BJP | దేవాలయాల ధ్వంసానికి AAP ఆదేశాలిచ్చింది

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ, ఆప్‌ నేతలు ఒకరికి మించి మరొకరు హిందువుల విశ్వాసాన్ని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.;

Update: 2025-01-03 10:15 GMT

దేశ రాజధానిలో అనేక దేవాలయాలను బీజేపీ(BJP) కూల్చివేసిందని, ఆ పార్టీ నేతలు హిందూ మతాన్ని రక్షిస్తున్నట్లుగా నటిస్తున్నారని ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి (Atishi Marlena) అతిశీ పేర్కొన్నారు. అయితే 2016 - 2023 మధ్య ఢిల్లీలోని 24 దేవాలయాలను ధ్వంసం చేసేందుకు AAP ఫత్వాలు జారీ చేసిందని అతిశీకి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా తన వాదనలను బలం చేకూర్చేందుకు కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్లుగా ఢిల్లీని పాలిస్తోంది. 2016 నుంచి 2023 వరకు దాదాపు 24 నిర్మాణాలను కూల్చివేసేందుకు ఆప్ ముఖ్యమంత్రి, మంత్రులు ఫత్వాలు జారీ చేశారు. ఈ దేశంలో ఆప్ కంటే మోసపూరిత పార్టీ మరొకటి లేదు. మాజీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ 2016లో ఎనిమిది దేవాలయాలను కూల్చివేయాలన్న ఉత్తర్వులపై సంతకం చేశారు.’’ అని అన్నారు.

‘ఆప్ హిందూ వ్యతిరేక పార్టీ’

"ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎటువంటి చారిత్రక నేపథ్యం లేని రెండు మసీదులను రక్షించడానికి సత్యేంద్ర జైన్ (Satyendar Jain) జోక్యం చేసుకున్నాడు. కానీ అతను ఎప్పుడూ దేవాలయాల గురించి మాట్లాడలేదు. ఇండియా కూటమి భాగస్వాములు డిఎంకె, టిఎంసి, లెఫ్ట్, కాంగ్రెస్ ఎల్లప్పుడూ సనాతన్ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, అయితే, ఆప్ ఏమీ స్పందించదు. ఇప్పుడు అర్చకులకు నష్టపరిహారం ఇస్తామని చెబుతున్నారు’’ అని ఆయన అన్నారు.

Tags:    

Similar News