‘గర్భాకు హిందువులు మాత్రమే రావాలి’’
మధ్యప్రదేశ్ మంత్రి, విగ్రహారాధనను నమ్మనివారికి మా ఆరాధనతో ఏం సంబంధం అని వ్యాఖ్యలు
By : The Federal
Update: 2025-09-23 12:55 GMT
హిందూ మతాన్ని నమ్మనివారు, హిందు ఆచారాలైన గర్భా లాంటి వేడుకకు ఎందుకు వస్తారని మధ్యప్రదేశ్ క్యాబినేట్ మంత్రి విశ్వాస్ సారంగ్ ప్రశ్నించారు. ఈ వేడుకకు కేవలం హిందువులు మాత్రమే రావాలన్నారు. గర్భాకు హజరయ్యేవారు తమ గుర్తింపును వెల్లడించాలని కూడా సారంగ్ చెప్పారు.
గర్భా వినోదం కాదు..
హిందుమతాన్ని నమ్మనివారు గర్భాకు ఎందుకు హజరవ్వాలని అనుకుంటున్నారని అన్నారు. ఇది వినోద కార్యక్రమం కాదని, దేవీ ఆరాధన అని చెప్పారు.
‘‘గర్భా అనేది పూర్తిగా హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం మతపరమైన ఆచారం. హిందూ మతాన్ని అనుసరించేవారు మాత్రమే గర్భాకు వెళ్లాలి. హిందువులు మాత్రమే గర్భాకు వెళ్లాలి. ఇది వినోద కార్యక్రమం కాదు’’ అని సారంగ్ జాతీయ మీడియాకు చెప్పారు.
‘‘కాబట్టి అక్కడికి వెళ్లే వారు తమ గుర్తింపును వెల్లడించడం చాలా అవసరం. హిందూ మతాన్ని అనుసరించని వారు కూడా అక్కడికి ఎందుకు వెళతారు? ఇది వినోద కార్యక్రమం కాదు. ఇది దేవీ మా ప్రార్థన, ఆచారాలు’’ అని ఆయన అన్నారు.
వీహెచ్ పీ గర్భా వాదన..
గర్భా కార్యక్రమాలకు హిందువులు మాత్రమే హజరుకావడానికి అనుమతి ఉందని, నిర్వాహకులు ఆధార్ కార్డులను ఉపయోగించి హజరైన వారిని ధృవీకరించాలని విశ్వ హిందూ పరిషత్ పేర్కొన్న కొన్ని రోజుల తరువాత సారంగ్ వ్యాఖ్యలు వచ్చాయి.
గర్భా అనేది కేవలం వినోదం కాదని, ఒక ఆరాధన అని వీహెచ్పీ ప్రతినిధి శ్రీ రాజ్ నాయర్ ఉద్ఘాటించారు. విగ్రహారాధనను నమ్మనివారిని మినహయించాలని ఆయన నొక్కి చెప్పారు.
మహారాష్ట్ర బీజేపీ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే వీహెచ్పీ వైఖరిని సమర్థించారు. పోలీసుల అనుమతి ఉంటే ఈవెంట్ నిర్వాహాకులు అలాంటి షరతులు విధించవచ్చని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడేట్టివార్ వీహెచ్పీ చర్యను విభజననాత్మకంగా విమర్శించారు. ‘‘వీరు సమాజాన్ని తగలబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు’’ అని పేర్కొన్నారు.
గర్భా కార్యక్రమాలకు భద్రతా సూచనలు..
మధ్యప్రదేశ్ మంత్రి ఈ మాటలు అనగానే.. భోపాల్ కలెక్టర్ పండగ సీజన్ లో జిల్లాలో జరిగే అన్ని గర్భా, దాండియా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు కఠినమైన భద్రత ప్రోటోకాల్ లను తప్పనిసరి చేస్తూ ఒక ఆదేశం జారీ చేశారు.
ఈ ఉత్తర్వూ ప్రకారం.. గుర్తింపు ధృవీకరణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, అగ్నిమాపక భద్రతా చర్యలు వంటి ఇతర నిబంధనలను తప్పనిసరి చేస్తుంది. చెల్లుబాటు అయ్యే గుర్తింపు ధృవీకరణ లేకుండా అటువంటి కార్యక్రమాలకు ప్రవేశం అనుమతించరని పేర్కొంది.
గుర్తింపు కార్డు లేకపోతే..
‘‘భోపాల్ జిల్లాలో గర్భా, దాండియా, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే నిర్వాహాక కమిటీ వారి గుర్తింపు కార్డును ధృవీకరించకుండా ఏ వ్యక్తిని వేదికలోకి ప్రవేశించడానికి అనుమతించరు. పైన పేర్కొన్న ఏర్పాట్లు నిర్ధారించకపోతే నిబంధనల ప్రకారం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటారు’’ అని ఆదేశాల్లో పేర్కొంది.
‘‘ఉత్సవాల సమయంలో వేదిక లోపలికి ఎటువంటి అక్రమ ఆయుధాన్ని తీసుకెళ్లకుండా నిర్వాహాక కమిటీ భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. భద్రతను నిర్ధారించడానికి విద్యుత్ సంబంధిత పనులన్నీ పూర్తి చేయాలి. విద్యుత్ శాఖ నుంచి దానికి సంబంధించిన సర్టిఫికెట్ తప్పనిసరి’’ అని ఉత్తర్వూలో పేర్కొంది.