ట్రంప్ కు జమ్మూకాశ్మీర్ పై కాస్త జ్ఞానం నేర్పండి: కాంగ్రెస్

జమ్మూకాశ్మీర్ సమస్యపై మూడో పక్షానికి అవకాశం కల్పించకూడదని డిమాండ్;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-11 10:09 GMT
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ

భారత్ - పాకిస్తాన్ మధ్య ఉన్నజమ్మూకాశ్మీర్ సమస్యను వేయి సంవత్సరాల పురాతన సమస్య అని ట్రంప్ ట్వీట్ చేయడంపై కాంగ్రెస్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడికి ఈ సమస్యపై కాస్త అవగాహన ఉంటే మంచిదంది.

కాశ్మీర్ పై అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహించడానికి చేసిన ప్రతిపాదనలను శివసేన(యుబీటీ) వ్యతిరేకించాయి. అంతేకాకుండా కాశ్మీర్ సమస్యపై ఆయన పరిజ్ఞానం పై ఎగతాళి చేసినట్లు స్పందించాయి.

ఈ ఘటనపై ప్రధానమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ లో స్పందించారు. ‘‘సిమ్లా ఒప్పందాన్ని మనం విరమించుకున్నామా? కాశ్మీర్ సమస్య పై మూడో పక్షం మధ్యవర్తిత్వానికి భారత్ అంగీకరించిందా? భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య ప్రక్రియ తిరిగి ప్రారంభిస్తున్నారా? ఈ ప్రశ్నలు భారత జాతీయ కాంగ్రెస్ అడగాలనుకుంటోంది? మనం ఎలాంటి హమీలు కోరాము, వేటిని పొందాము? ’’ అని ప్రశ్నించారు.
పహల్గామ్ సంఘటన, ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ ఒప్పందం ఇలా జరిగిన అన్ని వివరాలను తెలియజేయడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకుడు కోరారు.
మూడో పక్షం జోక్యం అవసరమా?
భారత్, పాకిస్తాన్ మధ్య మూడో పక్ష జోక్యానికి న్యూఢిల్లీ ద్వారాలు తెరిచిందా? పాకిస్తాన్ తో దౌత్య మార్గాలు తెరిచారా? వంటి అనేక ప్రశ్నలు కాంగ్రెస్ నాయకుడు ప్రభుత్వానికి స్పందించారు. నాలుగు రోజుల తరువాత దాడులు, ప్రతిదాడులు నిన్న సాయంత్రం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిశాయి.
భారత్, పాకిస్తాన్ మధ్య అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన ‘తటస్థ స్థలం’ గురించి ప్రస్తావించడం అనేక సందేహాలు లేవనెత్తుతుందని అన్నారు.
చర్చలు లేవు..
కాల్పుల విరమణ అంశంపై మరే ఇతర ప్రదేశంలో చర్చలు జరపాలనే నిర్ణయం లేదని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ‘‘భారత్- పాకిస్తాన్ ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణకు తటస్థ ప్రదేశంలో విస్తృత శ్రేణి అంశాలకు చర్చలను ప్రారంభించడానికి అంగీకరించాయి’’ అని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో చెప్పిన తరువాత ప్రకటన వచ్చింది.
బైబిల్ ప్రకారం వేయి సంవత్సరాల నాటి సంఘర్షణ కాదు..
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ.. ‘‘మాది వేయి సంవత్సరాల నాటి వివాదం కాదు.. బైబిల్ ప్రకారం 78 సంవత్సరాల క్రితమే ప్రారంభం అయింది’’ అన్నారు. జమ్మూకాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ చేసిన ప్రతిపాదనలను తిరస్కరించారు.
‘‘ఇది 78 సంవత్సరాల క్రితం అంటే అక్టోబర్ 22, 1947 ప్రారంభం అయింది. పాకిస్తాన్ స్వతంత్య్ర రాజ్యమైన జమ్మూకాశ్మీర్ ను ఆక్రమించడానికి పూనుకున్నప్పుడు అక్టోబర్ 26, 1947 లో మహారాజ హరిసింగ్ భారత్ దీనిని పూర్తిగా అప్పగించాడు. దీనిలో పాకిస్తాన్ చట్టవిరుద్దంగా ఆక్రమించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి’’ అన్నారు.
అమెరికా జోక్యం అవసరం లేదు..
శివసేన( యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ సమస్యపై భారత్ కు అమెరికా జోక్యం అవసరం లేదన్నారు. విధి మనకు ఓ బాధ్యతను ఇచ్చింది. భారత్ ఆ సవాల్ ను ఎదుర్కోవాలి అని శివసేన నేత ఎక్స్ లో అన్నారు.
ఇందిరాగాంధీ పాత్ర..
భారత్ - పాక్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై ఇద్దరు మాజీ ఆర్మీ చీఫ్ లు అయిన వీపీ మాలిక్, మనోజ్ నరవాణే చేసిన వ్యాఖ్యలను జైరాం ప్రస్తావించారు. ప్రధానమంత్రి నుంచి సమాధానాలు వారు కోరుతున్నారని అన్నారు. 1971 యుద్ధం తరువాత ఇందిరాగాంధీ లాంటి నాయకత్వాన్ని దేశం గుర్తు చేసుకుంటుందని జైరాం రమేష్ ఎక్స్ లో చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.
Tags:    

Similar News