ఉత్తర ప్రదేశ్: పోలీసుల ఎదుట లొంగిపోయిన హత్రాస్ ప్రధాన నిందితుడు
బోలే బాబా సత్సంగ్ లో తొక్కిసలాట జరిగి 121 మంది మృతికి కారణమైన ఆర్గనైజర్ దేవ ప్రకాశ్ మధుకర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తనకు గుండె నొప్పి అని ఆస్పత్రిలో..
By : The Federal
Update: 2024-07-06 05:21 GMT
హత్రాస్ లో జూలై 2 న జరిగిన తొక్కి సలాటలో 121 మంది ప్రాణాలు కొల్పోయిన ఘటన ప్రధాన నిందితుడు దేవ ప్రకాష్ మధుకర్ ఢిల్లీలో లొంగిపోయాడు. అనంతరం అతడిని యూపీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారని ఆయన న్యాయవాదీ శుక్రవారం రాత్రి ప్రకటించారు. తొక్కిసలాట జరిగిన సత్సంగ్ ప్రాంతంలో మధుకర్ ముఖ్యసేవాదార్. ఈ ఘటనకు సంబంధించి హత్రాస్ లోని సికంద్రరావు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. దీని ప్రకారం ప్రధాన నిందితుడు మధుకర్. అయితే తొక్కిసలాట జరిగిన ప్రజలు ప్రాణాలు కోల్పోయిన తరువాత ఆయన పరారయ్యాడు.
మధుకర్ తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఒక వీడియో సందేశంలో, తన క్లయింట్ ఢిల్లీలో లొంగిపోయాడని, ఢిల్లీలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో అనారోగ్యం కారణాలు రీత్యా అతను చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. హత్రాస్ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన ఆర్గనైజర్‌గా పేర్కొన్న దేవ్‌ప్రకాష్ మధుకర్ ఇక్కడ చికిత్స పొందుతున్నప్పటికి ఢిల్లీలోని పోలీసులు, సిట్, ఎస్‌టిఎఫ్‌లను పిలిపించి ఈ రోజు లొంగిపోయాము అని సింగ్ చెప్పారు.
"మేం ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయబోమని హామీ ఇచ్చాము. మా నేరం ఏమిటి? అతను ఇంజనీర్, హార్ట్ పేషెంట్. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు కాబట్టి మేము విచారణ కోసం ఈ రోజు లొంగిపోయాము," ఆయన న్యాయవాది చెప్పారు.
పోలీసులు ఇప్పుడు అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయవచ్చని, లేదా అతనిని ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. అయితే అతని ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి, అయన వల్ల ఎలాంటి తప్పు జరగలేదని న్యాయవాదీ వివరించారు.
ఇటీవల, సుప్రీంకోర్టు న్యాయవాది తాను సూరజ్‌పాల్ అలియాస్ నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబాకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని పేర్కొన్నాడు, అతని 'సత్సంగం'లో తొక్కిసలాట సంభవించింది. మధుకర్‌పై సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో గురువారం వరకు భోలే బాబా సత్సంగ్ ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఇద్దరు మహిళా వాలంటీర్లు సహా ఆరుగురిని అరెస్టు చేశారు.