ఢిల్లీ హైకోర్టుకు మమ్మల్ని విచారించే అధికారం లేదన్న ఓపెన్ ఏఐ

తన డేటాను అనుమతి లేకుండా వాడుకుంటోందని ఏఎన్ఐ కేసు ప్రతిస్పందనగా రిజాయిండర్ పిటిషన్ లో చాట్ జీపీటీ వింత వాదన;

Update: 2025-01-23 11:17 GMT

కాపీ రైట్ ఉల్లంఘన కేసు ఎదుర్కొంటున్న ఒపెన్ ఏఐ, చాట్ జీపీటీ కోసం ఉపయోగించిన శిక్షణ డేటా యూఎస్ చట్టాలకు విరుద్దంగా ఉన్నందున దానిని తీసివేయలేమని మైక్రోసాప్ట్ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఓపెన్ ఏఐ అమెరికా కు చెందిందని, దానికి దేశంలో అసలు ఎలాంటి ఉనికి లేదని కాబట్టి స్థానిక వార్తా సంస్థ ఏఎన్ఐ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించడానికి ఢిల్లీ హైకోర్టు అధికార పరిధి కూడా లేదని పేర్కొంది.

ఒపెన్ ఏఐ పై దావా
యూఎస్ ఆధారిత ఒపెన్ ఏఐ పై గత ఏడాది నవంబర్ లో వార్తా సంస్థ ఏఎన్ఐ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. చాట్ జీపీటీకి శిక్షణ ఇవ్వడానికి అనుమతి లేకుండా వార్తా సంస్థ ప్రచురించిన కంటెంట్ ను ఉపయోగిస్తోందని ఏఎన్ఐ తన కేసులో ఆరోపించింది.
చాట్ జీపీటీ ద్వారా ఒపెన్ ఏఐ వాడుకుంటున్న తన ఏఎన్ఐ డేటాను తొలగించాలని కోరింది. ఈ కేసుపై ఒపెన్ ఏఐ రిజాయిండర్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా జనవరి 10న స్పందించింది. తన పిటిషన్ లో ఇది భారతీయ న్యాయస్థానాల ప్రక్రియకు లోబడి ఉండదని, అసలు కేసు న్యాయస్థానాల పరిధిలోకే రాదంటూ పేర్కొంది. కంపెనీకి దేశంలో కార్యాలయం గానీ, మరేదేది లేదని, ఇవన్నీ దేశం వెలుపల ఉన్నాయని, అలాగే చాట్ జీపీటీ సర్వర్లు కూడా విదేశాల్లో ఉన్నాయని వాదించింది.
అమెరికాలోనూ ఇలాంటి కేసే..
చాట్ జీపీటీ పై అమెరికా కోర్టుల్లోనూ ఇలాంటి కేసు నమోదు అయింది. ముఖ్యంగా ది న్యూయార్క్ టైమ్స్, ది సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ సంస్థలు అమెరికా కోర్టులో ఓపెన్ ఏఐ, మైక్రోసాప్ట్ కు వ్యతిరేకంగా కేసు దాఖలు చేశాయి. చాట్ జీపీటికి శిక్షణ ఇవ్వడానికి తమ కంటెంట్ లను అనుమతి లేకుండా వాడుకుంటున్నాయని ఆరోపించాయి. ఒపెన్ ఏఐ తమ సంస్థతో పోటీ పడే కృత్రిమ మేధస్సు ఉత్పత్తులను తీసుకురావడానికి తమ డేటాను ఉపయోగిస్తూ చట్టవిరుద్దంగా బెదిరింపులకు దిగుతున్నట్లు టైమ్స్ వాదించింది. అయితే ఈ ఆరోపణలను ఓపెన్ ఏఐ ఖండిస్తోంది.
డేటాను తొలగించలేము..
చాట్ జీపీటీ సిస్టమ్ లోని స్టోర్ చేసిన దాని డేటాను తీసివేయమని ఏఎన్ఐ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందించిన ఒపెన్ ఏఐ తమ మోడల్ లు శిక్షణ పొందిన డేటాపై దావా వేస్తున్నట్లు తెలిపింది. యూఎస్ చట్టాలు పెండింగ్ లో ఉన్నప్పుడూ మొత్తం డేటాను తమ దగ్గరే ఉండాలని కోరినట్లు జనవరి 10న సమర్పించిన ప్రమాణ పత్రంలో పేర్కొంది. యూఎస్ చట్టాల ప్రకారం శిక్షణ డేటాను భద్రపరచడం చట్టపరమైన బాధ్యత అని పేర్కొంది. అలాగే ఇకముందు ఏఎన్ఐ వార్తా సంస్త డేటాను కూడా ఉపయోగించమని హమీ ఇచ్చింది.
ఓపెన్ ఏఐ వార్తా సంస్థలతో వాణిజ్య భాగస్వామ్యలను కుదుర్చుకున్నప్పటికీ అది అన్యాయమైన పోటీని తీసుకువస్తున్నట్లు తమకు ఆందోళన ఉందని ఎఎన్ఐ పేర్కొంది. వినియోగదారుల ప్రాంప్ట్ లకు ప్రతిస్పందనగా చాట్ జీపీటీ ఇతర సంస్థల పదజాలం, సారూప్యాల పునరుత్పత్తి చేస్తోందని పేర్కొంది. అందుకే తన సొంతపదాజాలం సొంతంగా ఒపెన్ ఏఐ సృష్టించుకోవాలని వాదించింది. ఈ వాదనపై ఓపెన్ ఏఐ స్పందించింది.
ప్రతిస్పందన దాఖలు చేయబోతున్నాం.. ఏఎన్ఐ
తమ పిటిషన్ పై ఒపెన్ ఏఐ స్పందించిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఎఎన్ఐ స్పందించింది. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టుకు అధికార పరిధి లేదని చెప్పిన నేపథ్యంలో దాని వాదనలను వినిపించడానికి సిద్ధమైంది. విశేషమేమిటంటే ఓపెన్ ఏఐ కంటెంట్ ను ఉపయోగించడానికి టైమ్ మ్యాగజైన్, ఫైనాన్షియల్ టైమ్స్, బిజినెస్ ఇన్ సైడర్ ఒనర్ ఆక్సెల్ స్ప్రింగర్, ఫ్రాన్స్ కు చెందిన లే మోండే, స్పెయిన్ కు చెందిన ప్రీసాతో ఒప్పందాలు చేసుకుంది. తదుపరి విచారణ జనవరి 28 న జరగబోతోంది.
Tags:    

Similar News