షర్మిల మణిపూర్ ప్రస్తావన వెనక మర్మమేమిటి?

షర్మిల మణిపూర్ హింసాకాండ గురించి, అక్కడ క్రైస్తవుల మీద జరిగిన దాడుల గురించి పదే పదే ప్రస్తవిస్తున్నారు. మణిపూర్ క్రైస్తవులకు సానుభూతి చెబుతున్నారు. ఎందుకు?

Update: 2024-01-27 10:56 GMT
ఏలూరు కాంగ్రెస్ సభలో ప్రసంగిస్తున్న వైఎస్ షర్మిల

-జువ్వాల బాబ్జీ


ఇటీవల కాలంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పట్ల ప్రజలు కొంత ఆశక్తి కనబరుస్తున్నారు.

దానికి కారణం, వై.యస్.షర్మిళ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరినప్పటి నుండీ, కొన్ని ఆశక్తి కరమైన విమర్శలు, అటు అధికార పక్ష మైన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అలాగే విపక్ష పార్టీలైన, తెలుగు దేశం, జనసే న పార్టీల పైన చేస్తున్నారు.

ఇప్పటి వరకూ ఆ విమర్శ ల పై చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించ లేదు కానీ, ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి, అతని పార్టీ నేతలు మాత్రం షర్మిళ పై విమర్శ లు గుప్పిస్తున్నారు.
విమర్శకు ప్రతి విమర్శ కాకుండా, రాష్ట్ర ప్రజల కు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పైన లేదా?

ఈ క్రమం లో, అసలు షర్మిళ చేస్తూన్న విమర్శల గురించి మనం ఒకసారి సునిశితంగా పరిశీలిస్తే, వాటి తీవ్రత అర్థం అవుతుంది.

షర్మిళ రెడ్డి డిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి జాతీయ అధ్యక్షుడు ఖర్గే ,మరియు రాహుల్ గాంధీ, సోనియా సమక్షం లో చేరిన వెంటనే ఒక ఆసక్తి కరమైన అంశం గురించి ప్రస్తావించారు.
అది వినటానికి చిన్నదిగా ఉండవచ్చు కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాల కు ఒక పెద్ద సవాల్ అని భావించ వచ్చు.

షర్మిళ రెడ్డి కూడా రాష్ట్ర రాజకీయాల ను చాలా వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం కోసం అలా మాట్లాడినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అసలు ఏమిటా మాటలు?

తనను "మణిపూర్ సంఘటన కలిసి వేసిందని, రెండు వేల మంది క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారని,అరవై వేల మంది క్రైస్తవులు నిరాశ్రయులు అయ్యారని "అప్పుడే నేను కాంగ్రెస్ పార్టీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నా నని అన్నారు.
ఆ తర్వాత ఆమె ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం సంధర్భంగా అదే అంశాన్ని ప్రస్తావించారు.
ఇంకా జగన్ మోహన్ రెడ్డికి క్రైస్తవులు పై ఉన్న ప్రేమ పై అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రశ్నల వర్షం కురిపించారు. మణిపూర్ సంఘటన పై జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేదని, క్రైస్తవులకు కడుపు మండదా? వారివి ప్రాణాలు కావా? అనీ ఆవేశ భరితంగా ప్రసంగించారు.అయితే ఇక్కడ షర్మిళ రెడ్డి గమనించ దగిన విషయమేమంటే , మణిపూర్ మారణ కాండ లో రెండు(మొ యితీలు , కుకీలు) తెగలు వారు ప్రాణాలు కోల్పోయారని, వారిలో కొందరు క్రైస్తవులు ఎక్కువ మంది చనిపోయారు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లౌకిక వాద పార్టీ కాబట్టి, నేను అందులో చేరానని చెప్తూ ఒక మతానికి చెందిన వారు మాత్రమే నష్ట పోయినట్లు మాట్లాడితే , ఆ మాటల వలన పార్టీకి వేరొక వర్గాల వారిని దూరం చేసుకొనే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్న వారు అవగాహన తో మాట్లాడాలి.

