S.I.R‌పై రేపు EC ప్రెస్‌మీట్..

2026లో అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు..

Update: 2025-10-26 13:13 GMT
Click the Play button to listen to article

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గురించి సోమవారం (అక్టోబర్ 27) సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (EC) తెలిపింది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు(Elections) జరగనున్న రాష్ట్రాలతో పాటు 10 నుంచి 15 రాష్ట్రాల్లో S.I.R చేపట్టడం గురించి విలేఖరులతో పంచుకోనున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంసిద్ధత, అక్కడున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో గత వారం చర్చించింది.

15 రాష్ట్రాల్లో..

అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో మొదటి దశలో SIR చేపట్టే అవకాశం ఉంది. గ్రామస్థాయి ఎన్నికల యంత్రాంగం పంచాయతీ ఎన్నికలతో బిజీగా ఉన్నందున..స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగనున్న రాష్ట్రాల్లో EC ఈ కార్యక్రమాన్ని నిర్వహించదు. ఇలాంటి రాష్ట్రాల్లో SIR తరువాత నిర్వహిస్తారు.

బీహార్‌లో S.I.R ముగిసింది. సెప్టెంబర్ 30న దాదాపు 7.42 కోట్ల పేర్లతో తుది జాబితాను రిలీజ్ కూడా చేశారు. బీహార్‌లో నవంబర్ 6 , 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. 

Tags:    

Similar News