సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను ప్రశంసించిన ఎస్పీ ఎమ్మెల్యే

ఇరవై సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే పూజా పాల్ భర్తను హత్య చేసిన గ్యాంగ్ స్టర్స్, రౌడీ రాజ్ ను అణచివేసిన యూపీ సీఎం;

Update: 2025-08-14 12:31 GMT
ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ప్రశంసించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకుంది.

2005 లో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ చేతిలో హత్యకు గురైన తన భర్త రాజు పాల్ కు న్యాయం చేశారని సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను ప్రశంసించారు.

‘విజన్ డాక్యుమెంట్ 2047 పై 24 గంటల పాటు జరిగిన మారథాన్ చర్చలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీని ఉద్దేశించి పాల్ ప్రసంగించారు. న్యాయం కోసం అందరిని ప్రాధేయపడ్డానని, తన మాటను సీఎం యోగీ విన్నారని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఎస్పీ పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి.
యోగీ న్యాయం చేశారు..
‘‘నా భర్త పాల్ ను ఎవరు హత్య చేశారో అందరికి తెలుసు. మరెవరూ నాకు న్యాయం చేయనప్పుడూ నా వాదన విన్నందుకు, నాకు న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని పాల్ జాతీయ మీడియాకు తెలిపారు.
అతిక్ అహ్మద్ వంటి నేరస్థులను తటస్థీకరించడానికి దారితీసిన నేరాలకు జీరో టాలరెన్స్ వంటి విధానాలను ప్రవేశపెట్టి అమలు చేయడం ద్వారా తనలాంటి అనేక మంది మహిళలకు న్యాయం అందించినందుకు ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆయన వైపు నమ్మకంగా చూస్తుందని అన్నారు.
నేరస్థులతో పోరాడాలని ఎవరూ అనుకోరు..
తాను గొంతు పెంచినప్పుడు అతిక్ అహ్మద్ లాంటి నేరస్థులకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడాలని కోరుకోవడం లేదని తాను గ్రహించానని పాల్ అన్నారు. తన ప్రయత్నాలు ఆగిపోయాయని భావించినప్పుడూ ముఖ్యమంత్రి తనకు న్యాయం చేశారని కూడా పూజా పాల్ చెప్పుకొచ్చారు.
‘‘అతీక్ అహ్మద్ లాంటి నేరస్థులకు వ్యతిరేకంగా ఎవరూ పోరాడటానికి ఇష్టపడటం లేదని చూసినప్పుడూ నేను నా గొంతు పెంచాను. ఈ పోరాటంలో నేను అలిసిపోయినట్లు అనిపించినప్పుడూ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నాకు న్యాయం చేశారు’’ అని ఆమె పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..
పూజా పాల్ భర్త, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) మాజీ ఎమ్మెల్యే రాజు పాల్ వివాహం జరిగిన కొన్ని రోజుల తరువాత జనవరి 25, 2005 న కాల్చి చంపబడ్డాడు. పోలీసుల ప్రకారం.. ఈ హత్య అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్ తో రాజకీయ శత్రుత్వం ఫలితంగా జరిగింది.
అతను 2004 లో ప్రయాగ్ రాజ్ వెస్ట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాజు పాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఫిబ్రవరి 2023 లో ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను కూడా గ్యాంగ్ స్టర్ హత్య చేయించారు.
పాల్ హత్య జరిగిన కొన్ని రోజుల తరువాత అతిక్- అష్రఫ్ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాగ్ రాజ్ లో వైద్య పరీక్షల కోసం పోలీసులు తీసుకెళ్తుండగా వీరిని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో అతిక్ కుమారుడు అసద్ మరణించిన వెంటనే వీరిని కూడా దుండగులు కాల్చి చంపారు.
Tags:    

Similar News