‘సింధూ’ కాల్వలను విస్తరించబోతున్న భారత్!
పాకిస్తాన్ నీటి వినియోగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-18 10:05 GMT
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్, క్రమంగా నదీ వ్యవస్థలో నీటిని తాను ఉపయోగించుకోవడానికి సిద్దమవుతోంది. సింధు నదీ జలాలను వాడుకోవడానికి వీలుగా వాటిపై నిర్మించిన కాల్వలను పునరుద్దరించడానికి ప్రణాళికలు రచిస్తోంది.
ప్రణాళిక ఏమిటీ..
జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. కేంద్రం ప్రభుత్వం చీనాబ్, రావి పై ఉన్న కాల్వలను ప్రాధాన్యత ప్రాతిపదికన పునర్మించి విస్తరించాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగా రణ్ బీర్, న్యూ పార్తాప్, రంజన్, తావి లిప్ట్, పరాగ్వాల్, కథువా కాల్వలు అలాగే రావి కాల్వలలో నీటిని తరలించే సామర్థ్యాన్ని పెంచడానికి భారత్ సిల్టింగ్ పనులను చేపట్టాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుంది. సాంకేతిక మార్గదర్శకత్వం కేంద్రం అందిస్తుంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఫలితంగా సింధు జల ఒప్పందం నిలిపివేయబడటానికి ముందే మారిన జనాభా పరిస్థితి, ఇతర అవసరాల దృష్ట్యా ఒప్పందం నిబంధనలలో మార్పుల కోసం భారత్ పదేపదే పాకిస్తాన్ పై ఒత్తిడి చేస్తోంది. నోటీసులు సైతం పంపింది. కానీ దీనికి దాయాదీ దేశం స్పందించలేదు.
లక్ష్యాలు..
నీటిపారుదల అవసరాలను తీర్చడానికి కాలువల నీటి మోసే సామర్థ్యం పెంచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం అని ఒక అధికారి జాతీయ మీడియాతో అన్నారు.
సింధు నదుల కాల్వలు విస్తరించినట్లయితే భారత్ లోని దాదాపు 60 శాతం నికర సాగునీటి అవసరాలను తీర్చే రుతుపవనాలపై ఆధారపడే ఆగత్యం తప్పుతుంది. అందువల్ల ఈ కాల్వల నిర్మాణం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘జమ్మూ ప్రాంతం ఏడాది పొడవునా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. కానీ నీటి కొరత వ్యవసాయానికి ఎల్లప్పుడూ ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీటిపారుదల వ్యవస్థ సరిగా లేవు.
దేశంలోని ఉత్తర భాగంలో ఉండటం వలన ఇక్కడ రుతుపవనాలు చాలా ఆలస్యంగా వస్తాయి. లోతట్టు ప్రాంతాలలో కాకుండా కొన్ని వారాల్లోనే తిరోగమనం చెందుతాయి’’ అని జాతీయ మీడియా చెప్పినట్లు సమాఖ్య ఉద్యావన అధికారి అభయ్ సింగ్ చెప్పారు.
రణబీర్ కాల్వ విస్తరణ
భారతదేశ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం రణబీర్ కాల్వ పొడవును 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకు పెంచడం. దీనివలన భారత్ ప్రస్తుతం 40 క్యూబిక్ మీటర్ల నుంచి సెకన్ కు 150 క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించగలదు.
ఈ చర్య పాకిస్తాన్ లోని కీలక వ్యవసాయ ప్రాంతమైన పంజాబ్ ప్రావిన్స్ కు నీటి ప్రవాహాన్ని చాలావరకూ తగ్గించగలదు. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం రణబీర్ కాల్వ ద్వారా తీసుకెళ్లే నీటిలో వేయి క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటిని నీటిపారుదల కోసం ఉపయోగించలేరు.
పార్టాప్ ఛానెల్ కూడా..
కేంద్రం కూడా పార్టాప్ ఛానెల్ పై దృష్టి సారించింది. మీడియా నివేదికల ప్రకారం.. పాత పార్టప్ కాల్వల గతంలో చీనాబ్ నది కుడి వైపున దేవీపూర్ అనే గ్రామం సమీపంలో, న్యూ పార్టప్ ఛానెల్ ప్రధాన భూభాగం నుంచి 20 కిలోమీటర్ల దిగువన ఒపెన్ చేసేవారు.
న్యూపార్టప్ కాలువ దాదాపు 34 కిలోమీటర్ల పొడవు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో కేవలం 9030 హెక్టార్ల నీటిపారుదల అవసరాలకు మాత్రమే నీరు అందిస్తోంది.
పాకిస్తాన్ ప్రభావం..
పాకిస్తాన్ లో తన వ్యవసాయంలో దాదాపు 80 శాతం సింధు నదీ జలాల వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంది. ఈ చర్య పాకిస్తాన్ వ్యవసాయం పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రసారం చేసింది.
సింధు జల ఒప్పందం ప్రకారం తన వాటాలో నీటిని మళ్లించే ఏ చర్య అయిన యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ గతంలో చేసిన ప్రకటన సింధు జల వ్యవస్థపై లోని నీరు పంపకం ఆధారపడి ఉంది.