నిద్ర ముఖం ఉద్దెర బ్యారం ఫుజూల్ మాటలు
కెసిఆర్ ఉపన్యాస విన్యాసాలు కొండంత రాగం తీసిన టిఆర్ఎస్ నాయకులకు ద్వితీయ శ్రేణి నాయకులకు విరాశము మిగిల్చింది.;
ఇగ వచ్చే చూడు " నరసింహస్వామినిరా నిను నమలక మింగుతరా" అన్నట్టు ఊరు వాడా ఇంతింత నోరు పెట్టుకొని,కోటానుకోట్ల రూపాయలు ఖర్చు చేసి బంగారు తెలంగాణలో నిర్వహించిన వెండి (రజితోత్సవ) సభలో కెసిఆర్ ప్రసంగం పస లేకుండా అంతా గదే నిద్ర ముఖం ఉద్దెర బ్యారం ఫుజూల్ మాటలుగా కొనసాగింది.
అత్త అన్నందుకు కాదు తోటి యారాలు నవ్వినందుకన్నట్టు
కెసిఆర్ కాంగ్రెస్ తెలంగాణకు మెదటి విలన్ జెరసేపు అధికార పార్టీని ఇంకొంచెం సేపు భాజపా ప్రధానమంత్రిని ఆడిపోసుకున్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని పథకాల్లో ఫెయిల్ ఫెయిల్ అంటూ ఆ పార్టీకి ఐదేళ్ల పాటు పరీక్షకు కూర్చోకుండా తెలంగాణ ప్రజలు ఇచ్చిన మాండేటరీని మరచి కెసిఆర్ ఏవేవో చెట్టు మీద పిట్టకు రోట్లో సాంబారు నూరినట్టు ప్రసంగం సప్ప సప్పగా సాగింది. ఏదో మిన్ను విరిగి మీద పడుతుందని కొండంత ఆశతో ఎదురు చూసిన కెసిఆర్ ఉపన్యాస విన్యాసాలు కొండంత రాగం తీసిన టిఆర్ఎస్ నాయకు లను ద్వితీయ శ్రేణి నాయకులకు విరాశము మిగిల్చింది. ఆశనిపాతం కలిగించింది.
టిఆర్ఎస్ నాయకుడు నిన్నటి ఉత్సవం సభలో కాంగ్రెస్సే తెలంగాణకు ముఖ్య శత్రువు అని కెసిఆర్ మాట్లాడారు. కానీ ఎలా విలన్ అయిందో వివరించలేకపోయారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పటు చేసినందుకు విలనా మీ తప్పుడు రాజకీయా ఎత్తుగడల్లో తప్పుడు వ్యూహం వల్ల ఆత్మహత్యల వైపు యువను పురిగొల్పింనందుకా అమరవీరుల కుటుంబాలను గాలికి వదిలేస్తుందికా ఎందుకోసం కాంగ్రెస్ పార్టీ ఎలా తెలంగాణ పాలిట శత్రువు అయ్యిందో చెప్పడంలో విఫలం చెందాడు.
అసలు మీకు ఒక విషయం స్పష్టంగా
చెప్పాల్సిన అవసరం ఉంది. అది 24 సంవత్సర చూసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినప్పుడు వెంట ఉన్న వందల మంది నాయకులు ప్రతి మహాసభకు సభకూ మధ్య బయటకు మంచివేయగా ఇప్పుడు కుటుంబ సభ్యులు మాత్రమే పార్టీలో ముఖ్యులు గా మిగిలారు. ఇది కేసీఆర్ వైఖరి ప్రజాస్వామ్యానికి చేలమ్మ చిహ్నమా లేక పచ్చి నియంతృత్వానికి ట్రేడ్ మార్కో ఆయనే తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇవాళ ఈ పార్టీ ముఖ్య నాయకులు ప్రజల పక్షం వహించి ప్రభుత్వంతో ఠొట్లాడుతాము అని పదే పదే వామపక్షాల నుంచి ఇద్దరు తెచ్చుకున్న చిలక పలుకుల మాటలు పలుకుతున్నారు అంటున్నారు. అయితే ఏ ప్రజల పక్షం వహించి ప్రభుత్వంతో ప్రశ్నిస్తారో కుల్లం కుల్లగా తెలియజేయాలి.
