‘‘ఏకపక్ష బెదిరింపులను అంగీకరించబోము’’

అమెరికా చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్- చైనా;

Update: 2025-08-19 10:54 GMT
భారత విదేశాంగ ఎస్ జైశంకర్ తో చైనా మంత్రి వాంగ్ యీ

ప్రపంచ దేశాలపై సుంకాలు విధించాలన్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యపై భారత్- చైనా గర్హించాయి. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో జరిగిన సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ  సుదీర్ఘంగా చర్చించుకున్నారు.

అంతర్జాతీయ పరిస్థితి వేగంగా మారుతోందని ఏకపక్ష బెదిరింపులు ప్రబలంగా మారుతున్నాయని, అంతర్జాతీయ క్రమంతో పాటు పాటు స్వేచ్ఛా వాణిజ్యం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి.

‘‘నేటీ ప్రపంచంలో మారుతున్న పరిస్థితి వేగంగా అభివృద్ది చెందుతోందని ఏకపక్ష బెదిరింపు పద్దతులు ప్రబలంగా ఉన్నాయని, స్వేచ్ఛా వాణిజ్యం, అంతర్జాతీయ వ్యాపారం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు కూడా అయిన వాంగ్ అన్నారు’’ అని జిన్హువా వార్తా సంస్థ ఉటంకించి వార్తలు ప్రసారం చేసింది.
భారత్ తో అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ భారతీయ వస్తువులపై 25 శాతం సుంకంతో పాటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసినందుకు మరో 25 శాతం ప్రతీకార సుంకాన్ని విధించింది. దీనితో భారత్ పై  మొత్తం అమెరికా విధించిన సుంకం రేటు 50 శాతానికి పెరిగింది.
భారత్- చైనా సంబంధాలలో సానుకూల ధోరణి..
చైనా- భారత్ సంబంధాలు సానుకూల ధోరణిని చూపిస్తున్నాయని వాంగ్ యీ జైశంకర్ తో అన్నారు. గల్వాన్ ఘర్షణ, తూర్పు లడఖ్ లో రెండు దేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన తరువాత నాలుగు సంవత్సరాలుగా భారత్- చైనా సంబంధాలు తెగిపోయిన విషయాన్ని స్పష్టంగా ప్రస్తావిస్తూ, చైనా.. భారత్ గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలని వాంగ్ అన్నారు. ఈ సంవత్సరం రెండు పొరుగు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని కూడా ఆయన గుర్తు చేశారు.
సరైన వ్యూహాత్మక అవగాహానలు..
ఇరుపక్షాలు ఒకరినొకరు ప్రత్యర్థులు లేదా బెదిరింపులు చూడకుండా వ్యూహాత్మక అవగాహానలను సరిదిద్దుకోవాలని, బదులుగా ఒకరినొకరు భాగస్వాములుగా, అవకాశాలుగా పరిగణించాలని వాంగ్ అన్నారు.
ప్రధాన పొరుగు దేశాలు, పరస్పర గౌరవం, నమ్మకంతో సహజీవనం చేయడానికి ఉమ్మడి అభివృద్దిని అనుసరించడానికి, విజయవంతమైన సహకారాన్ని సాధించడానికి రెండు దేశాలు సరైన మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.
భారత్ తో కలిసి పనిచేయడానికి చైనా సిద్దం
చైనా స్నేహం, నిజాయితీ, పరస్పరం ప్రయోజనం, సమ్మిళితత్వం అనే సూత్రాలను నిలబెట్టడానికి సిద్ధంగా ఉందని, శాంతియుత సురక్షితమైన సంపన్నమైన, అందమైన స్నేహపూర్వక గృహాన్ని సంయుక్తంగా నిర్మించడానికి భారతదేశంతో సహ పొరుగు దేశాలతో కలిసి పనిచేస్తుందని వాంగ్ అన్నారు.
రెండు దేశాలు నమ్మకంగా ఉండాలని, ఒకే దిశలో పయనించాలని అడ్డంకులు తొలగించాలని సహకారాన్ని విస్తరించాలని, ద్వైపాక్షిక సంబంధాల మెరుగైన వేగాన్ని ఏకీకృతం చేయాలని ఆయన అన్నారు.
రెండు గొప్ప నాగరికతలు పునర్జీవన ప్రక్రియలు పరస్పరం ప్రయోజనకరంగా ఉంటాయని ఆసియాకు, ప్రపంచానికి స్థిరత్వాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.
సంబంధాల బలోపేతం..
కొన్ని నివేదికల ప్రకారం.. వాంగ్, జైశంకర్ మధ్య జరిగిన చర్చల తరువాత రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల ఊపును కొనసాగించడానికి అంగీకరించాయి. 2020 లో జరిగిన గల్వాన్ వ్యాలీ ఘర్షణల తరువాత తీవ్ర ఒత్తిడికి గురైన తరువాత రెండు పొరుగు దేశాలు తమ సంబంధాన్ని పునర్మించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వాంగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 
Tags:    

Similar News