రాజకీయ రంగు పులుముకున్న యూపీ మైనర్ బాలిక అత్యాచారం
అత్యాచారం చేసిన వ్యక్తిని అఖిలేష్ యాదవ్ సమర్థించడంపై జాతీయ బాలలహక్కుల కమిషన్ స్పందించింది. ఇది తమ డీఎన్ఏ అని చెప్పుకుంటున్నారా అని ప్రశ్నించింది.
By : The Federal
Update: 2024-08-05 12:58 GMT
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో 12 ఏళ్ల మైనర్ బాలికపై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు మొయిద్ ఖాన్ అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతంపై రాష్ట్రంలో రాజకీయ రంగు పులుకుంది. ప్రధాన నిందితుడు మోయిద్ ఖాన్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన ప్రధాన అనుచరుడు కావడంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మైనర్‌పై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన తర్వాత యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఎస్పీ పై నిప్పులు చెరిగారు. భద్రసలోని SP యూనిట్ నగర అధ్యక్షుడు మోయిద్ ఖాన్, పార్టీ MP అవధేష్ ప్రసాద్‌కు సన్నిహితుడని ఆరోపించారు. అనేక మంది దళితులను బెదిరించి భూములను లాక్కోవడంతో మొయిద్ ఖాన్ ప్రధాన నిందితుడు. దీనితో యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వం బుల్డోజర్ తో అతని అక్రమాస్తులను బుల్డోజర్ తో కూల్చి వేసింది.
కేసు ఏమిటీ?
అయోధ్యలో మొయిద్ ఖాన్ ఇంటిలో పని చేసే 12 ఏళ్ల బాలికపై అతడు, అతని అనుచరులు గ్యాంప్ రేప్ కు పాల్పడ్డారు. ఈ దురగతాన్ని వీడియో తీసి బయట ఎవరికైన చెబితే వీడియోను అందరికి చూపిస్తామని బెదిరించారు. అయితే బాలిక కొన్ని రోజుల తరువాత గర్భం దాల్చడంతో తల్లికి విషయం చెప్పింది.
తరువాత నిందితులపై పోలీసు కేసు నమోదు చేయాలని ప్రయత్నించగా ఎస్పీ ఎంపీ అండదండలతో ఎఫ్ఐఆర్ నమోదు కానివ్వలేదు. అయితే సీఎం యోగీ ఆదిత్యనాథ్ నిర్వహించే ప్రజా దర్భార్ కు వెళ్లి బాధితులు తమ గోడు చెప్పుకోగా స్వయంగా సీఎం బాధితులకు అండగా నిలబడ్డారు. కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేసిన ఆయన తనదైన న్యాయం చేయడానికి నడుంబిగించారు.
అఖిలేష్ ఏం మాట్లాడరంటే..
అయితే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బాధితురాలి పక్షంగా ఉండకుండా మైనర్ బాలిక పిండానికి, తన పార్టీ అనుచరుడు నిందితుడిగా ఉన్న మొయిద్ ఖాన్ కు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని కోరాడు. ముస్లింలు సమాజ్ వాదీ పార్టీకీ అండగా ఉన్నందునే ఇలా అపవాదులు వేస్తున్నారని విమర్శించారు.
“అకృత్యాల కేసుల్లో, కేవలం ఆరోపణలు, రాజకీయాలు కాకుండా DNA పరీక్షల ద్వారా న్యాయం పొందాలి. దోషులను చట్ట ప్రకారం శిక్షించాలి. అయితే DNA పరీక్షలో ఆరోపణలు అవాస్తవమని రుజువైతే, ప్రమేయం ఉన్న ప్రభుత్వ అధికారులను విడిచిపెట్టకూడదు, ”అని ఎస్పీ చీఫ్ అఖిలేష్ అన్నారు. అఖిలేష్ పార్టీకి చెందిన మరో నాయకుడు పవన్ పాండే మీడియాతో మాట్లాడుతూ, “వారు దోషులైతే, వారిని శిక్షించాలి, కానీ యోగి ప్రభుత్వం వారిపై ప్రవర్తించే పద్ధతి ఇది కాదు.” అని వ్యాఖ్యానించారు
బీజేపీ నేతల..
డిఎన్‌ఎ పరీక్ష చేయాలన్న అఖిలేష్ డిమాండ్‌పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందిస్తూ "ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది, ఆరోపణలు మీ పార్టీ నాయకుడిపై ఉన్నాయి. కానీ మీరు అతనిని పిడివాదంతో సమర్థిస్తున్నారు. 'అబ్బాయిలు తప్పు చేస్తారు' అని చెప్పి బాలికలపై అత్యాచారం చేసేవారిని సమర్థించే DNA ఇదే" (NCPCR) చైర్‌పర్సన్ ప్రియాంక్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒక బిజెపి నాయకుడు, బాబూరామ్ నిషాద్ మీడియాలో, “ఈ ఘోరమైన నేరానికి కారణమైన వారిని మా ప్రభుత్వం విడిచిపెట్టదు. నేరస్తులపై ప్రభుత్వం తరతరాలు గుర్తుంచుకునేలా బలమైన చర్య తీసుకుంటుందని హెచ్చరించారు.
యూపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందా?
అయితే అయోధ్య పార్లమెంటరీ ఎన్నికల్లో యూపీలోని ఇతర చోట్ల కాషాయ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని ఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎస్పీని నేరగాళ్ల పార్టీగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ సభ్యులు ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయడానికి బదులు యూపీ ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోందని వారు వాదిస్తున్నారు.