రైలు ప్రయాణికులకు త్వరలో ప్రాంతీయ వంటకాలు..
ప్రయాణించే ప్రాంతాల ఆధారంగా అందుబాటులోకి;

రైళ్లలో ప్రయాణించేటప్పడు మనకు కొన్ని రకాల వంటకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ పద్ధతి త్వరలో మారనుంది. ప్రయాణించే ప్రాంతాన్ని బట్టి రైలు ప్రయాణికులకు స్థానిక వంటకాలను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తమిళనాడులో నడుస్తున్న వందే భారత్ రైళ్లలో దక్షిణ భారత వంటకాలు కూడా అందుబాటులో ఉండాలని డీఎంకే సభ్యురాలు సుమతి తమిజాచి తంగపాండియన్ అడిగిన ప్రశ్నలకు అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. చాలా మంది ప్యాంట్రీ కార్మికులు ప్రధానంగా హిందీ మాట్లాడతారని, దీనివల్ల కొంతమంది ప్రయాణీకులు తమ అవసరాలను తెలియజేయడం కష్టమవుతుందని ఆమె అన్నారు.
ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సేవలను మెరుగుపరచడానికి, వివిధ ప్రాంతాల విభిన్న వంటకాలను ప్రయాణికులకు రుచి చూపించడానికి భారతీయ రైల్వేలు సిద్ధమవుతాయని ఆశ్విన్ చెప్పారు.