దేశంలోనే అత్యధిక లోక్ సభ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ దశాబ్దం వరకూ సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉండేది. అంతకుముందు బీఎస్పీ రాజ్యాధికారం చేజిక్కించుకుంది. అయితే ఇప్పడు పరిస్థితి మాత్రం రెండు పార్టీలకు ఆశాజనకంగా లేదనే చెప్పాలి.
ముఖ్యంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ 2022 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కులాలతో కలిసి పీడీఏ( పిచ్ డా, దళిత్, అల్ప్ సంఖ్యాక) కూటమిని ఏర్పాటు చేసి పోటీకి దిగాడు. అయితే తరువాత అనేక చిన్న చిన్న పార్టీలు ఈ కూటమి నుంచి వైదోలగడంతో అనేక ఇప్పుడు బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోరు ఎన్డీఏ- పీడీఏ కూటమి మధ్యే ఉంటుందనుకున్న అఖిలేష్ ఆశలు ఈ పరిణామాలతో క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది.
దాంతో తన ప్రణాళికలకు మరింత పదును పెట్టి పీడీఏ సంక్షేమం కోసం తనకు అమిత శ్రద్ధ ఉన్నట్లు వివిధ చర్చలు, మీడియా సంభాషణల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం అఖిలేష్ చేస్తున్నారు. అయితే ఈ చర్యలు అంతగా సత్పలితాలు ఇస్తున్నట్లు లేవని పార్టీలోని నాయకులే అంతర్గతం అంగీకరిస్తున్నారు.
సీనియర్ SP నాయకులు ఫెడరల్‌తో మాట్లాడుతూ, గత రెండు నెలలుగా తమ పార్టీకి దళితుల మధ్య గ్యాప్ పెరిగిందని ఒప్పుకున్నారు. అయితే ఇదే సమయంలో సాంప్రదాయ ముస్లిం ఓటు బ్యాంకుతో పాటు, యాదవేతర ఇతర ఓబీసీ వర్గాల్లు తమ పార్టీకి ఆదరణ పెరిగిందని చెప్పుకొచ్చారు. 2021 చివరలో సరికొత్త ఓబీసీ ఫార్మూలాతో అఖిలేష్ ఎన్నికల బరిలోకి దిగాడు. ఈ ఎన్నికల్లో 47 సీట్ల నుంచి 111 సీట్లకు ఎస్పీ బలం పెరిగింది. అయితే ఎన్నికల్లో పార్టీ విజయం మాత్రం సాధించలేదు. దీంతో నెల రోజుల్లోనే పార్టీ బలం క్రమక్రమంగా క్షీణించడం ప్రారంభం అయింది.
SP నుంచి వెళ్లిపోయిన..
2022 ఎన్నికల్లో ఎస్‌పి టిక్కెట్‌పై గెలిచిన నెలరోజుల్లోనే నోనియా నాయకుడు దారా సింగ్ చౌహాన్ బిజెపిలో ఫిరాయించాడు. ఆ తర్వాత ఎస్‌పి మిత్రపక్షం ఒపి రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి) ఎన్‌డిఎలో చేరడంతో పిడిఎ ప్లాంక్‌లో చీలికలు వచ్చాయి.
తన దివంగత తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌ను భారతరత్నతో సత్కరించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత, ఆర్‌ఎల్‌డి చీఫ్, జాట్ నాయకుడు జయంత్ చౌదరి ఎన్‌డిఎలో చేరడానికి ఎస్‌పితో సంబంధాలను తెంచుకోవడంతో అఖిలేష్ నేతృత్వంలోని కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇవి అఖిలేష్ అనుభవరాహిత్యానికి నిదర్శంగా ఎస్పీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో..
గత నెలలో యూపీలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ బొక్కబోర్లా పడిందనే చెప్పవచ్చు. ఏకంగా 12 మంది ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. ఇందుకు అఖిలేష్ చేసిన తప్పులే కారణమని మాజీ ఎస్పీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య అంటున్నారు.
