భారత జీడీపీ అంచనాలు పెంచిన ఐఎంఎఫ్
6.4 శాతం నుంచి 6.6 శాతంగా వృద్ధిరేటు ఉంటుందని అంచనా
By : The Federal
Update: 2025-10-15 11:15 GMT
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మంగళవారం భారత జీడీపీ వృద్ది అంచనాను పెంచింది. ఇంతకుముందు 6.4 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుతం ఇండియా కనపరుస్తున్న బలమైన వృద్ధి నేపథ్యంలో 6.6 శాతానికి పెంచింది. ఇది భారత ఎగమతులపై అమెరికా సుంకాల ప్రభావం అంతగా లేదని తేల్చి చెప్పినట్లు అయింది.
వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ లో బహుపాక్షిక రుణ సంస్థ 2026-27 సంవత్సరానికి వృద్ది అంచనాను 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.2 శాతానికి తగ్గించింది. ‘‘జూలై డబ్ల్యూఈఓ అప్ డేట్ తో పోలిస్తే, ఇది 2025 కి పెరిగిన సవరణ.
జూలై నుంచి భారత్ నుంచి దిగుమతులపై యూఎస్ విధించిన సుంకం రేటు పెరుగుదల 2026 కి తగ్గుతున్న సవరణ కంటే ఎక్కువగా ఉంది. ఇది మొదటి త్రైమాసికం నుంచి క్యారీ ఓవర్ ఎక్కువగా ఉంది’’ అని నివేదిక పేర్కొంది. అమెరికా సుంకాలు విధించకముందు భారత ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్- జూన్ నెలలో 7.8 శాతం వృద్ది చెందింది. ఇది ఐదు త్రైమాసికాలలో అత్యధిక వృద్ధిరేటు.
ఈ నెల ప్రారంభంలో ప్రపంచ బ్యాంకు కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ది అంచనాను గతంలో అంచనా వేసిన 6.3 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని అంచనా వేసింది.
జూలై లో ఐఎంఎఫ్ భారత వృద్ధి అంచనాను 2025, 2026 రెండింటికి 6.4 శాతానికి సవరించింది. ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ లో దేశ ఆర్థిక వృద్ధిని 2025 కి 6.2 శాతం, 2026 కి 6.3 శాతంగా అంచనా వేసింది.
జూలై డబ్ల్యూఈఓ అప్ డేట్ తో పోలిస్తే ఇది కాస్త పెరుగుదల. అభివృద్ది చెందుతున్న మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు వృద్ధి 2024 లో 4.3 శాతం నుంచి 2025 లో 4.2 శాతానికి 2026 లో 4 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.