‘జూబ్లి’ లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు
ఎర్రగడ్డ డివిజన్ పాదయాత్రలో కిషన్ రెడ్డి
రెండేళ్లుగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయకుండా ఓట్లేయాలని అడిగే నైతిక హక్కు ఆ పార్టీ కార్యకర్తలకు లేదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి అని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ లోని పలు కాలనీల్లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇంటింటికి వెళ్లి శుక్రవారం ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకుని ఇక్కడ పోటీ చేస్తోందన్నారు. ఇక్కడి ప్రజలు గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోరని కిషన్ రెడ్డి అన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ సమస్యలను తీర్చేందుకు బిజెపి ముందుంటుందని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక ఎంపీగా నేను అనేక నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చి, అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టుపక్కల నియోజకవర్గాలు అన్నీ అభివృద్ధి చెందాయి. కానీ జూబ్లీహిల్స్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యందన్నారు. గతంలో బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు అవకాశం కల్పించారు. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించేసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి ఓటేయాలని కోరినప్పుడు మంచి స్పందన వస్తుంది. అంతేకానీ ఇతర పార్టీల్లాగా రాజకీయాలు చేయాలని బిజెపి అనుకోవట్లేదు అని కిషన్ రెడ్డి అన్నారు. మా నిజాయితే మా పార్టీని గెలిపిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హాయంలో జూబ్లీహిల్స్ లో ఎలాంటి అభివృద్ది లేదు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి గెలవడం ఖాయమని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, ఎర్రగడ్డ డివిజన్ ఎన్నికల ఇన్ చార్జి మేకల సారంగపాణి, బీజేపీ సీనియర్ నేతలు, స్థానిక కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు కిషన్ రెడ్డి మార్గ దర్శనం చేశారు.