మహా కుంభ్ కాస్త ‘మృత్యు కుంభ్’గా మారింది

‘‘ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ మేళా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైంది’’ - పశ్చిమ బెంగాల్ సీఎం మమత;

Update: 2025-02-18 12:01 GMT
Click the Play button to listen to article

ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో మహా కుంభ్ (Maha Kumbh Mela) ఇప్పుడు ‘మృత్యు కుంభ్’గా మారిపోయిందని పశ్చిమ బెంగాల్ West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)విమర్శించారు. మరణాల సంఖ్యను తక్కువగా చూపించేందుకు వందలాది శవాలను ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు.

జనవరిలో ఉత్తర ప్రదేశ్‌(West Bengal)లోని ప్రయాగరాజ్‌లో జరిగిన తొక్కిసలాట(stampede)లో కనీసం 30 మంది చనిపోగా 60 మంది గాయపడ్డారు. ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల గురించి మమతా అసెంబ్లీలో ప్రస్తావించారు.

‘బీజేపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు’

బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు తనను ఎదుర్కొనడానికి భయపడుతున్నారని, అందుకే తాను ప్రసంగించే సమయంలో సభను బహిష్కరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

తనను ముస్లిం లీగ్‌కు చెందిన వ్యక్తి అనడంపై మమతా తీవ్రంగా స్పందించారు. "నన్ను ముస్లిం లీగ్ సభ్యురాలిగా చిత్రీకరించడం అప్రస్తుతం. అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. మతసామరస్యాన్ని విశ్వసిస్తా. అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా,’’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

నిరూపిస్తే రాజీనామా..

తనకు బంగ్లాదేశ్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను మమతా ఖండించారు. "నాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే.. నేను వెంటనే నా పదవికి రాజీనామా చేస్తా," అని సవాల్ విసిరారు.

బెంగాల్‌ ప్రశాంతంగానే..

బంగ్లాదేశ్‌(Bangladesh)లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బెంగాల్‌లో శాంతిని కాపాడడం తమ ప్రభుత్వ బాధ్యత అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. "బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా.. బెంగాల్‌లో శాంతి, సామరస్యాన్ని మా ప్రభుత్వం కొనసాగించగలిగింది," అని మమతా స్పష్టం చేశారు. 

Tags:    

Similar News