గత పదేళ్ల కెసిఆర్ పరిపాలనలో పెన్షన్ల ఎంగిలి మెతుకులు ప్రజలకు విధించి విదిలించి రకరకాల ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణ ఇప్పట్లో కోలుకోలేనంత ఆర్థిక విధ్వంసానికి తమ కుటుంబ సభ్యులు పాల్పడ్డారు. తమ అంచనాలకు అందని ప్రజల నాడి టిఆర్ఎస్ పార్టీని కలలో కూడా ఊహించని విధంగా అధికారానికి దూరం చేశారు. దెబ్బతీశారు ఈ 15 నెల ల కాంగ్రెస్ ప్రభుత్వం పైన వీరి విమర్శలు చూస్తుంటే ఎంత ఆసహనానికి గురి అవుతున్నారు తెల్లారి లేస్తే వీరి మాటల ద్వారా తెలుస్తూనేవుంది.
వీరి పార్టీలో అధినాయకత్వం స్థానంలోకి సామాజిక న్యాయం ఎండమావులలో నీళ్లు ప్రవహించడం వంటిదే. ఎందుకంటే ఇవి పార్టీ వేర్లు నేలలో కాకుండా కేసీఆర్ కుటుంబంలో ఉన్నాయి. అప్పుడప్పుడు తమిళనాడు పార్టీల తీరును పేరును ఉచ్చరిస్తుంటారు కానీ వీరి వివాహంలో తెలంగాణ ఆత్మగౌరవం భాషాభిమానం తమిళులకు ఉన్నంత శక్తి వీరికి ఏ మాత్రం ఉండడానికి అవకాశం లేదు. పోరాట కెసిఆర్ ప్రజలలో పతార కోల్పోతున్నప్పుడల్లా రాజీనామాలు చేసిన విధంగా ఇప్పుడు తెలంగాణలో సాగదు. ఈయన సాగించిన తెలంగాణ పోరాటం అంతా అంతా కప్ప దాటు వ్యవహారం. ఆ పూట పూర్తి మందం మాటలు మాట్లాడుతూ 13 ఏళ్ల కాలం తెలంగాణ పేరిట ఎల్లదీశాడు. అందుకే "మియా-- బీబీ సోలెడు బియ్యం" స్లోగన్. "మెడ నరుక్కుంటాను" ఉంటాను రాళ్లతో కొట్టండి చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తాను "తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో" వంటి నినాదాలు ఊక దంపుడు మాటలు ఉపన్యాసాలు ఉద్యమ కాలంలో నడిచింది కానీ ఇప్పుడు మీరు ఎన్ని ఇకమ్మతులు పన్నాగాలు పన్నినా ప్రజలు "ఎరుకకు నడికే సాక్షి గా" మిమ్మల్ని హోల్ సేల్ గా తూకం వేస్తున్నారు.
ఆకపోతే పదేళ్ల కాలంలో మీరు నెరవేర్చడం వాగ్దానాలు లెక్కలేననన్ని ఉన్నాయి. మీ కుటుంబ నాయకుల పట్ల మీ పరిపాలన పట్ల తివ్ర వ్యతిరేకతను గత డిసెంబర్ ఎన్నికల ఫలితాలలో ప్రజలు చూపించారు. సంచులు నింపుడు సంచులు పంపుడు పంచులు వేయడం ఎదుటీవారిని తక్కువ చేసి తూల నాడడం ఎవరైనా మీ తర్వాతనే. ఉండమని భాజపా కాళ్ళు మొక్కడం పోకుమని కాంగ్రెస్ మోచేత్ని పట్టుకోవడం ఆయా పార్టీల అధినాయకుడు మీరు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా.