కుల గణనపై ప్రధాని మోదీకి లేఖ రాసిన ఖర్గే..

‘‘రిజర్వేషన్లపై అమలులో ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగించి, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం 15(5) అధికరణను అమలు చేయాలి.’’;

Update: 2025-05-06 08:34 GMT
Click the Play button to listen to article

కుల గణన(Caste survey)పై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Kharge) ప్రధాని మోదీ(PM Modi)ని కోరారు. వెనుకబడిన, దళిత, ఆదివాసీ, ఇతర సామాజిక వర్గాలకు సంపూర్ణ సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే కుల గణన తప్పనిసరి అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై అమలులో ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగించి, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగం 15(5) అధికరణను తక్షణమే అమలు చేయాలని ఖర్గే ఒక లేఖలో మోదీని కోరారు. కులగణన విషయంలో తెలంగాణలో అమలు చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందులో రాసుకొచ్చారు.

ఖర్గే లేఖను కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని మే 2న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశ అనంతరం ఖర్గే ప్రధానికి రాశారని ఆయన పేర్కొన్నారు. 

Tags:    

Similar News