ఎన్నికల వేళ.. భక్తిమంత్రం

దైవం తలుచుకుంటే అధికారం వస్తుంది. అందుకే పూజా మందిరాలు, ప్రార్థనా మందిరాలు సందర్శిద్దాం. యాగాలు, హోమాలు చేద్దాం. దైవ శక్తి చాలా గొప్పది;

Byline :  The Federal
Update: 2023-12-24 14:13 GMT
హోంమం చేస్తున్న చంద్రబాబు దంపతులు

దైవం తలుచుకుంటే అధికారం వస్తుంది. అందుకే పూజా మందిరాలు, ప్రార్థనా మందిరాలు సందర్శిద్దాం. యాగాలు, హోమాలు చేద్దాం. మనకున్న శక్తి యుక్తుల కంటే దైవ శక్తి చాలా గొప్పది. ఆ శక్తి ఎవరిని దగ్గరికి తీసుకుంటుందో వారికి అధికారం దక్కుతుందనే భావనలో పాలకులు ఉన్నారు.

ప్రశాంతతకు మార్గం భక్తి
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒకరు దేవాలయాలు సందర్శించి యాగాలు, హోమాలు చేశారు. మరొకరు చర్చిలు, దేవాలయాల సందర్శన చేస్తున్నారు. ఈ యాగాలు, దర్శనాలు ప్రశాంతత కోసం కాదు, అధికారం కోసం.
చంద్రబాబు ఇంట్లో ముగిసిన యాగం, హోమం

Delete Edit

రాజమండ్రి జైలు నుంచి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని సందర్శించుకున్నారు. ఆ తరువాత పలు దేవాలయాలు సందర్శించి పూజలు చేశారు. ఇటీవల గుణదలలోని మేరీమాత అమ్మవారిని దర్శించుకుని అక్కడ క్రైస్తవ పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఉండవల్లికి సమీపంలోని తన ఇంట్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మహా చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నేటితో ముగిసాయి. ఈ యాగం, హోమానికి చాలా మంది బంధువులు హాజరయ్యారు. నారా భువనేశ్వరి వచ్చిన మహిళలకు బొట్లుపెట్టి సారె, చీరలు అందించి పంపారు. అలాగే చంద్రబాబును కలవడంతో పాటు యాగంలో పాల్గొనేందుకు పలువురు టీడీపీ నాయకులు వచ్చారు. వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణలు ఉన్నారు. వీరితో పాటు పలు జిల్లాల నుంచి కూడా పలువురు నేతలు హాజరయ్యారు. మూడు రోజుల పాటు హోమగుండం మండుతూనే ఉంది. చంద్రబాబు దంపతులు పండితులు చెప్పిన ప్రకారం హోమాన్ని, యాగాన్ని నిర్వహించారు.
నిజానికి చంద్రబాబు నాయుడుకు దైవభక్తి పెద్దగా లేదని వాళ్ల పార్టీ వారే చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణగా కూడా మనం ఒకటి చెప్పుకోవచ్చు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టగానే మొదటి సారిగా విజయవాడలో పర్యటించినప్పుడు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అందులో ఒకటి కృష్ణానది ఒడ్డున ఉన్న చిన్న చిన్న దేవాలయాలు తొలగించే కార్యక్రమం. ఆ దేవాలయాలు తొలగించి నది ఒడ్డున స్నాన ఘట్టాలు నిర్మించారు. కృష్ణా పుష్కరాలు రావడం వల్ల అది సాధ్యమైంది. చాలా మంది దేవాలయాల తొలగింపు వద్దని చెప్పినా చంద్రబాబు వినిపంచుకోలేదు.
దైవ దర్శనాల్లో సీఎం జగన్‌

Delete Edit

ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేవాలయాకు వెళ్లడం అక్కడ పూర్ణకుంభ పూజలు చేయడం జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఇడుపులపాయ వెళ్లినా అక్కడి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈనెల 25న క్రిస్మస్‌ పండుగ ఉండటంతో పలు చోట్ల ప్రార్థనలకు హాజరవుతున్నారు. 25న ఇడుపులపాయలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస చేస్తున్నారు. పులివెందుల, ఇడుపులపాయల్లోని పలు ప్రార్థనా స్థలను అప్పుడప్పుడు సందర్శిస్తూనే ఉన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి కాకముందు జైలుకు వెళ్లి వచ్చిన తరువాత ప్రార్థనలు, పూజలు చేశారు. అయితే విజయవాడలోని కృష్ణానది ఒడ్డున చంద్రబాబు నాయుడు పడగొట్టించిన దేవాలయాలు తిరిగి కట్టిస్తానని కొన్ని దేవాలయాల పనులు కూడా ప్రారంభించి నాకు కూడా దైవభక్తి ఎక్కువేనని నిరూపించుకున్నారు.

Delete Edit
యాగాలు, హోమాలు, చర్చిలు, దర్గాల్లో ప్రార్థనలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఎన్నికల వేళ ఎక్కువవుతున్నాయి. ఈ భక్తి ఇద్దరికీ శక్తిని ఇవ్వాలని కోరుకుందాం. దైవబలం ఎవరికి అనుకూలిస్తుందో చూద్దాం. తెలంగాణలో అధికారం తిరిగి దక్కాలని యాగం, హోమం చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌. అయితే ఆయనకు ఆ ఫలాలు దక్కలేదు. ప్రజలు ఓడించారు. చూద్దాం పాలకులను నమ్ముకున్న దైవం గెలిపిస్తుందో.. ఓటర్ల ఆలోచనా శక్తి గెలిపిస్తుందో.
Tags:    

Similar News