మెహుల్ చోక్సీపై ముంబాయి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్
బెల్జియంలో బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు..;
డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ(Mehul Choksi)పై ముంబయి(Mumbai) కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అదనపు చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్.బీ. ఠాకూర్ ఈ వారెంట్ జారీ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 13 వేల కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన కేసులో మెహుల్ చోక్సితో ఆయన మేనల్లుడు నిరవ్ మోదీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి కంటే ముందు ఇద్దరూ దేశం విడిచి పరారయ్యారు. నీరవ్ మోదీ 2019 నుంచే లండన్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. భారత్ అభ్యర్థన మేరకు చోక్సీని ఏప్రిల్ 12న బెల్జియంలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను అక్కడి జైల్‌లో ఉన్నారు. బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
రూ.55 కోట్ల మోసం ...
సీబీఐ కథనం ప్రకారం.. బెజెల్ జెమ్స్ అనే కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్‌గా కెనరా బ్యాంక్ రూ.30 కోట్లు, మహారాష్ట్ర బ్యాంక్ రూ.25 కోట్లు సంయుక్తంగా మంజూరు చేశాయి. ఈ నిధులను బంగారు ఆభరణాలు, వజ్రాల తయారీకి వినియోగించాలి. ఆ డబ్బును వాటి కోసం వినియోగించలేదు. అప్పు కూడా తిరిగి చెల్లించలేదు.