మూడు స్థానాలు పార్టీ గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే ఇందులోకి అగ్రవర్ణాల వారికీ అవకాశం ఇచ్చారు. ఇందులో జయాబచ్చన్, మాజీ బ్యూరో క్రాట్ అలోక్ రంజన్, దళిత నేత రాంజీలాల్ సుమన్ ఉన్నారు. అయితే క్రాస్ ఓటింగ్ తో దళిత నాయకుడు ఓడిపోయారు. ఈ చర్యతో దళితులు ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీకి మైనస్ గామారింది. ఇదే అంశంపై దాని మిత్ర పార్టీ అప్పాదళ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం, ఓబీసీలను కాదని ఓసీలను అభ్యర్థులుగా నిలబెట్టడం వల్లే ఓడిపోయారని ఆ పార్టీ అభిప్రాయం.
“రాజ్యసభ ఎన్నికలకు అఖిలేష్ ఎంపిక చేసిన అభ్యర్థులు ఓడిపోవడం అందరినీ నిరాశపరిచింది. అక్కడ మూడు స్థానాలు ఉన్నాయి . OBC, దళిత, ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క అభ్యర్థిని సులభంగా ఎంచుకోవచ్చు. ఇది PDAలో చర్చకు దారి తీసింది. ఈ ద్రోహంపై నేను మౌనంగా ఉండలేకపోయాను, అందుకే అఖిలేష్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవలసి వస్తుందనే ఆశతో నేను అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేసాను, కానీ నేను తప్పు చేశాను.
అని పార్టీ నుంచి వైదోలిగి రాష్ట్రీయ శోషిత్ సమాజ్ అనే కొత్త పార్టీ పెట్టిన ప్రసాద్ మౌర్య అభిప్రాయంగా ఉందని ఓ అనుచరుడు చెప్పిన మాట. ఎన్నిఎదురు దెబ్బలు తగిలినా అఖిలేష్ పాఠాలు నేర్చుకోవట్లేదని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా అఖిలేష్ మాటలకు, చేతలు భారీ అగాధం ఉందని వారంటున్నారు.
"ఎన్నికల్లో పిడిఎను పటిష్టం చేయడానికి ఎటువంటి చర్య తీసుకోకుండా గట్టిగా మాట్లాడితే సరిపోతుందనే భావనలో మా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు" అని ఎస్పీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. మా పార్టీ ఓటు బ్యాంకుకు స్పష్టమైన లక్ష్యాలు అందించగలగాలి, కానీ అవేమి జరగడం లేదు.
పెరుగుతున్న నష్టాలు
ఈ ఎన్నికల్లో సంస్థాగతంగా ఆర్థికంగా కుంగిపోయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని రాబోయే ఎన్నికలలో పోటీ చేస్తున్న SP, 2022 అసెంబ్లీ ఎన్నికల నుంచి తనతో పాటు ఉన్న అప్పాదళ్ కే మద్దతును సైతం కోల్పోయింది.
తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని అనేక కుర్మీల ప్రాబల్యం ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతున్న అప్నా దళ్ (కె), రాజ్యసభ ఎన్నికల తరువాత అఖిలేష్ వైఖరిపై విసిగిపోయింది. ఆ పార్టీ ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIMతో జతకట్టింది; అఖిలేష్ తన PDA పిచ్‌తో ఆకర్షించాలనుకున్న OBC, ముస్లిం ఓటర్ల వైపు దృష్టి సారించడం వలన SP అవకాశాలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు.
అభ్యర్థి ఎంపిక
అఖిలేష్ లోక్ సభ అభ్యర్థుల ఎంపిక క్యాడర్ ను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. "ముస్లింల ఆందోళనలను నేరుగా పరిష్కరించడంలో వైఫల్యం, దళితులను ఆకర్షించడం విఫలం ఇలా పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటుంది.
జైల్లో ఉన్న SP సహ వ్యవస్థాపకుడు ఆజం ఖాన్‌కు కంచుకోట అయిన రామ్‌పూర్‌లో, నామినేషన్ ప్రక్రియ ముగియడానికి కొన్ని క్షణాల ముందు పార్టీ ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ మసీదు మత గురువు ముహిబుల్లా నద్వీని పోటీకి నిలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జైలులో ఉన్న ఖాన్, అఖిలేష్‌ను రాంపూర్ నుంచి పోటీ చేయమని లేదా తన సన్నిహితుడు అసిమ్ రాజాను ఆ స్థానం నుండి పోటీ చేయమని కోరినట్లు వర్గాలు తెలిపాయి.
