సీఎంను కలిసిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం ముంబయిలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

Update: 2025-10-31 03:45 GMT
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్

మంబయి నగరంలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ అయ్యారు. సీఎంతో సల్మాన్ స్నేహపూర్వక సమావేశం ముంబయి నగరంలో గురువారం సాయంత్రం జరిగింది. తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సల్మాన్ ఖాన్ ప్రశంసించారు.

తెలంగాణ రైజింగ్ సందేశాన్ని తాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళతానని ముఖ్యమంత్రికి సల్మాన్ ఖాన్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, దార్శనికతను తాను అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేస్తానని సల్మాన్ పేర్కొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలి పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం ముంబయికు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా సల్మాన్ ఖాన్ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారని సమాచారం. సీఎంతో సల్మాన్ ఖాన్ కొద్దిసేపు మాట్లాడారు. సల్మాన్ ఖాన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సీఎంను సల్మాన్ కలవడంపై నెటిజన్లు లైక్ లు, షేర్ లతో హోరెత్తిస్తున్నారు. ఈ వివాహ వేడుకలో పలువురు మహారాష్ట్ర రాజకీయ నాయకులు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్ , సినీ సెలబ్రిటీలు సంజయ్ దత్, వ్యాపారవేత్తలు ముకేష్ అంబానీ, నీతా అంబానీలు పాల్గొన్నారు.


Tags:    

Similar News