ఢిల్లీ హైకోర్టు జడ్డి కాలిన కరెన్సీ కథ కంచికి చేరుతుందా?

జస్టిస్‌ వర్మపై ఇంట్లో కాలిన నోట్ల మీద అన్ని ప్రకటనలెందుకు వస్తున్నాయి?;

Update: 2025-04-08 11:20 GMT

ఢిల్లీ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం న్యాయవ్యవస్థపై సంచలన చర్చకు,చర్యలకు దారితీసినట్టుకనిపించింది. కానీ షరామామూలుగా అది సద్దుమణిగిపోతున్నదా? ఎందుకంటే ఆయన బదిలీపై మాతృన్యాయస్థానసమైన అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీఅయిపోయారు. ఆయనను ఇక్కడకురానివ్వరాదని న్యాయవాదులు ఆందోళన చేస్తున్నా లోపాయికారిగా ప్రమాణస్వీకకారం జరిగిపోయింది. మిగిలిన చాలా విచారణలలాగే ఇదీ నెమ్మదిగా జరుఉతుంది గానీ ఎటు పో తున్నదనే సందేహాలకు సమాధానాలు లేవు. న్యాయవ్యవస్థలోనూ పలు రకాల అవినీతి పెరిగిపోతుందనే అభిప్రాయాలు అనేక సార్లు వ్యక్తమవుతున్నా కోర్టు ధిక్కారం గురించిన సంకోచాలు,వ్యవస్థపై గౌరవం కారణంగా ఒక పరిధికి మించి అది చర్చకు రాలేదు. కానీ ఈ వ్యవహారంపౖౖె నేరుగా భారత ప్రధాన న్యాయమూర్తి సిజెఐ సంజీవ్‌ఖన్నా జోక్యం చేసుకుని మొగ్గురు హైకోర్టు సిజెలతో కమిటీని నియమించి విచారణ ప్రక్రియ ప్రారంభించారు. తగలబడినట్టు చెప్పబడే నోట్ల కట్టలను అత్యున్నత న్యాయస్థానమే పోస్టు చేసింది.ఈ తరహా ఘటనలు గతంలో ఎప్పుడూ జరిగివుండలేదన్నది వాస్తవం. ఎప్పుడూ న్యాయవ్యవస్థపై వ్యాఖ్యల్లో ముందుండే రాజ్యసభ చైర్మన్‌ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంకర్‌ దీనిపైనా తీవ్రంగా స్పందించారు. అయితే తీరా చూస్తే న్యాయవ్యవస్థ అంతర్గత పరిధిలో విచారణ తప్ప మరే కదలికా లేదు.

జస్టిస్‌ వర్మపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని కోరుతూ మాథ్యూ జె.నెడుంపర అనే సీనియర్‌ న్యాయవాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఓకా ధర్మాసనం కొట్టి వేసింది. విచారణ గురించిన వివరాలు తెలియరాకుండా దీన్ని చేపట్టడం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక మీడియా సదస్సులో పాల్గొంటూ సిజెఐ అనుమతి లేకుండా ఎప్‌ఐఆర్‌ నమోదు చేసే ప్రశ్న ఉత్పన్నం కాదని ప్రకటించారు.అంటే అత్యున్నత జోక్యం తర్వాతకూడ జరుగుతున్నదేమిటనేది గానీ, ఏం చేయబోతున్నారనేది గాని స్పష్టత లేని పరిస్థితి ఏర్పడిరది.

పైకి ఏమి చెప్పినా పాలకవర్గాలు ఎప్పుడూ న్యాయవ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే పాకులాడతాయి. చట్టం వ్యవస్థపై ఆధారపడి వుంటుంది గానీ వ్యవస్థ చట్టంపై ఆధారపడి వు ండదని కారల్‌ మార్క్స్‌ చెప్పిన మాట ఎప్పుడూ మర్చిపోకూడదు.దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ హయాంలో ఒక విధంగా న్యాయవ్యవస్థ ఒత్తిడికి గురైతే బిజెపి హయాంలో అది మరింత బాహాటంగా కళ్లకు కడుతున్నది. నిబద్ద న్యాయవ్యవస్థ(కమిటెడ్‌ జ్యుడిషియరీ) వుండాలనేది ఇందిరాగాంధీ తరచూ చెప్పిన మాట. ఆఖరుకు ఆమె ప్రకటించిన ఎమర్జన్సీ రాజ్యానికి కూడా అప్పటి సుప్రీం కోర్టు ఆమోద ముద్రవేసింది. ఎప్పుడూ ఆ విషయాన్ని వల్లించే బిజెపి హయాంలో ఇది మరింత దారుణంగా తయారైంది.

