బీజేపీ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మార్చేస్తుందా?

ఈ ఎన్నికల్లో బీజేపీ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటు తరువాత పార్టీ సంస్థాగతం మొత్తం మార్పులు చేసే అవకాశం..

By :  Gyan Verma
Update: 2024-06-06 05:44 GMT

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. కానీ బీజేపీ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ రాలేదు. ప్రభుత్వ ఏర్పాటు తరువాత తన సంస్థాగత నిర్మాణాన్ని మరోసారి పూర్తిగా సవరించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది.

ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్రమంత్రి వర్గంలో చేరే అవకాశం ఉంది. తరువాత పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. కొత్త ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. నడ్డా పదవీకాలం జనవరిలోనే ముగిసింది. కానీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని పెంచారు. జేపీ నడ్డాకు కేంద్రమంత్రి పదవి కొత్త కాదు. ఇంతకుముందు నరేంద్ర మోదీ మొదటి టర్మ్ లో ఆయన కేంద్రమంత్రిగా విధులు నిర్వహించారు.
కొత్త ముఖాలు..
“ప్రస్తుతం బిజెపి మొదటి ప్రాధాన్యత ప్రభుత్వ ఏర్పాటు. తరువాతే పార్టీ నిర్మాణంలో ఏవైనా మార్పులు చేసే అవకాశం ఉంది. తొందరేం లేదు. బీజేపీ అనేది ఎవరి పదవీకాలాన్ని పొడిగించలేని ప్రభుత్వ సంస్థ కాదు,” అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ఆర్‌పి సింగ్ ది ఫెడరల్‌తో అన్నారు.
నడ్డా కేంద్ర మంత్రి మండలిలో భాగమయ్యే అవకాశం ఉన్నందున, 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత బీజేపీ తన ఎన్నికల యంత్రాంగాన్ని చక్కదిద్దేందుకు తన జాతీయ జట్టు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా యూనిట్లలో మార్పులను ప్రారంభించనుంది.
బిజెపి నాయకత్వం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాకు కూడా కేంద్రంలో చోటు కల్పించవచ్చు. వీరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని
మాజీ మంత్రులకు కొత్త పాత్ర
లోక్‌సభ ఎన్నికల్లో 15 మందికి పైగా కేంద్ర మంత్రులు ఓడిపోవడంతో వారిలో కొందరికి పార్టీ సంస్థలో స్థానం లభించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రముఖ మంత్రుల్లో స్మృతి ఇరానీ, అజయ్ మిశ్రా తేనీ, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్, కైలాష్ చౌదరి, మహేంద్ర నాథ్ పాండే, కౌశల్ కిషోర్, సాధ్వి నిరంజన్ జ్యోతి, సంజీవ్ బల్యాన్, రావ్ సాహెబ్ దాన్వే, ఆర్కే సింగ్. వి మురళీధరన్, ఎల్ మురుగన్, సుభాస్ సర్కార్, నిషిత్ ప్రమాణిక్ స్థానంలో భాగస్వామ్య పార్టీలకు అవకాశం కల్పిస్తారని తెలిసింది.
ప్రభుత్వంలో కొంతమంది సీనియర్ నాయకులకు స్థానం కల్పించడమే కాకుండా, పార్టీ, కొత్త జాతీయ విభాగం ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో బిజెపి పెరుగుతున్న ఉనికిని ప్రతిబింబిస్తుందని బిజెపి అగ్ర నాయకులు తెలిపారు.
మిత్రులకు అనుకూలత
గత రెండు పర్యాయాల మాదిరిగా కాకుండా, బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించి, మిత్రపక్షాలపై ఆధారపడనప్పుడు, ఈసారి, మ్యాజిక్ ఫిగర్‌కు దూరమైన ఆ పార్టీ, దాని మిత్రపక్షాలకు క్యాబినెట్ బెర్త్‌లలో కొంత భాగాన్ని కేటాయించాల్సి ఉంటుంది.
2009, 2014తో పోల్చితే ఈసారి కేంద్ర మంత్రి మండలిలో తమ మిత్రపక్షాలకు గరిష్ట ప్రాతినిధ్యం ఉంటుందని బీజేపీ సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు.
“మేము NDAతో ఉన్నాము, మాకు ఎటువంటి డిమాండ్లు లేవు. ఈ చర్చలు తదుపరి దశలో జరుగుతాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మా నాయకుడు నితీష్ కుమార్ ఇప్పటికే రెండుసార్లు బిజెపి నాయకత్వంతో మాట్లాడారు, ”అని జెడియు సీనియర్ నాయకుడు రామ్ నాథ్ ఠాకూర్ ది ఫెడరల్‌తో అన్నారు.
బీజేపీ విస్తరిస్తోంది
మరోవైపు మరో రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“ఈ ఎన్నికల ఫలితాలు ముఖ్యమైనవి. బీజేపీ ఇప్పుడు పాన్-ఇండియా పార్టీగా మారింది, ఎందుకంటే మనకు ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉంది. ఒడిశాలో బిజెపి అధికారం చేపట్టగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్‌డిఎ ప్రభుత్వానికి పట్టం కట్టారు. మేము కర్ణాటకలో మా ఆధిపత్యాన్ని కొనసాగించాము. కేరళ, తెలంగాణలో కూడా మంచి పనితీరును కనబరిచాము, ”అని బిజెపి రాజ్యసభ ఎంపి లహర్ సింగ్ సిరోయా ది ఫెడరల్‌తో అన్నారు.
లోక్‌సభ ఫలితాలపై ప్రతిపక్షాలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నాయని సిరోయా ప్రశ్నించారు. “బిజెపి 242 ఎంపిలతో అతిపెద్ద పార్టీగా ఉంది. నరేంద్ర మోదీ నాయకుడిగా ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్‌కు 99 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. అన్ని ప్రతిపక్షాల కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి.


Tags:    

Similar News