బిసి కులగణన అంటే సమస్త కులాల, వర్గాల, మతాల పరిశీలన

బిఎస్ రాములు విశ్లేషణ: కేవలం బిసిల రాజకీయ ప్రాతినిధ్యం కోసమే కులగణన ఉపయోగపడుతుందనడమూ, అగ్రకులాలకు నష్టం అని వాదించడమూ రెండూ అతి పెద్ద పొరపాటు భావనలే !.

Update: 2024-06-20 10:12 GMT


vrకులగణనే భారతీయ వాస్తవికతకు దర్పణం కులగణనే భారతీయ వాస్తవికతకు దర్పణంగా నిలుస్తుంది. కులం ఒక వాస్తవికత. కులం , కుల వ్యవస్థ , కుల సంస్కృతి ఒక జీవన విధానం. రెండున్నర వేల యేళ్ళుగా అనేక మలుపులు తీసుకొని గణతెగలు హరప్పన్ ప్రజలు , నాగులు , ఆర్యులు , ద్రవిడులు తదితర జాతులు , ఆదివాసులు అందరు క్రమక్రమంగా భారత ఉపఖండంలో ఏవో కులాల కింద స్థిరీకరించబడ్డారు. భాషలు వేరైనా , ప్రాంతాలు వేరైనా , దేశాలు వేరైనా కులాలు , కుల సెంటిమెంట్లు ప్రజలను కలుపుతున్నాయి. తమవారిని ఎదిగించాలని భావిస్తున్నాయి. తద్వారా ఎదిగిన కులాలవాళ్ళు తమ వారిని మరింత ఎదిగించడానికి చేయూత నందిస్తున్నారు. దీన్ని కులాభిమానం , కులతత్వం , కులగజ్జి అని వివిధ అర్థాలతో వ్యవహరిస్తుంటారు.


పేద కులాలు ఎదగడానికి చేయూతను ఎవరు ఇవ్వాలి ? అందులో ఎదిగినవారు అంతంతమాత్రమే అయినప్పుడు మొత్తం 70 శాతం పేద వర్గాలను , కులాలను పట్టించుకోవాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వ ప్రణాళికలే. నిజమైన అభివృద్ధికి కులం , కుటుంబం ప్రాతిపథికగా ప్రణాళికలు నిజమైన అభివృద్ధికి కులం , కుటుంబం ప్రాతిపదికగా ప్రణాళికలు , పథకాలు రూపొందించడం అవసరం. ఎందుకంటే నిజమైన భారతీయ అభివృద్ధి అన్ని కులాల అభివృద్ధితో ముడిపడి ఉంది.


శతాబ్దాలుగా ఆయా కులాలు సమాజానికి , రాజ్యాలకు , రాజరికాలకు , అగ్రవర్ణాలకు , అగ్రకులాలకు సేవలు చేశాయి. వారి ఉత్పత్తులను , సేవలను కొల్లగొట్టడానికి ఇతర దేశాల నుండి వలసవాదులు వచ్చారు. వలసవాదులు తరలించుకుపోయిన సంపద ఎవరి సృష్టి ? సమస్త దేశాల వలసవాదులు ఈ దేశ సంపదను తరలించుకుపోయిందంతా శూద్రులు , అతిశూద్రులు , ఆదివాసులు సృష్టించినదే. ఈ దేశంలోని చారిత్రక , పురావస్తు ఆధారాలు , కోటలు , గుడులు , గోపురాలు , నగలు , నాణేలు , బట్టలు , ఆటలు , పాటలు , సంగీతం , సాహిత్యం భాషలు అన్నీ శూద్రులు , అతిశూద్రులు , ఆదివాసులు సృష్టించి పెంచి పోషించినవే.


వర్ణ వ్యవస్థ , కుల వ్యవస్థ మనుస్మృతి , కౌటిల్యుని అర్థశాస్త్రం , రాజరికాల పరిపాలన , బ్రాహ్మణీయ , తాత్విక , ధార్మిక రంగాల ప్రచారం బౌద్ధాన్ని , బౌద్ధం తెచ్చిన మనుషులందరు సమానమే అనే దృష్టిని మసిబార్చింది. హెచ్చుతగ్గుల దృష్టిని పెంచింది. మీరు మాకు సేవ చేయడానికే పుట్టారు. ఉన్నారు అని నమ్మబలికింది. తరతరాలుగా మెదళ్ళలో చెత్త నింపిన క్రమం అలా అనేక కథలు , గాధలు , పురాణాలు , సాహిత్యం , కళలు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల మెదళ్ళను తమకు అనుకూలంగా మైండ్ సెట్ చేశారు. కర్మ , పునర్జన్మ , కర్మఫలితం అనే భావాలను , ఆత్మ , పరమాత్మ పాప పుణ్యాలను అనుసరించి పునర్జన్మలో సౌకర్యాలు అనే నూతన దృష్టిని మెదళ్ళలో ప్రవేశపెట్టింది. అలా ఉత్పత్తిదారులు , సృష్టికర్తలు, సేవానిరతులైన అశేష ప్రజానీకాన్ని మానసిక బానిసలుగా మార్చే పని కొనసాగించారు. వీరి సేవలు , ఉత్పత్తులను వాడుకుంటూ , అనుభవిస్తూ , వర్ణాధిక్యత పేరిట ఆధిపత్యం చెలాయించారు.


