యూపీ నుంచే ఖర్గే పోటీకి కాంగ్రెస్‌ ‌నేతల పట్టు..

ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఆ సామాజిక వర్గం నుంచి ఓట్లను ఆశిస్తుందా? అందుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏఐసీసీ చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గేకు పోటీ చేయిస్తుందా?

Update: 2024-01-09 10:50 GMT

ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా...

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రత్యర్థులను చిత్తుగా ఓడించాలన్న లక్ష్యంతో కసిగా పనిచేస్తున్నట్లుంది. అందుకే వివిధ రాష్ట్రాలో కమిటీలు వేసి మరీ గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రారంభించింది. అభ్యర్థుల జాబితా సేకరిస్తున్నారు. 

దళితుల ఓట్ల కోసమే..

కాంగ్రెస్‌ ‌పార్టీ యూపీలో గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. అందుకు తగ్గటుగానే వ్యూహరచన చేస్తోంది. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రాగానే అక్కడి నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బరిలో నిలిపే అవకాశం ఉంది. అక్కడి జనాభాలో దళిత ఓటర్లు 20 శాతంమంది ఉన్నారు. ఈ కారణంగానే దళిత సామాజిక వర్గానికి చెందిన ఖర్గేను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

రాహుల్‌ను కోరిన యూపీ నేతలు..

లోక్‌సభ ఎన్నికలకు సన్నద్దత, రాహుల్‌ ‌గాంధీ జోడో న్యాయ్‌ ‌యాత్రపై ఇటీవల కాంగ్రెస్‌ ‌పెద్దలు చర్చించారు. ఈ సమావేశంలో కొందరు యూపీ నేతలు తమ రాష్ట్రం నుంచి పోటీచేయాలని ఖర్గేను కోరారట. ఈ విషయాన్ని ఇప్పటికే ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ, పార్టీ జనరల్‌ ‌సెక్రటరీ ప్రియాంక గాంధీకి చెప్పామని మాజీ కేంద్ర మంత్రి ఫెడరల్‌కు తెలిపారు.

సీట్ల సర్దుబాటు తర్వాతే..

యూపీ నుంచి పోటీచేయాలని ఖర్గేను కోరడం ఇది నాలుగోసారి అని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌లీడర్‌ ఒకరు చెప్పారు. అయితే ఈ విషయంపై ఖర్గే స్పందంచలేదన్నారు. పోటీ చేయడం కంటే సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ ‌పార్టీలతో మద్దతు, సీట్ల సర్దుబాటుకు ఖర్గే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.ఖర్గే పోటీచేసే అంశాన్ని రాహుల్‌, ‌ప్రియాంక దృష్టికి తీసుకెళ్లిన యూపీ నేతలకు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారట.

పార్టీకి నూతనోత్తేజం..

ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ చీఫ్‌ అజయ్‌కుమార్‌, ‌ప్రస్తుత చీఫ్‌ అజయ్‌ ‌రాయ్‌, ‌మాజీ ఎంపీ, దళిత నాయకుడు పీఎల్‌ ‌పునియా, ఫెడరల్‌తో మాట్లాడారు. ఖర్గే పోటీ చేయడం వల్ల దళిత ఓటర్లకు సానుకూల సంకేతాలు వెళ్లడంతో పాటు పార్టీ శ్రేణుల్లో నూతనో త్తేజం వస్తుందన్నారు. అయితే ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

ఇదే సరైన సమయం..

బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ చీఫ్‌ ‌మాయావతిపై దళితులకు ఉన్న అభిమానం క్రమేణా తగ్గుతోందని, దళితులపై ఆమె పట్టు కోల్పోతున్నారని అజయ్‌ ‌రాయ్‌ ‌పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌మొదటి నుంచి దళితులకు అండగా ఉందని, ఈ సారి వారి నమ్మకాన్ని గెలుపొందడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ మాజీ చీఫ్‌ అజయ్‌కుమార్‌ అన్నారు.

కుల రాజకీయాలకు కాంగ్రెస్‌ ‌దూరం..

బీజేపీలాగా కు రాజకీయాలకు కాంగ్రెస్‌లో తావులేదని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌లీడర్‌ ఒకరు అన్నారు. ‘‘దళితులకు ఓ మంచి లీడర్‌కావాలి. ఖర్గేకు మించిన వారెవరు ఉన్నారు? ఆయనకు రాజకీయాల్లో అపార అనుభవం ఉంది. ఆయన ఇష్టపడితే యూపీ నుంచే పోటీ చేయవచ్చు’’ అని పేర్కొన్నారు.

అఖిలేష్‌ ఒప్పుకుంటాడా?

ఖర్గే పోటీకి సమాజ్‌వాదీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, అందులో సందేహం లేదని కేంద్ర మాజీ మంత్రి ఒకరు తెలిపారు. మొత్తం 80 స్థానాల్లో 22 స్థానాలను కాంగ్రెస్‌ ‌పార్టీ ఆశిస్తుంది. కాని అఖిలేష్‌ ‌యాదవ్‌ 10 ‌సీట్లు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News