సీపీఎం నేత దారుణ హత్య

శుక్రవారం ఉదయం తన ఇంట్లోనే వాకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్యచేశారు

Update: 2025-10-31 06:34 GMT
Deceased CPM leader Samineni Ramarao

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని చింతకాని మడలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం తన ఇంట్లోనే వాకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్యచేశారు. ఒకేసారి ముగ్గురూ సామినేనిపై వెనుకనుండి దాడిచేసి గొంతుకోసి చంపేశారు. స్ధానికసంస్ధల ఎన్నికల నేపధ్యంలోనే ఈ హత్య జరిగుంటుందని అనుమానిస్తున్నారు. సామినేని పార్టీ రాష్ట్రకమిటి మాజీ సభ్యుడు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

సామినేని హత్యపై డిప్యుటి సీఎం మల్లుభట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రామారావు కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వం సామినేని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. హత్య విషయం తెలియగానే పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం పోలీసు కమీషనర్ సునీల్ దత్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. సీపీఎం రాష్ట్రకమిటి సభ్యుడు పోతినేని సుదర్శన్, పొన్నం వెంకటేశ్వరావు తదితరులు కుటుంబసభ్యులను పరామర్శించారు. క్లూస్ టీమ్ ఆధారాల కోసం గాలిస్తున్నది.

Tags:    

Similar News