ఆ ఇద్దరికి కేబినెట్ హోదాతో పదవులు

ఉత్తర్వులు జారి చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Update: 2025-10-31 11:05 GMT

తెలంగాణ కేబినెట్ విస్తరణలో ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి వచ్చిన నేపథ్యంలో అసంతృప్తి వాదులను బుజ్జగించడానికి కాంగ్రెస్ అధిష్టానం సమాయత్తమైంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డికి శుక్రవారం ప్రభుత్వ సలహాదారునిగా నియమించింది. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కు సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.

బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి కేబినెట్ బెర్తు ఆశించారు. కాని ఆయనకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు గల ప్రభుత్వ సలహాదారునిగా నియమించడమే కాదు ఆరు గ్యారంటీల హామిల అమలు బాధ్యతను అప్పగించింది. మంచి ర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కేబినెట్ బెర్తు దక్కుతుందని ప్రచారం జరిగినప్పటికీ ఆయకు అవకాశం రావడం లేదు. అనూహ్యంగా కేబినేట్ హాదా గల సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ పదవి దక్కింది.

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు.మంత్రివర్గ విస్తరణ లో ఆయనకు చోటు దక్కలేదు. వచ్చే నెలలో మరో మారు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే రాజగోపాల్ రెడ్డి కి చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News