నిజానికి వారంతా శూద్ర , అతిశూద్ర , ఆదివాసీ సమాజాలు సృష్టించిన సంపదను కస్టమర్లు వినియోగదారులుగా భోంచేశారు. అలా భోంచేయడానికి అనేక సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు రూపొందించారు. బౌద్ధాన్ని హరప్పా నాగరికతను , సంస్కృతిని , చరిత్రను పక్కకు నెట్టి ఆ తర్వాత వాటిపై ఆధిపత్యంలోకి వచ్చిన వైదిక సంస్కృతిని , భావజాలాన్ని నిరంతరం ప్రచారం చేస్తున్నారు. ఇలా సనాతన ధర్మాలను వెనక్కి నెట్టి అమానవీయ అసమానతల సమాజాన్ని , విలువలను , సంస్కృతిని సనాతన ధర్మంగా ముందుకు తెచ్చారు. ఇవన్నీ భారతీయ సంస్కృతి గొప్పతనంగా కూడా ప్రచారం చేశారు. ఇదంతా గతం నుండి కొనసాగుతున్న వర్తమాన చరిత్ర. దీన్ని తిరిగి నిజమైన సనాతన ధర్మానికి , మానవీయ విలువలకు పెద్దపీట వేయడానికి డా ॥ బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని ముందుకు తెచ్చారు.


భావజాల సంస్కరణ ప్రాధాన్యత


భారత రాజ్యాంగం స్వేచ్ఛా సమానత్వం , సౌబ్రాతృత్వం , అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఆదర్శాలు ప్రవచించింది. కుంటి , గుడ్డి అనేక అసౌకర్యాలతో , వివక్షలతో బతుకీడిస్తున్న అన్ని కలిగిన వారితో సమానంగా పరుగెత్తడం సాధ్యం కాదు. అందువల్ల వారిని సమానత్వంలోకి తీసుకు రావాలి. అందుకు ప్రాతినిధ్యం , రిజర్వేషన్లు , వైవిధ్యం వంటి వాటితో అందరూ సమానంగా కావాలని భావించడం జరిగింది. అనేక దేశాల్లో , అనేక పేర్లతో ఈ కృషి సాగుతున్నది.


భారతదేశంలో జీవితంతో విడదీయలేని కుల వ్యవస్థ , కుల వివక్ష , కుల వృత్తులు , కుల సంస్కృతిని ఒక వాస్తవికతగా గుర్తించి ఆ గెట్ ఇన్ ది బాక్స్ నుంచి ఔట్ ఆఫ్ ది బాక్స్ వాటిని బయట పడేసి నిజమైన చర్చను అనుభవించేవారిగా ఎదిగించడం అవసరం. కులగణనలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మరికొన్ని అంశాలు అందువల్ల కులగణనలో వారి సంస్కృతి , జీవనం , ఆస్థిపాస్థులు , ఆచారాలు , ఆలోచనలు , రాజకీయ ప్రాతినిధ్యం విద్యాస్థాయి ఆధునిక అభివృద్ధిలో ప్రజాస్వామ్య విలువలు , సంస్కృతిలో ఏ దశలో ఉన్నారో తెలుసుకోవడం అవసరం. అది తెలుసుకున్న తర్వాత వారి చైతన్యం , నైపుణ్యాలు , సంస్కృతి , జీవన ప్రమాణాలు అభివృద్ధి పరచడానికి ప్రత్యేక ప్రణాళికలు , పతకాలు రూపొందించడం సులువవుతుంది.


ప్రణాళికా కర్తల పై పై దృష్టి కాగా భారతీయ ప్రణాళిక కర్తలు , ఆయా రాష్ట్రాల ప్రణాళికా కర్తలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం పేదరికంను గీటురాయిగా తీసుకున్నారు. పేదరికానికి గల కారణాలను , తాత్విక మూలాలను , సామాజిక వ్యవస్థ నిర్దేశిస్తున్న నిర్బంధాలను , పరిమితులను , పరిగణనలోకి తీసుకోలేదు. దానివల్ల పేదరిక నిర్మూలన , దేశాభివృద్ధి అనేది పైపై మెరుగులుగా , పై పూతగా మిగిలిపోతున్నాయి. మొట్టమొదటిగా ప్రజలలో ఇంకిపోయిన కర్మ , పునర్జన్మ , నా కర్మగింతే అనే నిరాశ అంతచ్చేతనను మార్చడం అవసరం. సంఘ సంస్కరణల్లో భాగంగా ఈ కృషి జరగాలి.


