‘‘భేల్ పూరి తింటుండగా వచ్చి ముస్లిమా అని అడిగారు’’

నవ వధువు భర్తను కాల్చి చంపిన ఉగ్రవాదులు, వెళ్లికి మోదీకి చెప్పండని హుకుం;

Translated by :  Chepyala Praveen
Update: 2025-04-23 12:56 GMT
వినయ్ నర్వాల్- హిమాన్షి పెళ్లి ఫొటో

‘‘నేను నా భర్త పక్కన భేల్ పూరి తింటూ ఉండగా, ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి నా భర్త వినయ్ నర్వాల్ ను ముస్లిమా అని అడిగారు. కాదు అని చెప్పగానే కాల్పులు జరిపి చంపేశారని నవ వధువు హిమాన్షి భోరున విలపించింది. స్థానికులను సాయం కోసం ఆమె కోరుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

భర్త వినయ్ నర్వాల్(26) ను వారం క్రితమే ఆమె వివాహం చేసుకుంది. ఈ యువ నావికదళ అధికారితో కలిసి శ్రీనగర్ లో అడుగుపెట్టింది. ఆ జంట స్విట్జర్లాండ్ కు విదేశాలకు వెళ్లే బదులు కాశ్మీర్ లో హనీమూన్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమె యువ భర్తను ఆమె కళ్లముందు దారుణంగా కాల్చి చంపడంలో వారి వివాహం అత్యంత క్రూరమైన రీతిలో ముగిసింది.
పహల్గాం ఊచకోత విషాదాన్ని సూచించే ఛాయాచిత్రంలో తన భర్త మృతదేహం పక్కన కూర్చున్న మహిళ హిమాన్షి. ఈ ప్రస్తుతం ఈ చిత్రం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారుతోంది.
‘‘మొదట మేము దానిని బాణసంచా అని అనుకున్నాము. తరువాత ప్రజలు కేకలు వేయడం ప్రారంభించారు’’ అని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పహల్గామ్ గడ్డి మైదానంలో జరిగిన భయంకరమైన మారణహోమం గురించి వివరించాడు.
పర్యాటకులు అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, యూనిఫాంలో మారువేషంలో ఉన్న ఉగ్రవాదులు దట్టమైన అడవుల నుంచి బయటకు వచ్చి పర్యాటకుల వద్దకు నడుచుకుంటూ వచ్చారు. మీరు ముస్లింలా లేదా కొన్ని ఇస్లామిక్ శ్లోకాలు పఠించమని అడిగిన తరువాత వారిని కాల్చి చంపారు.
ఇటీవల సంవత్సరాలలో జమ్మూకాశ్మీర్ లో జరిగిన అత్యంత ఘోరమైన పౌరదాడులలో ఇది ఒకటి అని చెబుతున్నారు. ప్రసిద్ద హిల్ స్టేషన్ పహల్గామ్ నుంచి 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైరసాన్ గడ్డి మైదానంలో జరిగిన ఈ దాడి దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగించింది. ఉగ్రవాదులు భయం లేకుండా కాల్పులు జరపుతూ తిరిగారు.
ఊచకోత..
దట్టమైన అడవుల నుంచి యూనిఫాం ధరించిన ముగ్గురు నుంచి నలుగురు పురుషులు దిగి వచ్చారని ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ చెప్పింది. ‘‘వారు పేర్లు అడిగారు. మేము వారిని పోలీసులని అనుకున్నాము’’ అని ఒక మహిళ చెప్పింది.
కొంతమంది పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మరికొందరిని వారు దాక్కున్న గుడారాల నుంచి బయటకు లాగి కాల్చి చంపారు.
ఇస్లామిక్ శ్లోకాలను పఠించమని అడిగారు..
పూణేకు చెందిన ఐదుగురు సభ్యుల కుటుంబం సాంప్రదాయ కాశ్మీరీ దుస్తులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. కానీ అది జీవితాంతం వెంటాడే గుర్తుగా మిగిలిపోయింది. ఈ కుటుంబ సభ్యులలో ఒకరైన 26 హెచ్ ఆర్ ప్రొఫెనషనల్ అసవాలే జగదారి జాతీయ మీడియాకు చెప్పారు.
‘‘చుట్టూ చాలామంది పర్యాటకులు ఉన్నారు. కానీ ఉగ్రవాదులు ప్రత్యేకంగా పురుష పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని, వారు హిందువులా లేదా ముస్లింలా అని అడిగారు.’’ అని ఆమె గుర్తు చేసుకుంది. వారు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో కనిపించి విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారని ఆమె అన్నారు.
మొదట్లో ఇది ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన దాడిగా అనుకున్నామని చెప్పారు. చాలామంది పర్యాటకులు కాల్పుల శబ్ధం విని నేలపై పడుకున్నారని, అయితే టెంట్ లోకి వెళ్లిన ఉగ్రవాదులు దొరికిన వారిని దొరికినట్లుగా కాల్చివేశారని అన్నారు.
కల్మా చదవమని ఒత్తిడి చేసిన ఉగ్రవాదులు..
పుణే నుంచి కాశ్మీర్ వచ్చిన వ్యాపారవేత్త సంతోష్ జగ్డేల్ ను బయటకు పిలిచిన ఉగ్రవాదులు కల్మా చదవమని అన్నారు.
‘‘చౌధారి తు బహర్ ఆ జా’’ అని అన్నారని, తరువాత తన రాజకీయ నమ్మకాల గురించి అడిగారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారని, దాడి చేసే ముందు ఇస్లామిక్ కల్మా చదవమని ఆదేశించారని, అందులో విఫలం కాగానే తలపై కాల్చి చంపారని విలిపిస్తూ చెప్పారు. మాతో పాటు అక్కడే ఉన్న చాలామందిని కాల్చి చంపారని అన్నారు.
అక్కడ సాయం చేయడానికి ఎవరూ లేరు అని, దాదాపు 20 నిమిషాల తరువాత పోలీసులు, సైన్యం అక్కడకు వచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దాడి గురించి మోదీకి చెప్పు..
కర్ణాటకలోని శివ మొగ్గకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తిని అతని భార్య పల్లవి ముందే కాల్చి చంపారు. తన భార్య, కుమారుడితో కలిసి వెళ్లిన ఆయన, మధ్యాహ్నం 1.30 నిమిషాలకు వచ్చిన ఉగ్రవాదులు కాల్చి చంపారు.
‘‘నా కళ్లముందే చంపివేశారు’’ అని పల్లవి జాతీయ మీడియా ముందు రోదిస్తూ చెప్పారు. తనను, తన కుమారుడిని కూడా కాల్చివేయమని వేడుకున్నారు. కానీ ఈ దాడి గురించి మోదీకి చెప్పమని, అందుకే విడిచిపెడుతున్నామని చెప్పారు. తరువాత స్థానికులు వారిని రక్షించారు.
తలపై కాల్చి చంపారు..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ కుమార్ సత్పతి, సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్, టెక్నాలజీ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. తన భార్య ప్రియదర్శిని, తొమ్మిదేళ్ల కుమారుడితో కలిసి కాశ్మీర్ కు వెళ్లాడు. రోప్ వే రైడ్ ముగించుకుని సమీపంలోని రెస్టారెంట్ కు వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపారు.
‘‘నేను షాక్ కు గురయ్యాను. నా భర్త తల నుంచి రక్తం కారుతోంది. నేను సాయం కోసం పరిగెత్తాను. తిరిగి వచ్చే సమాయానికి ఆర్మీ మా ఆయనను ఆస్పత్రికి తరలించింది. అయితే సత్పతి తరువాత గాయాలతో మరణించాడు’’ భార్య, బిడ్డ ముందే సత్పతిని కాల్చి చంపిన జ్ఞాపకాలను ఎప్పటికీ తుడిచిపెట్టలేరు.
భారత ప్రభుత్వానికి చెప్పండి..
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న కాన్పూర్ నివాసీ శుభం ద్వివేదీ, అతని భార్య పహల్గామ్ లో ప్రకృతి దృశ్యాలను చూస్తూ మ్యాగీ తింటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు యూనిఫాంలో వచ్చి ముస్లింలేనా అని అడిగారు.
ఇస్లామిక్ కు చెందిన కల్మాను చదవమని అడిగారు. వారు స్పందించకపోవడంతో ఉగ్రవాదులు శుభం తలపై కాల్చి చంపారు. దాడి చేసిన తరువాత ఉగ్రవాదుల అతని భార్య తలపై తుపాకీ పెట్టి ఈ విషయం భారత ప్రభుత్వానికి చెప్పామని అన్నారు.
శుభం భార్య తీవ్ర గాయాలతో బాధపడుతోంది. బెంగాల్ కు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ప్రస్తుతం హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న మనీష్ రంజన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న వాహానాన్ని ఉగ్రవాదులు ఆపి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు.
Tags:    

Similar News