చెట్టు నుంచి రాలిన ఐదొందల నోట్ల కోసం ఎగబడిన జనం..

చెట్టు నుంచి కరెన్సీ నోట్లు రాలడం ఏంటీ? వాటి కోసం జనం ఎగబడడం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి..;

Update: 2025-08-27 10:37 GMT

డోడాపూర్ గ్రామానికి చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్ రోహితాష్ చంద్ర.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉండడంతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న రూ. 80 వేలను బైక్ డిక్కీలో ఉంచి.. వెంట వచ్చిన లాయర్‌తో కలిసి డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌లో బీజీగా ఉన్నాడు. ఇంతలో ఓ కోతి(Monkey) బైక్ డిక్కీ తెరిచి డబ్బుల సంచితో చెట్టెక్కింది. బ్యాగులో ఆహారం దొరక్కపోవడంతో రూ.500 నోట్లను గాల్లోకి విసరడం మొదలుపెట్టింది. చెట్టు నుంచి కరెన్సీ నోట్లు రాలడం చూసిన స్థానికులు.. వాటిని పట్టుకునేందుకు పోటీపడ్డారు. చివరకు జరిగిన విషయం చెప్పడంతో.. నోట్లు దొరికిన వాళ్లంతా రోహితాష్‌కు తిరిగి ఇచ్చేశారు. అలా రూ. 52 వేలు మాత్రమే అతనికి దక్కాయి. మిగిలిన రూ. 28 వేలు చేతికందలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.

తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లో కోతుల బెడద చాలా కాలంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. తరచూ అవి ఏవి పడితే అవి లాకెళ్తుంటాయని కూడా చెప్పారు. 

Tags:    

Similar News