పవిత్ర స్నానానికి 10 దేశాల నుంచి 21 మంది అంతర్జాతీయ ప్రతినిధుల బృందం

ఫిజి, ఫిన్లాండ్, గయానా, మలేసియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల ప్రతినిధులు ప్రయాగ్ రాజ్‌కు రానున్నారు.;

Update: 2025-01-15 13:11 GMT

మహాకుంభ్ మేళా(Maha Kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం (holy dip) చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్నారు. అయితే ప్రపంచం దృష్టికి ఆకర్షించే దిశగా అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించారు. 10 దేశాల నుంచి 21 మంది ప్రతినిధులు విచేస్తున్నారు. ఫిజి, ఫిన్లాండ్, గయానా, మలేసియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ఈ ప్రతినిధి బృందాన్ని భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆహ్వానించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

"ప్రతినిధి బృందం బుధవారం మహా కుంభమేళా ప్రాంతాన్ని సందర్శించనుంది. సాయంత్రం 5 నుంచి 6:30 గంటల వరకు ప్రయాగరాజ్‌లో వీరు పర్యటిస్తారు. రాత్రి టెంట్ సిటీలో బస చేస్తారు." అని యూపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ప్రతినిధి బృందం గురువారం ఉదయం 8 గంటలకు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తుంది. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో మహా కుంభం మేళాలో వీక్షించనున్నారు. వీరి పర్యటన మధ్యాహ్నం 1:30 గంటలకు ముగిస్తుంది.

‘మహా కుంభమేళా’కు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ సోమవారం నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజులపాటు గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో మహా కుంభమేళా జరగనుంది. జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగుస్తుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుక కావడంతో యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.   

Tags:    

Similar News