బోరబండలో హిజ్రాల హంగామా

హిజ్రా నాయకురాలిపై తిరగబడ్డ హిజ్రాలు.. పెట్రోల్ మంటలంటుకుని పలువురికి గాయాలు

Update: 2025-11-18 10:40 GMT
Hijra Agitation

హైదరాబాద్ లో హిజ్రాలు హంగామా సృష్టించారు. మాటి మాటికి కేసులు పెడుతున్న హిజ్రా నాయకురాలిపై సోమవారం తోటి హిజ్రాలు తిరగబడ్డారు. ఇందిరానగర్ లో నివాసముండే మోనాలిసా హిజ్రా నాయకురాలిగా చెలామణి అవుతోంది. శుభ కార్యాలు జరిగినప్పుడు చాలామంది తమ ఇష్టపూర్వకంగా డబ్బులు ఇస్తుంటారు. అలా కాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాలపై మోనాలిసా స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తోంది. దీంతో తోటి హిజ్రాల నుంచి మొనాలిసా ప్రతి ఘటన ఎదుర్కొంటోంది.

మోనాలిసా గతంలో పద్మ అనే హిజ్రాపై చేయి చేసుకుంది. ఇది తట్టుకోలేకపోయిన పద్మ మోనాలిసాను నిలదీయడానికి మరికొందరు హిజ్రాలతో బోరబండ ఇందిరానగర్ కు చేరుకున్నారు. మోనాలిసాపై చర్యలు తీసుకోవాలని ఆందోళన కారులు బోరబండ బస్టాప్ లో బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ను నవ్య అనే హిజ్రా తెరిచింది. అక్కడే ఉన్న మరో హిజ్రా లైటర్ వెలిగించడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అక్కడే ఆందోళన చేస్తున్న హిజ్రాలకు మంటలు అంటుకున్నాయి. పరిస్థితిని అదుపులో చేయడానికి బోరబండ స్టేషన్ హౌజ్ ఆఫిసర్ (ఎస్ హెచ్ ఒ) సురేందర్ అక్కడికి చేరుకున్నారు. ఎస్ హెచ్ ఓ కు గాయాలయ్యాయి. గాయాలపాలైన హిజ్రాలను సమీప ఆస్పత్రిలో చేర్చారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆందోళన చేసిన హిజ్రాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సురేందర్ తెలిపారు.

Tags:    

Similar News