రిగ్గింగ్ ఆరోపణల మధ్య 2022 రాంపూర్ ఉపఎన్నికలో ఘన్‌శ్యాం లోధి (అతను మళ్లీ పోటీలో ఉన్నాడు) చేతిలో ఓడిపోయిన రాజా, ఆ స్థానం నుంచి తన నామినేషన్ దాఖలు చేయమని SP తనను కోరిందని ఫెడరల్‌తో చెప్పాడు, అయితే నామినేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు తనకు బదులుగా పార్టీ నద్వీని రంగంలోకి దింపినట్లు సమాచారం.
మొరాదాబాద్ స్థానంలో..
పొరుగున ఉన్న మొరాదాబాద్‌లో పార్టీ సిట్టింగ్ ఎంపీ అయిన డాక్టర్ ఎస్‌టి హసన్‌ను మొరాదాబాద్ అభ్యర్థిగా పార్టీ అధికారికంగా ప్రకటించింది, అయితే సీతాపూర్ జైలులో అఖిలేష్ ఖాన్‌ను కలుసుకున్న తర్వాత చివరి నిమిషంలో హసన్‌ను తొలగించారు. దీంతో హసన్ అఖిలేష్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆజాంఖాన్ చేతిలో అఖిలేష్ కీలుబొమ్మ అని విమర్శించారు. బిఎస్‌పితో కొంతకాలం కొనసాగిన బిజ్నోర్ మాజీ ఎమ్మెల్యే రుచి వీరను ఇప్పుడు మొరాదాబాద్ నుండి ఎస్‌పి రంగంలోకి దింపింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో మొరాదాబాద్ నుంచి అప్పటి ఎస్పీ-బీఎస్పీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి, బీజేపీకి చెందిన సర్వేష్ కుమార్ సింగ్‌ను 98,000 ఓట్లతో ఓడించిన హసన్, వీరా తరఫున ప్రచారం చేయనని బహిరంగంగా ప్రకటించారు. వీరాకు టికెట్ ఇవ్వడం నాకే కాదు మొరాదాబాద్ ఓటర్లకు కూడా అన్యాయం అని హసన్ ది ఫెడరల్‌తో అన్నారు. ఈ చర్య బిజెపి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటానికి SP వైపు చూస్తున్న ముస్లింలకు చాలా తప్పుడు సంకేతాలను పంపుతుందని హసన్ అన్నారు.
దళితులను రెచ్చగొడుతోంది
BSP ఎన్నికలలో పుంజుకునే సంకేతాలు చూపకపోవడంతో బీజేపీ వైఫల్యాలను ఎండగట్టి ఆ వర్గం మొత్తం ఓట్లను తన వైపు తిప్పుకోవాలని ఎస్పీ అనుకుంటోంది.
వర్ధమాన దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ (ASP)ని SP-కాంగ్రెస్ కూటమిలోకి తీసుకురావడానికి SP చీఫ్ నిరాకరించడం, దళితుల సమస్యలపై సరిగా పోరాడకపోవడం పార్టీకి మైనస్ గా మారింది.
కోపంతో ఉన్న ఆజాద్
ఎస్పీతో సీటు షేరింగ్ ఒప్పందంలో ఏఎస్పీకి నగీనా, బిజ్నోర్ అనే రెండు సీట్లతో సరిపెట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆజాద్ ఫెడరల్‌తో అన్నారు. కూటమిలో మా పార్టీకి స్థానం కల్పించలేడని.. ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాడు.
ఇప్పుడు నగీనా నుంచి ASP అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆజాద్ "నా పోరాటం BJPకి వ్యతిరేకంగా ఉంది, అయితే అఖిలేష్ చెప్పే ఒక్క మాటను కూడా దళితులు విశ్వసించలేరని వారికి చెప్పడం నా కర్తవ్యం" అని అన్నారు.