మూడేళ్లలో ప్రపంచ టాప్ త్రీగా ఉంటాం: రాజ్ నాథ్ సింగ్
దేశంలో రామరాజ్య స్థాపనకు ఎంతో దూరంలో లేదని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మరో మూడేళ్లలో భారత్ ప్రపంచంలోని టాప్ త్రీ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు.
By : The Federal
Update: 2024-03-15 10:30 GMT
మరో మూడేళ్ల లో భారత్ టాప్ త్రీ ఆర్ధిక వ్యవస్థగా నిలబడుతుందని అలాగే 'రామరాజ్యం' స్థాపించబడే రోజులు ఎంతో దూరంలో లేవని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పౌరసత్వ (సవరణ) చట్టం, CAA అమలుపై బిజెపిని మతతత్వంగా ముద్రించే వారిపై కూడా ఆయన ఎదురుదాడి చేశాడు.
పాకిస్తాన్ లో హిందువుల జనాభా 23 శాతం ఉండేదని, ఇప్పుడు కేవలం 3 శాతానికి పడిపోయిందని దానికి కారణాలు చెప్పాలని బీజేపీని , సీఏఏ అమలు విషయంలో విమర్శిస్తున్న వారిని ఆయన ప్రశ్నించాడు. అక్కడ జరగుతున్న హింస భరించలేక అక్కడి మైనారిటీలు మన దేశంలోకి ప్రవేశించారని వారికి పౌరసత్వం ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధాని రాంచీకి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇత్ఖోరీలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు, "అయోధ్య ఆలయాన్ని ప్రతిష్టించడంతో భారతదేశంలో రామరాజ్యం స్థాపించబడింది. రామ్ లల్లా తన గుడిసె నుంచి తన ప్యాలెస్‌కు చేరుకున్నాడు" అని అన్నారు. 'ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి పనులతో దేశం విశ్వగురువుగా మారిందని ఆయన మూడోసారి మాత్రమే కాకుండా నాలుగోసారి కూడా ప్రధానిగా కొనసాగాలని భగవంతుడి ఆకాంక్ష అని ఆయన అన్నారు.
హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలతో సహా మైనారిటీలు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారని ఆశ్రయం కోసం భారతదేశానికి వస్తున్నారని వారికోసమే సీఏఏను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.వారికి పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని.. దీని కోసం బీజేపీని కమ్యూనల్‌గా ముద్రవేస్తున్నారని ఆయన విమర్శించారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ఒక సిఎం అదృశ్యం కావడం అపూర్వమని ఎద్దేవా చేశారు. తరువాత దర్యాప్తు సంస్థలకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్లారని అన్నారు. గతంలో కేంద్రంలో పని చేసిన కాంగ్రెస్ పార్టీ అవినీతి మకిలిని దేశానికి అంటించిందని, ఇప్పుడు బీజేపీ ఎవరూ వెలేత్తి చూపని విధంగా పాలిస్తున్నామని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.