IPS అధికారిని గెంటేసిన యోగి, ఎందుకు, ఏం జరిగింది యుపిలో?

ప్రభుత్వం విధానాలను విమర్శించాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జస్వీర్ సింగ్‌తో బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించింది.

Update: 2024-11-09 10:31 GMT

యూపీలో యోగి ప్రభుత్వం 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జస్వీర్ సింగ్‌ను బలవంతంగా ఉద్యోగం నుంచి తప్పించింది. క్రమశిక్షణ రాహిత్యం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడాడని జస్వీర్ సింగ్‌ను ఉన్నతాధికారులు తొలుత ఐదేళ్ల పాటు సస్పెన్షన్‌లో ఉంచారు. సర్వీస్‌లో ఉన్నప్పుడు యోగి ఎన్‌కౌంటర్ విధానాన్ని జస్వీర్ సింగ్‌ తప్పుబట్టారు. ఇప్పుడు ఏకంగా ఆయనతో బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించేశారు.

Full View

ప్రభుత్వం విధానాలను విమర్శించాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జస్వీర్ సింగ్‌తో బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించింది. గతంలో ముఖ్యమంత్రి యోగిపై జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయించడంలో జస్వీర్ కీలకంగా వ్యవహరించారు. గత అయిదేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయనతోనే ఇప్పుడు బలవంతంగా రిజైన్ చేయించారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా నడుచుకోని అధికారులను పక్కకు నెట్టడానికి సైతం యూపీ సర్కారు వెనకాడబోదని చెప్పడానికి జస్వీర్ సింగ్ ఘటనే ఉదాహరణ. ఫెడరల్ "క్యాపిటల్ బీట్" కార్యక్రమంలో భాగంగా హోస్ట్ నీలూ వ్యాస్‌తో ఐపీఎస్ మాజీ అధికారి యశవర్ధన్ ఆజాద్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ వంటి కీలక పదవులో పనిచేసిన ఆజాద్ మాట్లాడుతూ.. ‘‘సింగ్‌కు వ్యతిరేకంగా ఉన్న సమస్యలు, అవినీతి ఆరోపణల వల్ల కాకుండా.. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం వల్లనే ఉద్యోగం నుంచి తొలగించడం బాధాకరం. ప్రస్తుత రాజకీయ ఒత్తిళ్ల వాతావరణంలో నిష్పాక్షిక అధికారుల సవాళ్లను ఆజాద్ ప్రస్తావించారు. నిష్పాక్షిక నైజం ఉన్న సింగ్‌ను ప్రభుత్వం వివాదాస్పద వ్యక్తిగా చిత్రీకరించింది.’’ అని పేర్కొన్నారు. అసమర్ధ అధికారులపై కాకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించే వారిపై కొరడా ఝుళిపించడాలన్ని ఆజాద్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ చర్య పోలీస్ శాఖలో నిజాయతీగా పనిచేసే అధికారులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News