బీహార్ ఎన్నికలు: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తరుపున బరిలో 20 మంది..
ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన పార్టీ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య..
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల(Assembly Polls) నేపథ్యంలో ఇండియా(I.N.D.I.A Alliance) కూటమిలో భాగమైన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తరుపున 20 మంది అభ్యర్థులు బరిలో నిలువనున్నారు. 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ తిరిగి నామినేట్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు 19 స్థానాల్లో పోటీ చేసి 12 స్థానాల్లో విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవని స్థానాల్లో ఇప్పుడు కొత్తవారిని పోటీలోకి దింపింది.
'ఎన్డీఏ పాలనలో ప్రజలు విసిగిపోయారు'
ఈ సారి ఎన్నికల్లో మహా కూటమి విజయం సాధిస్తుందని CPI(ML) లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య ఆశాభావం వ్యక్తం చేశారు. పోటీ చేయడానికి తగినంత సీట్లు రాకపోయినా.. తమ పార్టీ సంకీర్ణ స్ఫూర్తిని కొనసాగించిందని పునరుద్ఘాటించారు. "ఈసారి మాకు 24 సీట్లు కావాలని కోరాం. అయితే 20 దక్కాయి. ప్రజలు NDA పాలనతో విసిగిపోయారు. ఈ సారి ప్రజలు మార్పు కోరుకుంటారని భావిస్తున్నా, ’’ అని పేర్కొన్నారు.
మళ్లీ పోటీలో కీలక అభ్యర్థులు..
ప్రముఖ ఎమ్మెల్యేలు అమర్జీత్ కుష్వాహా, సత్యదేవ్ రామ్, గోపాల్ రవి దాస్, సందీప్ సౌరవ్, శివ ప్రకాష్ రనాజ్, అజీత్ కుమార్ సింగ్, బీరేంద్ర ప్రసాద్, మహబూబ్ ఆలం తిరిగి నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు. దియా గౌతమ్, అనిల్ కుమార్, ఫూల్బాబు సింగ్ కూడా ఉన్నారు.
బోర్ స్థానం నుంచి ధనంజయ్, అమర్జీత్ కుష్వాహా జిరాదీ నుంచి, సత్యదేవ్ రామ్ దరౌలీ నుంచి, అమర్‌నాథ్ యాదవ్ దరౌండా నుంచి పోటీ చేస్తున్నారు. రంజీత్ కుమార్ రామ్ కళ్యాణ్‌పూర్ నుంచి, ఫూల్‌బాబు సింగ్ వారిస్‌నగర్ నుంచి, బిశ్వనాథ్ చౌదరి రాజ్‌గిర్ నుంచి బరిలో నిలువనున్నారు.
దిఘా నుంచి దివ్య గౌతమ్, ఫుల్వారీ నుంచి గోపాల్ రవి దాస్, పాలిగంజ్ నుంచి సందీప్ సౌరవ్, అరా నుంచి ఖ్యముద్దీన్ అన్సారీ, అగియాన్ నుంచి శివ ప్రకాష్ రంజన్ తరారీ నుంచి మదన్ సింగ్, డుమ్రాన్ నుంచి అజిత్ కుమార్ సింగ్ నామినేషన్ వేశారు.
243 మంది సభ్యులున్న అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.