సరే ఇంతకీ, షర్మిలా రెడ్డి గురించి , తన అన్న జగన్ మోహన్ రెడ్డి, అతని పార్టీ నేతలు ఎందుకు కలవర పడుతున్నారు?
ఆమె మాటలు బట్టి చూస్తే, వచ్చే ఎన్నికలలో, రెడ్డీ - క్రైస్తవ (దళితులు, ఆదివాసీలు ) ఓట్ల కోసం వ్యూహం రసించినట్లు అర్థం అవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనాభా లో 19 శాతం మంది దళితులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది షెడ్యుల్ కులాల వారు క్రైస్తవులు. చాలా మంది స్టడీ సర్టిఫికెట్ లలో హిందువులు గా ఉన్నప్పటికీ వారంతా చర్చిలకు వెళతారు.
చాలా గ్రామాలలో రెండు నుండి పది దాకా చర్చిలు ఉంటాయి.
అంతే కాకుండా,గిరిజనులు 6 శాతం మంది ఉన్నారు. వీరిలో కూడా చాలా మంది క్రైస్తవులు గా మారారు. గతం లో వీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు.
ఇంక రెడ్డి సామాజిక వర్గం  8.8 శాతం మంది.
2014 లో జరిగిన రాష్ట్ర విభజన విషయంలో కొంత అసంతృప్తి చెంది, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా జగన్ మోహన్ రెడ్డికి క్రైస్తవులు దగ్గరయ్యారు. ఇక రెడ్డి సామాజిక వర్గం మొదటి నుండీ కాంగ్రెస్ తోనే ఉన్నారు.
ఇప్పుడు ఈ రెండు రకాల ఓటు బ్యాంకు ను కొల్లగొడుతుందేమోనని , వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందు తున్నట్లుగా అర్థం అవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలకు కొంత సామాజిక చైతన్యం ఎక్కువ. వీరిపై మహాత్మ పూలే,డా. బి.ఆర్ అంబేడ్కర్ లాంటి సామాజిక ఉద్యమ నాయకుల ఆలోచన ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది . తీర ప్రాంతంలో దాదాపు అన్ని గ్రామాల్లో మిషనరీ లు వచ్చి చదువు లతో పాటు క్రైస్తవ మతం బోధించారు.
దానితో వీరికి భారతీయ జనతా పార్టీ అంటే తీవ్ర మైన వ్యతిరేకత ఉంటుంది.

రచయిత జువ్వాల బాబ్జీ


 అందుకే షర్మిలా రెడ్డి చాలా వ్యూహాత్మకంగా మణిపూర్ సంఘటన గురించి మాట్లాడుతున్న ట్లు మనం అర్థం చేసుకోవాలి. అలాగే వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం క్రైస్తవ మతం నేపథ్యం ఉండడం వలన, వారికి దగ్గర కావడం కోసం చేసే ప్రయత్నంగా భావించాలి.

రాజశేఖర్ రెడ్డి  ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడే 2005 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి  వారసురాలిగా ఆమెను  ఓన్ చేసుకోవచ్చు.
అంబేడ్కర్ వాదులు, ఎలాగూ బిజేపి రాజకీయాల ను అంగీకరించరు.

షర్మిల రెడ్డి మరికొన్ని అంశాల ను లేవనెత్తింది. జగన్ మోహన్ రెడ్డి 2019 లో అధికారం లోకి రాక ముందు పదే పదే ప్రత్యేక హోదా కోసం మాట్లాడే వాడని,25 మంది పార్లమెంట్ సభ్యుల ను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని విమర్శిస్తూ ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయటానికి కేంద్రం సన్నాహాలు చేస్తుంటే, ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు విప్పలేదు అని ప్రశ్నిస్తుంది.

ఈ విషయంలో అధికార పక్ష - విపక్షాల పార్టీల నేతలు, చంద్ర బాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేక పోతున్నారని విమర్శిస్తూ ఉంది.
ఈ విమర్శ ల పై జగన్ మోహన్ రెడ్డి అతని పార్టీ నేతలు ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు.
ఈ సందర్భంగా షర్మిళ రెడ్డి మాట్లాడే టప్పుడు,ముఖ్యంగా లౌకిక వాదం గురించి ,1961 సం. లో అప్పటి దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అన్న మాటలు గుర్తు తెచ్చు కోవాలి.
"మనం భారత దేశం లో లౌకిక రాజ్యం గురించి మాట్లాడతాను. దానికి హిందీలో ఒక మంచి పదం అంత తేలికగా దొరకదు. కొంత మంది వ్యక్తులు అనుకుంటారు, దాని అర్థం ఒక మతానికి వ్యతిరేక మని. కానీ అది నిజం కాదు.దానర్థం ఏమిటంటే, లౌకిక రాజ్యం అన్ని మత విశ్వాసాల ను సమానంగా గౌరవిస్తుంది. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది."

పై విషయాల ను మనస్సులో పెట్టుకొని షర్మలా రెడ్డి మత పరమైన అంశాలు గురించి జాగ్రత్త గా మాట్లాడాలి. లేదంటే అది వినటానికి బాగున్నప్పటికీ, ఒక వర్గం వారిని ఆకర్షించ టా నికి పనికి వస్తుంది. కానీ వేరే వారిని దూరం చేసుకొనే ప్రమాదం లేక పోలేదు.

భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాజ్యంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని విమర్శిస్తున్న దని అన్నప్పుడు ప్రజల హక్కుల కోసం పొందు పరిచిన అంశాల మీద మాట్లాడుతూ, దేశం లో,రాష్ర్టంలో అవి ఏవిధంగా ఉల్లంఘనకు గురవు తున్నాయో వివరిస్తే బాగుంటుంది.
ప్రజా జీవితం అంటే కేవలం "పాద యాత్ర" లు మాత్రమేనా?
కేంద్రం లో బి. జే. పి నీ ఇక్కడ దాని బి. టీమ్ లుగా ఉన్న జన సేన,తెలుగు దేశం పార్టీ లు,
షాడో టీమ్ గా ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లను ఓడించాలని గదా?
దానికి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా ఇండియా కూటమి భాగ స్వామ్యం పక్షాల తో కలిసి వెళుతుందా? ఎందుకంటే, వచ్చే ఎన్నికలలో మేము 175 సీట్ల లో పోటిచేస్తామని అంటున్నది.
కానీ, దేశం లో ఇండియా కూటమి తరపున సీట్ల సర్డు బాటు గురించి చర్చ జరుగుతుంది. ఇక్కడ ఉన్న వామ పక్షాలు కూడా షర్మిళ రెడ్డి మాటలు గమనిస్తూ ఉంటారు. అసలే దేశం లో సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నాయి. దానిని బట్టే ఎజెండా తయారు చేస్తారు. కాబట్టి షర్మిలా రెడ్డినీ , ఆమె మాటల ను ఇతర పార్టీల వారు గమనిస్తుంటారు అని గుర్తు పెట్టు కోవాలి.

ప్రతీ రాజకీయ పార్టీ ప్రజల ఓట్ల కోసం ఒక వర్గం వారికి దగ్గర కావడం కోసం మరొక వర్గం వారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ముఖ్యంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా,మాట్లాడాలి.ప్రస్తుతం తన అన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు షర్మిళ రెడ్డి చేసే ప్రతీ విమర్శ సూటిగా నిర్మొహమాటంగా ఉండాలి.అది సహజ సిద్ధమైన రాజ కీయ ప్రక్రియ.
అందులో భాగంగా, వనరుల దోపిడీ,అవినీతి, నిరుద్యోగ సమస్య ,దళితుల పై దాడులు,
27 రకాల సంక్షేమ పథకాలు రద్దు,ఇవ్వన్నీ మాట్లాడ టం.
విజయ వాడలో అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం పెట్టీ దానికి "స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్"అని పేరు పెట్టారు. కానీ దళితులకు అంబేడ్కర్ దేవుడి తో సమానం.ఆయన పేరుతో ఉన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరు ను మార్చి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అని పేరు మార్చారు . అది ఆయనను అవమానించడం కాదా?
షర్మిల దాడి తీవ్రత పెరగగానే 
కొంత మంది క్రైస్తవ మత పెద్దలు ఇటీవల షర్మిలా రెడ్డి నీ
షర్మిీ శాస్త్రి అని విమర్శిస్తున్నారు. భారత దేశం లో పిల్లల కు తండ్రి కులమే వర్తిస్తుంది.చదువుకున్న అమ్మాయిలు సర్టిఫికెట్ లలో కూడా అదే ఉంటుంది.
అంతెందుకు,విమర్శించే వారి వారి కూతుళ్ల సర్టిఫికెట్స్ పెండ్లిండ్లు చేశాక మారాయే మో, ఒకసారి పరిశీలించుకోవాలి.
ఇప్పుడు షర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాక ఆమె పేరు, ఊరు సమస్య గా మారిందా?
అన్న జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు, ఈ విమర్శకుల నోర్లు ఎందుకు తెరవలేదు.
మనం భారత రాజ్యాంగ ప్రకారం, స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయని అంటూనే, తండ్రి ఆలోచనలు ప్రకారం రాజకీయాలు చేయటానికి, వారసు రాలు కాదు అని విమర్శించటం దుర్మార్గం.

ఏది ఏమైనా సరే, షర్మిలా రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల లో కొంత ఆశక్తి నీ రేపు తున్నది.
నిన్నటి మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు కొత్త ఉత్సాహం తో గ్రామాల లో జండాలు పట్టుకుంటున్నారు. అయితే గత కొంత కాలంగా కేడర్ లేని పార్టీగా మిగిలి పోయిన కారణంగా స్ధానిక సమస్య ల పై కనీస అవగాహన ఉండి ప్రజలకు కొంత అందుబాటులో ఉండే నాయకుల ను గుర్తించి పార్టీ పునర్ నిర్మాణం చేపట్టాలి.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నట్లు, మేము 10 సం. ల పాటు అజ్ఞాత వాసం వీడా ము. రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రం నకు ప్రత్యేక హోదా తెస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడు కుంటామని, అంటున్నారు.

(వ్యాస రచయిత న్యాయవాది,  వ్యవసాయ వృత్తి దారుల అసోషియేషన్ ఆంధ్రప్రదేశ కార్యదర్శి, జంగారెడ్డి గూడ,ఏలూరు జిల్లా)


Tags:    

Similar News