బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం..

అక్టోబర్ 17 వరకు స్వీకరణ - 18న పరిశీలిన - 20న ఉపసంహరణ

Update: 2025-10-10 12:55 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar)లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly polls) రెండు దశల్లో జరగనున్నాయి. తొలిదశ ఎన్నికలు నవంబర్ 6, చివరి దశ పోలింగ్ 11 తేదీ జరగనుంది. 14వ తేదీ ఓట్లను లెక్కిస్తారు. మొదటి దశలో 121 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 17 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. 18వ తేదీ వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 20.


రెండో దశలో 122 స్థానాలకు..

పాట్నా, దర్భంగా, మాధేపురా, సహర్సా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, సివాన్, సరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, లఖిసరాయ్, ముంగేర్, షేక్‌పురా, నలంద, బక్సర్, భోజ్‌పూర్ జిల్లాలకు మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ పోలింగ్ నవంబర్ 11న 122 అసెంబ్లీ స్థానాలకు జరుగుతాయి.


సీట్ షేరింగ్ చర్చలు..

అధికార ఎన్డీఏ(NDA), ప్రతిపక్ష ఇండియా(I.N.D.I.A) కూటమి ఇప్పటివరకు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. సీట్ షేరింగ్‌పై ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడమే దానికి కారణం. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు గురించి చర్చించేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం పాట్నా చేరుకుని, పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు. ఒకటి లేదా రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని బీజేపీ వర్గాల సమాచారం. జేడీ(యూ) కూడా త్వరలోనే తన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్డీఏ వర్గాల సమాచారం ప్రకారం.. జేడీ(యూ) 102 స్థానాల్లో, బీజేపీ 101 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) గతంలో 20-22 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే ఈ సారి 45 సీట్లు డిమాండ్ చేస్తుంది.


భారత కూటమిలో..

ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఆర్జేడీ(RJD) 135-140 స్థానాల్లో, కాంగ్రెస్‌ (Congress) 50-52 సీట్లలో పోటీచేయవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఆర్జేడీ అభ్యర్థుల తొలిజాబితాను ఫైనల్ చేసేందుకు ఈ రోజు సాయంత్రం పాట్నాలో ఆ పార్టీ సీనియర్ లీడర్లు సమావేశం అవుతున్నారు. భారత కూటమిలోని మరో పెద్ద భాగస్వామి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ కూడా తమకు 20-25 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఐదేళ్ల క్రితం సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ 19 సీట్లలో పోటీచేసి 12 స్థానాలను గెలుచుకుంది.

అభ్యర్థులను ప్రకటించడంలో జాన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌ ముందంజలో ఉన్నారు. ఆయన గురువారం 51 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 

Tags:    

Similar News