సందేష్‌ఖలీలో పర్యటించిన పశ్చిమ బెంగాల్ సీఎం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలు బెనర్జీతో కలిసి ఫోటో కూడా దిగారు.

Update: 2024-03-07 14:41 GMT

కోల్‌కతాలోని సందేశ్‌ఖాలీలో సీఎం మమతా బెనర్జీ పర్యటించారు. అక్కడి మహిళలతో కలిసి నడిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలు బెనర్జీతో కలిసి ఫోటో కూడా దిగారు. బిజెపి, ఇతర ప్రతిపక్ష పార్టీలు అబద్దపు ప్రచారంతో అధికార పార్టీ టీఎంసీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయని మహిళలు ఆరోపించారు.

టీఎంసీ రాజ్యసభ ఎంపి డోలా సేన్ మాట్లాడుతూ.. "ఉత్తర 24 పరగణాల్లోని సందేశ్‌ఖాలీకి చెందిన సుమారు 10 నుంచి 15 మంది మహిళలు దీదీతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆమెతో గ్రూప్ ఫోటో దిగారు. వారంతా మమతాజీకి మద్దతు తెలిపారు. గతంలో దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై బెనర్జీ ప్రవర్తించిన తీరును మెచ్చుకున్నారు’’ అని అన్నారు. సందేశ్‌ఖాలీలో బెనర్జీ చేసిన కృషిని సేన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. సందేశ్ ఖాలీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారని సేన్ తెలిపారు.

మరో సీనియర్ TMC నాయకుడు, రాష్ట్ర మంత్రి శశి పంజా మహిళల మనోభావాలను బెనర్జీకి తెలియజేశారు. "సందేష్‌ఖలీలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. దీదీ సామాజిక సంక్షేమ పథకాలకు మహిళలు పూర్తిగా మద్దతునిస్తున్నారు. గత పదేళ్లలో మారుమూల ప్రాంతంలో గణనీయ అభివృద్ధి పనులు చేపట్టారు.’’ అని వివరించారు.

TMC ర్యాలీలో సందేశ్‌ఖాలీకి చెందిన 200 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. బరాసత్‌కు చెందిన మహిళలతో మోదీ సమావేశమైన తర్వాత బెనర్జీ సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలతో సమావేశమయ్యారు. సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలు కొందరు TMC నాయకుల హింస గురించి ఆందోళన చెంది, వారి భద్రత గురించి హామీ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News