అసమాన సమాజంలో సంఘ సంస్కరణల ఆవిష్కతను భారత రాజ్యాంగం తగిన స్థాయిలో పేర్కొనలేదు. ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంఘ సంస్కరణల శాఖలు వచ్చి పోయే ప్రభుత్వాల తాత్కాలిక ప్రయోజనాలకు అతీతంగా భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధనకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ధర్మాసనం ఆధ్వర్యంలో సంఘసంస్కరణల శాఖ స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటు చేయడం అవసరం. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సంఘసంస్కరణల శాఖను ఏర్పాటు చేయక పోవడం వల్ల , యధాతథ వ్యవస్థను కొనసాగించడమే జరుగుతూ వస్తున్నది. ఎప్పుడైతే మనుషులందరూ సమానం , స్వేచ్ఛా సమానత్వం , సౌబ్రాతృత్వం , మన రాజ్యాంగ ఆదేశిక సూత్రాలుగా , లక్ష్యాలుగా , ఆదర్శాలుగా ప్రకటించు కున్నామో , అప్పటినుండి ఆయా రాజ్యాంగ ఆర్టికల్స్లో భాగంగా సంస్కరణలను పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉండింది.


భారత రాజ్యాంగంలో పేర్కొన్న కొన్ని సంఘసంస్కరణలు , ఆర్టికల్స్ అంటరానితనం , బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన , మద్యపాన నిషేధం , కుల వివక్ష , మత వివక్ష అనేవి నేరాలు , వాటిని నిర్మూలించాలని ఆర్టికల్స్ పొందుపరచడం జరిగింది. వాటిని అమలు జరపడానికి సంఘసంస్కరణల శాఖ గ్రామీణ స్థాయినుంచి , జాతీయస్థాయి దాకా కుటుంబ వ్యవస్థ నిర్మాణం లోని స్త్రీలను అణచివేస్తున్న పురుషాధిపత్య వివక్షను కూడా తొలగించే విధంగా అన్ని రంగాల్లోకి చొచ్చుకొని విస్తరించి భావజాలన్ని , సంస్కృతిని మార్చే కృషి జరగాల్సి ఉండింది. ఎప్పటికైనా ఆ కృషి జరిగినప్పుడే దేశం స్వేచ్ఛాయుత సమాజంగా అన్నిరంగాల్లో అందరూ ఎదుగుతారు. అందరూ బాగుండాలి. అందులో మనముండాలి. మేముండాలి అనే భావన విస్తరించాలి.


కర్మ , పునర్జన్మ సిద్ధాంతాల్లో రెండో పార్శ్వం తెలుసా ? కర్మ , పునర్జన్మ భావనలోని మరో పార్శ్వాన్ని విప్పి చెప్పాలి. ఈ జన్మలో అగ్రవర్ణాలుగా , అగ్రకులాలుగా పుట్టినవాళ్ళంతా గత జన్మల్లో పుణ్యం చేసుకున్న అంటరానివాళ్ళు శూద్రులే. ఈ జన్మలో అగ్రకులాలుగా , అగ్రవర్ణాలుగా పుట్టారు. ఇలా జన్మ జన్మల సంబంధం శూద్రులకు , అంటరానివారికి , అగ్రవర్ణాలకు మధ్య ఆత్మ , పరమాత్మ , జీవాత్మ , పరిశుద్ధాత్మ డిఎన్ఏ ఒక్కటే !. కాకపోతే జన్మలు వేరయ్యాయి. విత్తనం నుంచి చెట్టు పుట్టి , తిరిగి విత్తనాలు అందిస్తున్నది. కొత్త విత్తనాల్లో పాత విత్తనం స్వభావాలు ఉంటాయి. తాత , ముత్తాతల వారసత్వం డిఎన్ఏలో కొనసాగుతూ అనేక తరాలుగా ఎలా కంటిన్యూ అవుతున్నదో అలా అగ్రవర్ణాలు , అగ్రకులాలు బీసీలు , ఎస్పీలు అంటూ వేరే లేరు. అందరూ ఒక్కటే.


