‘ఆపరేషన్ సింధూర్‌తో భారత్ సత్తా ప్రపంచానికి చాటాం’
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ "దేశ భద్రత’’ విషయంలో రాజీ పడిందన్న ప్రధాని మోదీ
పాకిస్తాన్(Pakistan), ఉగ్రవాద ప్రేరేపిత శక్తులు ఆపరేషన్ సింధూర్(OP Sindoor) రూపంలో భారతదేశం నిజ స్వరూపాన్ని చూశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా.. శుక్రవారం గుజరాత్ ఏక్తా నగర్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మన వాయుబలగాలు శత్రు భూభాగంలోకి ప్రవేశించి భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించామని అన్నారు.
కాంగ్రెస్‌పై దాడి..
"ఆర్టికల్ 370 సంకెళ్లను బద్దలు కొట్టడం ద్వారా కశ్మీర్ నేడు ప్రధాన స్రవంతిలోకి చేరింది. పాకిస్తాన్, ఉగ్రవాద సూత్రధారులు కూడా దేశం నిజ స్వరూపాన్ని చూశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ "జాతీయ భద్రత విషయంలో రాజీ పడింది" అని కూడా ప్రధాని విమర్శించారు.
‘‘కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్‌లో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది. దానివల్ల కశ్మీర్, దేశంలో అశాంతి నెలకొంది. ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోషించింది. ఇంత జరిగినా ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచింది.’’ అని ఆరోపించారు.
తన ప్రసంగానికి ముందు మోదీ జాతీయ ఐక్యతా దినోత్సవ కవాతును తిలకించారు. ఇందులో పోలీసులుచ పారామిలిటరీ బలగాలు పాల్గొన్నాయి.