పివి నరసింహారావు హయాంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామస్వామిని అభిశంసించేందుకు పార్లమెంటు చర్యలు తీసుకున్నా నాటి ప్రభుత్వం బయిటపడేసింది. సిజెఐగా పనిచేసిన జస్టిస్‌ బాలకృష్ణన్‌ పై ఆరోపణలు వస్తే కేంద్రం ఏ చర్య తీసుకోలేదు .తర్వాత ఆయనకు మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. బిజెపి హయాంలో కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సౌమిత్ర ఛటర్జీని కూడా అభిశంసించిన పరిస్థితి ఏర్పడితే ఆయన రాజీనామా చేసి బయిటపడ్డారు. సిజెఐగా వుండగానే జస్టిస్‌ రంజన్‌గోగోయ్‌ పాలనా నిర్వహణ తీరుపై సహచర న్యాయమూర్తులే తీవ్రంగా తిరగబడినా - ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు వచ్చినా సురక్షితంగా పదవీ కాలం పూర్తి చేసుకుని కొద్ది రోజులలోనే మోడీ సర్కారు నామినేషన్‌తో రాజ్యసభకు వెళ్లారు.

కేంద్రానికి నియంత్రణ?

పాలక పార్టీలు నేతలూ ప్రభుత్వాలు ఆయా సమాయాల్లో తమ అనుకూలతను బట్టి న్యాయవ్యవస్థ క్రియాశీలతపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. కొన్నిసార్లు కొనియాడుతుంటారు. న్యాయమూర్తులు కూడా పరిపరివిధాల స్పందిస్తుంటారు.తెలుగు రాష్ట్రాలలో బిఆర్‌ఎస్‌ టిడిపి వైసీపీ ప్రభుత్వాలున్నప్పుడు ఈ తేడాలు భిన్న స్వరాలు చూస్తూనే వున్నాము. నీతివంతమైన న్యాయమూర్తులు అనేకమంది ప్రజాస్వామిక స్పూర్తి, విశ్వసనీయత, ప్రజల పట్ల నిబద్దత కోసం కృషి చేస్తుంటారు గానీ పాలకవర్గ వ్యవస్థ తన వ్యూహాలకు అనుగుణంగానే అడుగులు వేస్తుంటుంది. ఉదాహరణకుే రాజ్యాంగ మౌలిక స్వభావం గురించిన ప్రస్తావన వచ్చినపుడు ఇదే జగదీప్‌ థంకర్‌ కోర్టులపై దాడి చేయడం చూశాం.

ఎప్పుడు ఎలాటి వివాదం వచ్చినా న్యాయమూర్తుల నియామకం కేంద్రం చేతుల్లోకి తీసుకోవడమే పరిష్కారమన్నట్టు మాట్లాడేవారిని చూస్తుంటాం. నిజంగానే న్యాయమూర్తుల నియామకం జాప్యం చేస్తూ ముప్పుతిప్పలు పెట్టడం వాస్తవం.ఈవిషయంలో సుప్రీంకోర్టు మాజీ ్త సిజేఐ డివై చంద్ర చూడ్‌ ధర్మాసనం గత సెప్టెంబరులో చేసిన వ్యాఖ్యలు,ఇచ్చిన ఆదేశాలు కోర్టు ఆగ్రహాన్ని వెల్లడిరచాయి సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను పక్కన పెట్టడానికి కారణం ఏమిటి అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఢల్లీ హైకోర్టుకు జస్టిస్‌ సుకుమార్‌ సురేష్‌ కుమార్‌ పంజాబ్‌ హర్యానా హైకోర్టుకు జస్టిస్‌ శాంతాబాయి జమ్మూ కాశ్మీర్‌ లడక్‌ హైకోర్టు జస్టిస్‌ తాషి రాబ్ స్టాన్ పంపించాలంటూ చేసిన సిఫార్సులను వెనక్కు తీసుకోవడానికి కూడా న్యాయస్థానం సిద్ధపడింది. మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జాన్‌ సత్యంను సుప్రీంకోర్టు కొలీజియం 2022 ఫిబ్రవరిలో సిఫార్సు చేసింది 2023 జనవరిలో పునరుద్ఘాటించింది అయినప్పటికీ ఇవి జరగలేదు జార్ఖండ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి ఆర్‌ సారంగి పేరును ఆలస్యంగా ఖరారు చేయడంవల్ల ఆయన 15 రోజులు మాత్రమే సిజెగా పనిచేసి దిగిపోవాల్సి వచ్చింది!

2024 ప్రారంభంలో కొలీజియం పిఎం మాధవన్‌ను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేస్తే ఆయన సిపిఎం అభిమాని అనీ, రెండుసార్లు ఎల్‌డిఎప్‌ ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ న్యాయవాదిగా నియమించిందనీ కేంద్రం సిఫార్సు వెనక్కు పంపింది. అయితే ఆయన సిపిఎం అభిమాని అనే వాదన అస్పష్టమైందని,లంకేశ్‌చంద్రగౌరి బిజెపి లో ఆఫీసుబేరర్‌గా వున్నా 2023 ఫిబ్రవరిలో ఆమెను మద్రాసు హైకోర్టు న్యాయమూ ర్తిగా నియమించిన సందర్భాన్ని పేరు తీయకుండా కొలీజియం గుర్తుచేసింది.

