బడ్జెట్ 2025 : ఏఐ, IIT, వైద్య కళాశాలలకు ఊతం

విద్యార్థులు తక్కువ వడ్డీ రేటుతో విద్యా రుణాలు పొందేందుకు ప్రత్యేకంగా విద్యా ఫైనాన్సింగ్ కార్పస్ ఏర్పాటు చేయనుంది.;

Update: 2025-02-01 08:53 GMT
Click the Play button to listen to article

కేంద్ర బడ్జెట్ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత విద్యా వ్యవస్థను ఆధునీకరించే పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. కృత్రిమ మేధస్సు (AI), IITలు, వైద్య కళాశాలలు(Medical Collges), ఉపాధ్యాయ శిక్షణకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది.


కృత్రిమ మేధస్సుకు పెద్దపీట..

దేశాన్ని కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు రూ. 500 కోట్లు కేటాయిస్తూ మూడు ‘Centers of Excellence’ ఏర్పాటు చేయనుంది. AI బోధన, పరిశోధన, ఉపాధ్యాయ శిక్షణకు ఈ కేంద్రాలు దోహదపడతాయి. చైనాలోని Deep Seek లాంటి సంస్థల ప్రభావం నేపథ్యంలో.. భారత్ అంతర్జాతీయంగా AI రంగంలో పోటీ పడేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.

IITలు, వైద్య కళాశాలల్లో సీట్ల పెంపు..

దేశంలో వైద్య సీట్లను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో వసతులను మెరుగుపరిచి కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించనుంది.

IITలను మరింత విస్తరించేందుకు అదనపు నిధులు కేటాయించారు. ఇంజినీరింగ్, వైద్య విద్యపై విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని IITలు, వైద్య కళాశాలల్లో సీట్ల పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా నైపుణ్యవంతులైన వైద్యుల కొరతను తీర్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.

తక్కువ వడ్డీకి విద్యా రుణాలు..

విద్యార్థులు తక్కువ వడ్డీ రేటుతో విద్యా రుణాలు పొందేందుకు ప్రత్యేకంగా విద్యా ఫైనాన్సింగ్ కార్పస్ ఏర్పాటు చేయనుంది. IITలు, మెడికల్ కాలేజీలు, AI Excellence Centers లాంటి ప్రముఖ విద్యా సంస్థల్లో చదవే విద్యార్థులకు దీని ద్వారా పెద్ద ఊరట లభించనుంది.

డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి..

పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ఆధునికీకరణకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. కొత్త తరగతి గదులు, లైబ్రరీలు, ప్రయోగశాలలు నిర్మించి విద్యా వాతావరణాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కొన్ని పథకాలను రూపొందించారు. ఆన్‌లైన్ విద్య ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో..డిజిటల్ వేదికలను మరింత అభివృద్ధి చేయనుంది. ఇక పాఠశాలల్లో హైబ్రిడ్ విద్యా మోడల్స్, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌కి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

‘భారతీయ భాషా పోస్తక్’ పథకం..

ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు పుస్తకాలను డిజిటల్ రూపంలో అందించేందుకు ‘భారతీయ భాషా పోస్తక్’ పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా ప్రాంతీయ భాషల్లో విద్యను బోధించే అవకాశాలు పెరుగుతాయి. ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థులకు ఇది వినూత్న ప్రయోజనాన్ని అందించనుంది.

ఆర్థిక సర్వేక్షణం 2024-25 నివేదిక ప్రకారం..

దేశంలో 14.72 లక్షల పాఠశాలలు, 24.8 కోట్ల విద్యార్థులు ఉన్నారు. 98 లక్షల ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 69% విద్యాసంస్థలు, 51% ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.అయితే, ప్రైవేట్ పాఠశాలలు విద్యారంగంలో 22.5% వాటాను కలిగి ఉండగా, 32.6% మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరుతున్నారు.

2030 నాటికి 100% ‘Gross Enrolment Ratio’ (GER) సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రాథమిక స్థాయిలో GER 93% ఉన్నా, ఉన్నత పాఠశాల స్థాయిలో ఇది 77.4% మాత్రమే ఉంది. అందువల్ల ఉన్నత విద్యలో చేరికలు పెంచేందుకు కేంద్రం బడ్జెట్ 2025లో కొత్త చర్యలు తీసుకుంది.

విద్యా రంగానికి నిధులు..

2024-25 ఆర్థిక సంవత్సరానికి విద్యారంగానికి రూ. 1.20 లక్షల కోట్లు కేటాయించారు (మునుపటి బడ్జెట్ కంటే 6.84% పెరుగుదల). పాఠశాల విద్యకు – రూ. 73,008.10 కోట్లు, ఉన్నత విద్యకు – రూ. 47,619.77 కోట్లు, PM SHRI పథకానికి – రూ. 4,200 కోట్ల కేటాయింపు జరిగింది. 

Tags:    

Similar News