సొరంగాల్లోకి దూరబోతున్న బెంగుళూరు...

బెంగళూర్ ను వేధిస్తున్న ట్రాఫిక్ జామ్ లు, నత్తనడకన మౌలిక సదుపాయాల నిర్మాణాలు... అందుకే సొరంగమార్గాలు;

Update: 2025-07-23 07:22 GMT
బెంగళూర్ సిల్క్ రోడ్ జంక్షన్

బెంగళూర్.. భారత సిలికాన్ వ్యాలీ. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందంటే.. దానిని వర్ణించడానికి భూమి మీద ఉన్న ఏ భాష సరిపోదు. అంతా అధ్వాన్నంగా ఉంటుంది.

అలాంటి సిటీలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రభుత్వం కొత్తగా ‘సొరంగం ప్రాజెక్ట్’ (Tunnel Project)  ను ప్రకటించింది. అంటే కొత్త ప్రాజక్టు.  ఇక్కడ ప్రభుత్వానికి నిర్మాణాలలో  ట్రాక్ రికార్డుని పరిశీలిస్తే ఏమంత బాగాలేదు. ఇప్పుడు ఈ కొత్త టనెల్ ప్రాజక్టు  ప్రకటన ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రమాదకరమైన బైపాస్ సర్జరీ వంటిది. ఎందుకంటే 120 అడుగుల లోతులో సొరంగ నెట్వర్క్ ని నగరం నడిబొడ్డున నిర్మించబోతున్నారు.

నగరంలో చిన్న చిన్న ప్లైఓవర్ లు నిర్మించడానికి సంవత్సరాల సమయం పడుతోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ అంటేనే నగరవాసులు హడలిపోతున్నాారు. రాష్ట్రంలోని మూడు పార్టీలు నడిపే ప్రభుత్వాలు రోడ్డుపై గుంతలు పూడ్చడానికి అవస్థలు పడ్డాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్ల విలువైన ఈ బృహత్ ప్రాజెక్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. మొదటి దశ రూ. 19 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఇది కాగితంపై చాలా సులువుగానే కనిపించవచ్చు గానీ ఒకప్పుడు సరస్సులు, పచ్చదనం, పరిశుభ్రతతో మౌలిక సదుపాయాలు అందిస్తుందని పేరు పొందిన నగరం భవిష్యత్ కు శాశ్వతమైన, కోలుకోలేని దెబ్బ ఈ ప్రాజెక్ట్ వల్ల కలగబోతోంది.
సొరంగం..
ఉత్తర- దక్షిణ, తూర్పు- పడమర దిశలలో రెండు రోడ్లను ఈ నెట్వర్క్ లో భాగంగా నిర్మించబోతున్నారు. దీనిని డీకే శివకుమార్ ప్రణాళికల్లో భాగంగా బయటకు వచ్చింది. ఉత్తర- దక్షిణ దిశలో మొదటి విడతలో 18 కిలోమీటర్ల పొడవు, తూర్పు- పడమర దిశలలో 22 కిలోమీటర్ల దూరం ఉండబోతోంది.
ఈ ఉత్తర- దక్షిణ సొరంగం హోసూర్ రోడ్డులోని ట్రాఫిక్ జామ్ కు ప్రసిద్దిగాంచిన సిల్క్ బోర్డ్ జంక్షన్, విమానాశ్రయానికి వెళ్లే హెబ్బాల్ ఫై ఓవర్ ను కలుపుతుంది.
ఈ ప్రాజెక్ట్ ప్రాథమికంగా ఆచరణీయంగా ఉండదని పట్టణ చలనశీలత నిపుణులు చెబుతున్నారు. దీని వినియోగ విలువపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇది ఎక్కువగా ప్రయివేట్ వాహనాలు, ప్రధానంగా కార్ల ఉపయోగం కోసం ఉద్దేశించింది. దీనికి టోల్ చార్జీల రూపంలో దాదాపు రూ. 330 ఖర్చు అవుతుంది.
నిర్మాణం జరిగే సమయంలో సున్నితమైన ప్రాంతాలు వచ్చినప్పుడూ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. దానికి స్పష్టమైన ప్రణాళిక ఇప్పటి వరకూ తెలియదు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ అర్బన్ మొబిలిటీలో నిపుణుడు రషీద్ కప్పన్ మొంగాబే పై వ్యాసంలో కొన్ని కీలక విషయాలను ఎత్తిచూపారు. ఈ ప్రాజెక్ట్ కేవలం కార్లు వినియోగిస్తున్న వారికే అని విమర్శించారు.