న్యాయవ్యవస్థలో సంఘ పరివార్‌ పట్టు పెరిగిపోవడం, న్యాయమూర్తులు నిబంధనలను ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేయడం కూడా చాలాసార్లు చూశాం. కనుక న్యాయమూర్తుల నియామక అధికారం కేంద్రానికి అప్పగించడమే పరిష్కారమన్న వాదనలోనూ వాస్తవికత లేదు.

న్యాయ విషయాలన్నిటిపైనా ఒక కమిషన్‌ ఆధ్వర్వం వహించాలన్న మౌలిక ప్రతిపాదనను కేవలం న్యాయమూర్తుల నియామకాలకు పరిమితం చేస్తూ ఎన్‌జాక్‌(నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ జుడిషియల్‌ అపాయింట్‌మెంట్స్‌) మోడీ సర్కారు తీసుకొచ్చిన బిల్లును సుప్రీంకోర్టు కొట్టివేసింది.న్యాయవ్యవస్థ స్వతంత్రతనూ ప్రజాస్వామిక నియామక ప్రక్రియనూ సమతుల్యం చేయడమే దీనికి విరుగుడు.

న్యాయమూర్తులలో యాభైశాతం మంది అవినీతి పరులున్నారని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఖట్జూ ఒకసారి వ్యాఖ్యానించారు. దానికి ఆయన విచారణకు కూడా హాజరైనారు. ఇదే అలహాబాదు హైకోర్టు నుంచి వచ్చిన ఖట్జూ అవినీతిపరుల జాబితా ఒకటి అప్పటి సిజెఐ లహోటీకి ఇచ్చానని కూడా చెప్పారు.వారి అవినీతిని తాను వెల్లడిస్తానంటే సిజెఐ వద్దని వారించారని ఖట్జూ పేర్కొన్నారు. తాజాగా ఒక కార్పొరేట్‌ సంస్థకు అనుకూలంగా తీర్పులు చెప్పినట్టు ఆరోపణలకు గురైన ఒక న్యాయమూర్తిపై లోక్‌పాల్‌ విచారణకు ఆదేశాలిస్తే నిబంధనలు ఒప్పుకోవంటూ సుప్రీం కోర్టు అడ్డుపడింది.ఇక్కడ లోక్‌పాల్‌ గా వున్నది కూడా సుప్రీం మాజీ జడ్జి ఖాన్విల్కరే మరి.

కనుక జస్టిస్‌ వర్మపై ఆరోపణలు గానీ,వాటిపై విచారణ ప్రహసనం గానీ ఆశ్చర్యం కలిగించదు.

ఈ వ్యవహారంలో ఇప్పటికే అనేక ట్విస్టులు విస్మరించరానివి. అసలు ప్రమాదం, అగ్నిమాపక బృందాలు వెల్లడం మార్చి 14 రాత్రి జరిగితే వారికి కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయన్న అనధికారిక కథనాలు 21న గానీ బయటకు రాలేదు. ఆ తర్వాత అగ్నిమాపక అధికారులు నోట్ల కట్టలు కనిపించినట్టు తాము చెప్పలేదని తమతో చెప్పినట్టు పిటిఐ వార్త ఇచ్చింది. తర్వాత సదరు అధికారి అతుల్‌ గార్గ్‌ తాము ఆ మాట తను చెప్పింది కాదని వివరణ ఇచ్చారు. ఇక నోట్ల కట్టలు పెట్టిన గదులు అందరూ వాడుకునేలా వుంటాయని జస్టిస్‌ వర్మ వివరణ ఇస్తే అందుకు భిన్నంగా దానికి ఎప్పుడూ తాళాలు వేసి వుం టాయని భద్రతా సిబ్బంది చెప్పారు.వర్మను బదిలీ చేయడానికి ఈ విచారణకూ సంబంధం లేదని ఆఘమేఘాల మీద స్పష్టత విడుదల చేసిన సుప్రీంకోర్టు కేంద్రం ఒప్పుకున్నాకే బడిలీ ఖరారు చేసి న్యాయవిధులకు దూరం పెట్టింది. ఏమైనా విచారణ జరిపే న్యాయమూర్తుల బృందం నివేదిక అందేవరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అవకాశం కనిపించడం లేదు.

ఈ లోగా జస్టిస్‌ వ ర్మ న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఆయన బదిలీజరిగే పోయింది గనక రాజీనామా చేస్తారేమో తెలియదు. ఎందుకంటే మొత్తం ప్రక్రియలో పారదర్శకత లోపిస్తున్నది, న్యాయమూర్తుల మంచి చెడ్డల చర్చగా గాక వ్యవస్థలో రావలసిన మౌలిక సంస్కరణలు, మరో వైపు దాని స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడం ఇక్కడ కీలకం. వ్యక్తిగతంగా న్యాయమూర్తుల లేదా న్యాయాధికారుల అవినీతి ఒకటైతే క్విడ్‌ ప్రో కో తరహాలో పాలకులు ఆ వ్యవస్థతో అనదికార అ వగాహనకొచ్చే పరిస్థితిని నివారించడం మరింత ముఖ్యం.

Tags:    

Similar News