ఒకరు ఈ జన్మలో ఈ అగ్రకులాలు , గత జన్మలో వాళ్ళంతా పుణ్యం చేసుకున్న అంటరాని కులాలు , శూద్రులే అని అదే కర్మ సిద్ధాంతంతో , పునర్జన్మ సిద్ధాంతంతో సంఘసంస్కరణలు , భావజాల విప్లవాలు ముందుకు సాగడం అవసరం. నాస్థిక హేతువాదులు కూడా ఈ పని చేపట్టలేక పోయారు. ఇప్పటికైనా , ఆ పని చేపట్టాలి. తద్వారా విస్తృత ప్రజానీకంలో గొప్ప ప్రభావం వేస్తారు. నిజమైన సంఘసంస్కర్తలు మొదలవుతాయి. సమస్త పార్శ్వాల ప్రక్షాళనకు కులగణన ఇలా కులగణన అనేది సంఘసంస్కరణలకు భారతీయ రాజ్యాంగ , మౌలిక లక్ష్యాలకు చేరువ కావడానికి ఉపయోగపడుతుంది.


ఆధునిక విద్య , ఉపాధి అవకాశాలు , నైపుణ్యాలు అందరికీ సాధ్యమే. అనే చూపును , మైండ్సెట్ను ప్రజల్లో పెంచడం అవసరం. ఇప్పటిదాకా ఆయా కులాలు ఎలా వైదిక , వర్ణ వ్యవస్థల ద్వారా అణిగిపోయిన అంతచ్ఛేదనతో ఏ స్థాయిలో జీవిస్తున్నారో తెలుసుకుంటేనే దాన్నుంచి బయట పడేయటం ఎలాగో తెలుస్తుంది. హరప్పా మొహెంజొదారో , సింధు నాగరికత , బౌద్ధం , తదితర సనాతన ధర్మాలు , సంస్కృతి , వైదిక నాగరికత సాహిత్యం కన్నా ముందు ఎంతో ఉన్నతంగా కొనసాగాయో , వారి వారసత్వాన్ని తెలుసుకోవడానికి కూడా కులగణన ద్వారా అనేక ఆధారాలు లభిస్తాయి. ఇలా నిజమైన సనాతన ధర్మాలు , సంస్కృతి వైదిక కాలానికి పూర్వమే ఉన్నాయని తెలుస్తాయి.


సనాతన ధర్మాలంటే ఇవీ... !


గణతెగల , జనపదాల , మహాజనపదాల , ప్రజాస్వామ్య విలువలు,  రామాయణ భారతాలు కన్నా పూర్వం కొనసాగిన మహోన్నత , మానవీయ విలువల సనాతన ధర్మాలు , సంస్కృతి ఈ విషయాలను తెలియజెప్పే శాఖలు , కేంద్ర రాష్ట్రాల్లో ఏవీ ? ఇందుకు పౌరసమాచార సంబంధ శాఖలు సంస్కృతి శాఖలు , సామాజిక న్యాయ శాఖలు , ఆర్థిక శాఖలు , రాజకీయ ప్రాతినిధ్య శాఖలు , న్యాయ శాఖలు కృషి చేయాలి. కానీ అవి ప్రభుత్వ ప్రచారానికి తప్ప నిజమైన భారతీయ రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు , నిజమైన సింథు నాగరికత , హరప్పా నాగరికత జనపదాల , మహాజనపదాల , సనాతన ధర్మాల సంస్కృతిని , ఆ వరుసలో మధ్యలో వచ్చిన భూస్వామ్య రాజరిక సంస్కృతుల వివక్షను ప్రశ్నించి వాటిలో మంచి ఉంటే ఏరుకొని , కలుపుకొని ఆధునిక ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగం చేసుకోవడం అవసరం.


నిర్దిష్ట స్థల కాల కుల పరిస్థితుల్లో సమానత సాధకే కులగణన ఇలా అనేక విషయాలను సమూలంగా మార్చడానికి ఉపయోగపడినప్పుడే కులగణన లక్ష్యం నెరవేరుతుంది. కులగణన లక్ష్యం అంటే అది మరేమిటో కాదు. భారత రాజ్యాంగం మౌలిక లక్ష్యాలను ఆచరణలోకి తీసుకు రావడానికి చేసే కృషే ప్రణాళికల పథకాల నిర్మాణమే అని మర్చిపోకూడదు. కేవలం రాజకీయ ప్రాతినిధ్యం కోసమే మాత్రమే కులగణన ఉపయోగపడుతుందని ప్రచారం చేయడం ఏదో అగ్రకులాలకు నష్టం జరుగుతుందని ప్రచారం చేయడం రెండూ అతి పెద్ద పొరపాటు భావనలే !. అందరూ బాగుండాలి. అందులో మనవాళ్ళందరు ఉండాలి అందుకే కులగణన. కేవలం బీసీల కులగణన కాదు ఇది. సమస్థ కులాల , వర్గాల , మతాల పరిశీలన , అధ్యయనం ఇది అని మర్చిపోకూడదు.


Tags:    

Similar News