 


ప్రాజెక్ట్ కు అంతరాయాలు..
భూమి నుంచి 120 అడుగుల దిగువన ఉండే ఈ సొరంగం రోడ్డు వల్ల నగరం ఆధారపడిన నీటి జలాశయాలు, ఇతర భౌగోళిక నిర్మాణాలకు అంతరాయం కలుగుతుందని హైడ్రోజియాలజిస్టులు జీవీ హెగ్దే, కేసీ సుభాష్ చంద్ర స్థానిక దినపత్రిక డెక్కన్ హెరాల్డ్ లో రాశారు.
సిటిజన్స్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు రాజ్ కుమార్ దుగర్ మాట్లాడుతూ.. బెంగళూర్ లో ఉన్న రెండు ప్రధాన మంచినీటి సరస్సులకు సొరంగం దగ్గరగా వెళ్తుండటంతో నగరం మరోసారి కరువు కోరల్లో చిక్కుకునేందుకు ఆస్కారం ఉంటుందని హెచ్చరించారు.
డెక్కన్ హెరాల్డ్ ప్రకారం.. ప్రపంచ ప్రఖ్యాత లాల్ బాగ్ బొటానికల్ పార్క్ తో పాటు సహ బెంగళూర్ లోని కనీసం ఐదు ప్రసిద్ద ప్రదేశాలలో తవ్వకాలకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ తవ్వకాలు లాల్ బాగ్ లోని గ్నిస్ కొండకు సమీపంలో జరుగుతాయని నివేదికలో తెలిపింది.
ఇది కనీసం 2.5 బిలియన్ సంవత్సరాల పురాతనమైన ఘన శిల. తవ్వకాల కోసం కేటాయించిన ఐదు ప్రాంతాలలో రెండో వంతు సెయింట్ జాన్స్ హాస్పిటల్ కాంప్లెక్స్ లో ఉంది. ఇది నగరంలోని అత్యంత ప్రముఖమైన వాటిలో ఒకటైన ఆసుపత్రి పనితీరుకు భంగం కలిగిస్తుందని యాజమాన్యం ఆందోళన చెందుతోంది.
ప్రత్యామ్నాయాలు..
నగరం వేగంగా అభివృద్ది చెందుతున్న కారణగా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మౌలిక సదుపాయాలను మెరగుపరచడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయివేట్ వాహనాల వాడకాన్ని తగ్గించడానికి ప్రజా రవాణాను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిర్వహణను అమలు చేయడం వల్ల నగర రోడ్లలో ప్రయాణ నాణ్యతలో భారీ తేడా ఉంటుంది.
ఈ సొరంగ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నగర ప్రణాళికదారులు, ప్రభుత్వ సంస్థలు సమర్థవంతంగా అమలు చేయగలవా అనేది ప్రధాన ప్రశ్న. ఇప్పటి వరకూ ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ కూడా సకాలంలో పూర్తి కాలేదు.
ప్రయాణికుల ఇబ్బందులు..
నగరంలో ఏదైన నిర్మాణ సమయాలు జరిగినప్పుడూ ప్రత్యామ్నాయాలు లేకపోవడం వలన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదాహారణకు మెట్రో రైలు ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణం సమయంలో హై ప్రొఫైల్ మహత్మాగాంధీ రోడ్, బ్రిగేడ్ రోడ్ దాదాపు దెయ్యాల దిబ్బగా మారాయి. ఇక్కడ ఉన్న చాలా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు సొరంగం ప్రాజెక్ట్ తలుచుకుంటేనే ప్రజలు హడలిపోతున్నారు.
బెంగళూర్ లోని సాంకేతిక హబ్ కోరమంగళ మీదుగా దాదాపు 3 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇంకా పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.
కోరమంగళ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఒక పీడకలలా ఉంటుంది. అసంపూర్ణ స్తంభాలతో గాలిలో దుమ్ముతో నిండిపోయి, రోడ్డు నిర్మాణ పనుల కోసం ఇప్పటికే మూసివేశారు.
బెంగళూర్ లో నిర్మించిన మెట్రోది ఇదే కథ. కేంద్ర- రాష్ట్ర ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన మెట్రో అనేక అవాంతరాలను ఎదుర్కొని చివరకు పూర్తి అయింది.
