటీవీ కెమెరాలు లేకపోవడం, పేషెంట్ కేర్ ఏరియాల్లోకి అనధికారికంగా వ్యక్తులు ప్రవేశించడం వంటివి చాలా తరచుగా జరుగుతున్న సంఘటనలో ఒకటి అని అధ్యయనం తెలిపింది.
కొందరు వైద్యులు ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకురావడం ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించారు. డ్యూటీ రూమ్ చీకటి, నిర్జనమైన కారిడార్ చివర ఉన్నందున ఆమె తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ మడతపెట్టగల కత్తి, పెప్పర్ స్ప్రేని తీసుకువెళుతుందని ఒక వైద్యుడు అంగీకరించాడు.
బెదిరింపులు..
క్యాజువాలిటీలో పనిచేసిన వైద్యులు తాగిన లేదా మత్తుపదార్థాల ప్రభావంతో ఉన్న వ్యక్తుల నుంచి భౌతిక బెదిరింపులు ఎదుర్కొన్నారు. తనకు ఏకంగా ఎమర్జెన్సీ గదిలోనే పదే పదే బ్యాడ్ టచ్ ఎదురయిందని ఓ వైద్యురాలు తెలియజేసింది. పరిమిత సిబ్బంది, భద్రత లేని కొన్ని చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు పలువురు వైద్యులు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వైఖరిని ఎదుర్కొన్నారు. సీనియర్లు కూడా ఇలాంటి పని పరిస్థితులను భరించారనేది ఒక సాధారణ విషయంగా మారింది.
జూనియర్ డాక్టర్ల హింస..
హింసను ప్రధానంగా జూనియర్ డాక్టర్లు అనుభవిస్తారు. వీరు ముందు వరుసలో ఉన్నందున, తొలి దాడి వీరిపైనే జరుగుతోంది. కానీ పరిపాలన లేదా విధానాల రూపకల్పనలో వీరి ప్రమేయం తక్కువ. సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు పేషెంట్ కేర్ డెలివరీని మెరుగుపరచడంతోపాటు భద్రతా చర్యలను మెరుగుపరచడం ద్వారా జూనియర్ డాక్టర్లకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించే బాధ్యతను కలిగి ఉండాలి.
కేంద్ర రక్షణ చట్టం కోసం పిలుపు
దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులకు రక్షణ కల్పించడానికి విమానాశ్రయ తరహ భద్రతా సంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆస్పత్రిలో సురక్షిత భద్రతతో కూడిన పని వాతావరణం ఉండాలంటే సాయుధులైన సెంట్రల్ ప్రొటేక్షన్ లా అవసరం అని వారి వాదనగా ఉంది.
అటువంటి చట్టం సెక్టార్ అంతటా భద్రతా ఏర్పాట్లను ప్రామాణికం చేస్తుంది, చివరికి రోగులతో పాటు వైద్యులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని అధ్యయనం పేర్కొంది.
"సర్వే ఫలితాలు విస్తృత విధాన మార్పులకు గణనీయమైన ప్రభావాలను కలిగి ఉన్నాయి, వీటిలో కొన్నింటిని కోల్‌కతా సంఘటనకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించింది" అని IMA తెలిపింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో వైద్యుల రక్షణకు నడుంబిగించాలని పిలుపునిచ్చిన సంగతిని కూడా నివేదిక హైలైట్ చేసింది.
Tags:    

Similar News