ఫ్లై ఓవర్ల ఆలస్యం..
బెంగళూర్ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసే పనులు సరైన ప్రణాళికల తరువాత జరిగాయని కాదు. ఇప్పటికే ఉన్న ఫ్లై ఓవర్లు సరైన ప్రణాళిక లేకుండా కూల్చివేసిన సందర్భాలు ఉన్నాయి.
ఒక సందర్భంలో రిచ్మండ్ ఫ్లై ఓవర్ ఫైభాగంలో సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే డిజైన్ లోపం వలన ఇక్కడ సజావుగా ప్రయాణానికి బదులుగా ట్రాఫిక్ జామ్ లకు కారణం అవుతుంది. ఇది వ్యంగ్యంగా తరువాత ‘యూ టర్న్’ అనే ప్రసిద్ద కన్నడ చిత్రానికి ప్రేరణనిచ్చింది.
బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కీలకమైన, సంక్లిష్టమైన కూడలి అయిన హెబ్బల్ ఫ్లై ఓవర్ చాలా దారుణంగా ప్రణాళిక చేశారు. ప్రతిరోజు ఉదయం ప్రయాణికులకు, ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా ఉంటుంది.
ఐదు సంవత్సరాల తరువాత కొత్త విమానాశ్రయం కోసం ఎదురు చూస్తూ 2003 లో దీనిని నిర్మించినప్పటికీ ట్రాఫిక్ ను నియంత్రించడానికి చాలాసార్లు మార్పులు చేశారు.. చేస్తున్నారు.
రీ డిజైన్లలో దీని ఒక వైపు రాంప్ కూల్చివేశారు. ఇది నిరంతరంగా కూలగొడుతూనే ఉన్నారు. దీనివల్ల అనేక కొత్త సమస్యలు వస్తున్నాయి.
అండర్ పాస్ లు..
నగరంలో నిర్మించిన అండర్ పాస్ లు అంతే. వాటిలో డ్రైనేజీ వ్యవస్థలు సరిగా పనిచేయవు. సాధారణ వర్షాల సమయంలో కూడా అవి సరిగా పనిచేయవు. ఎప్పుడూ ముంపుకు గురవుతూనే ఉంటాయి.
వీటి పేలవమైన డిజైన్ కారణంగా తరుచుగా అందులో ప్రయాణించే వారి గమ్యస్థానం విషాదాంతమవుతుంది. రాష్ట్ర శాసనసభకు కూతవేటు దూరంలో ఉన్న కేఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఇటువంటి అండర్ పాస్ లో ఒక కారు పూర్తిగా మునిగిపోయింది. కారులోపల చిక్కుకుని 23 ఏళ్ల మహిళా టెక్నిషియన్ చనిపోయారు.
ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లో భాగంగా ఎలాంటి తప్పు జరిగిన దాని వెనక ఉన్న అధికారులు తమ అసమర్దతను కప్పి పుచ్చుకోవడానికి సాధారణంగా అభివృద్ది చెందుతున్న నగరం అని చెబుతూ ఉంటారు.
ఈ లోపాలు పార్టీలతో సంబంధం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్ లు ఈ విషయంలో తాము భిన్నంగా లేమని నిరూపించుకుంటూనే ఉన్నాయి.
అవినీతి ముప్పు..
ఇక్కడ ఉన్న మరో పెద్ద సమస్య అవినీతి ఏనుగు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడూ కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం 40 శాతం లంచం డిమాండ్ చేసిందని ఆరోపించింది. నాగమోహన్ దాస్ విచారణ లేకుండా కమిషన్ ఫలితాలను ప్రభుత్వానికి సమర్పించింది.
ఇప్పుడు కాంట్రాక్టర్లు అధికార కాంగ్రెస్ పై ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహించడంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంటోంది.
ఇక్కడ జవాబుదారీతనం లేకపోవడంతో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సొరంగ రహదారి నగర వాసుల వెన్నులో వణుకుపుట్టిస్తుందనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News