త్రిభాషా విధానంపై బెంగాల్ ఎందుకు ప్రశాంతంగా ఉంది?

మమతా బెనర్జీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు యువతపై ఎలాంటి ప్రభావం చూపాయి?;

Update: 2025-03-04 06:55 GMT

కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళా బెంగాల్ లో మాట్లాడినందుకు, పక్కన మరో మహిళా హిందీలో మాట్లాడాలని కోరినందుకు పెద్ద గొడవ జరిగింది.

‘‘ఇది బంగ్లాదేశ్ కాదు.. మీరు భారత్ లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ భారత్ లో ఒక భాగం. మీరు నేర్చుకోవాలి’’ అని గద్దించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తరువాత నెల డిసెంబర్ లో మరో వీడియో వైరల్ గా మారింది. హౌరా స్టేషన్ లోని బుకింగ్ కౌంటర్ లో హిందీ మాట్లాడే మెట్రో ఉద్యోగితో బెంగాలీ ప్రయాణీకుడు చార్జీల గురించి మాతృభాషలో అడినందుకు అక్కడ కూడా వివాదం చెలరేగింది.
ఈ ప్రయాణీకుడికి మరికొంతమంది ప్రయాణీకులు కూడా జతకావడంతో వివాదం ముదిరింది. అయితే తరువాత మెట్రో అధికారులు ఈ ఆరోపణను ఖండించారు. అంతర్గత విచారణ తరువాత ఈ ప్రకటన చేస్తున్నట్లు వివరించారు.
త్రిభాషా సూత్రంపై ఏకాభిప్రాయం..
హిందీ - బంగ్లా భాష వివాదాలు ఇంకా ఎక్కువగా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లలేదు. ప్రజలు, రాజకీయ నాయకులు ఎక్కడా దీనిపై ఆసక్తి చూపడం లేదు. పశ్చిమ బెంగాల్ విద్యావిధానం, జాతీయ విద్యావిధానంతో సరిపోలడంతో ఇక్కడ రాజకీయ వైరుధ్యాలు, ప్రజా వైరుధ్యాలు లేవు. రెండు విద్యా విధానాలు కూడా త్రి భాష విధానానికే ప్రాధాన్యం ఇచ్చాయి.
బెంగాల్ లోని రాజకీయ పార్టీలు భాషా యుద్ధంలో పాల్గొనడానికి విముఖత చూపడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని కోల్ కతకు చెందిన రామ్మోహన్ కళాశాలలో బంగ్లా బోధించే అనసువా రాయ్ చౌదరి ‘ది ఫెడరల్’ తో అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బెంగాలీ భాషకు సవాల్ విసురుతున్నది ఇంగ్లీష్ మాత్రమే. అలాగే హిందీ - బంగ్లా మాట్లాడే ప్రతిపాదకుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ఉపయోగించకుండా రాజకీయ పార్టీలను నిరోధిస్తున్నాయి. అందుకే ఇక్కడ దేశీయ భాషలపట్ల వ్యతిరేకత లేదన్నారు.
అవసరమైన చెడు..
రాజకీయ వ్యాఖ్యాత, రచయిత అమల్ సర్కార్ అనసువా రాయ్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. బెంగాలీలు ఇంగ్లీష్ భాషను ప్రధాన ముప్పుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఆంగ్లాన్ని అవసరమైన చెడుగా చూస్తున్నారని ఆయన ‘ది ఫెడరల్’ అన్నారు.
2004 లో లెప్ట్ ప్రభుత్వం మెల్లగా పతనం ప్రారంభమైందని అప్పుడే రాష్ట్రంలో ద్వంద్వత్వం ప్రదర్శితమైందని ఆయన విశ్లేషించారు.
‘‘ప్రాథమిక స్థాయిలో పిల్లలను వారి మాతృభాషలో మాత్రమే బోధించాలనే కారణంతో ఇంగ్లీష్ ను రద్దు చేసిన రెండు దశాబ్ధాల తరువాత వారు ప్రభుత్వ, ప్రభుత్వ సాయక పాఠశాల్లో ప్రాథమిక దశల్లో ఆంగ్ల బోధనను తిరిగి ప్రవేశపెట్టారు’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ వామపక్ష ప్రభుత్వం ‘‘నో ఇంగ్లీష్’’ విధానాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారని అన్నారు. ఇది తరువాత కాలంలో బెంగాలీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు.
భాషా వైవిధ్యం..
మమత బెనర్జీ సర్కార్ వచ్చిన తరువాత బెంగాల్ వ్యాప్తంగా 1 నుంచి 10 తరగతి వరకూ బెంగాలీ తప్పనిసరిగా ప్రవేశ పెట్టాలనే నిబంధన తీసుకురావడంతో డార్జిలింగ్ కొండల్లో నిప్పురాజేసింది.
అక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ రికార్డు స్థాయిలో 104 రోజుల సమ్మెచేశారు. ఇలా మమతా సర్కార్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో సంక్షిష్టతలను తీసుకువచ్చింది.
బీజేపీ- ఆర్ఎస్ఎస్ కలయిక హిందూత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా పోటీపడుతున్న బెంగాలీ ఉప జాతీయవాదం రాష్ట్రంలోని వివిధ భాషలు, సంస్కృతుల సంశ్లేషణ’’ అని సర్కార్ అన్నారు.
రాష్ట్ర అధికారిక భాషల బహుళత్వంలో భాషా వైవిధ్యం వ్యక్తమవుతుంది. ఇంగ్లీష్, బంగ్లాతో పాటు రాష్ట్ర అధికారిక భాషలలో భాషా వైవిధ్యం వ్యక్తమవుతుంది. ఇంగ్లీష్, బంగ్లాతో పాటు రాష్ట్ర అధికారిక భాషలలో హిందీ, ఉర్దూ, నేపాలీ, ఓల్- చికీ, కంటపురీ, రాజ్ బన్షి, కుర్మాలి, ఒడియా, గురుముఖి, తెలుగు కూడా ఉన్నాయి.
అనేక మాతృ భాషలు..
2011 జనాభా లెక్కల నివేదిక ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లో 202 మాతృభాషలు ఉన్నాయి. అయితే బంగ్లా మాత్రమే ప్రధానంగా ఉంది. మిగిలిన అన్ని భాషలు 5 శాతం కంటే ఎక్కువ మంది మాట్లాడే భాష ఏదీ లేదు.
ఉదాహారణకు రాష్ట్ర మొత్తం జనాభాలో నేపాలీ భాషను కేవలం 1.27 శాతం మంది మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ డార్జిలింగ్ కొండలలో ఇదే ప్రధాన భాష. కొండలలోని డార్జిలింగ్, కాలింపాంగ్, కుర్సియాంగ్ అనే మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు, రాష్ట్రంలోని డూయర్స్ ప్రాంతంలోని 12 నియోజక వర్గాలలో నేపాలీ మాట్లాడే ఓటర్లు కూడా ఒక ముఖ్యమైన నిర్ణయాత్మక అంశం.
అదే విధంగా సంతాలి లేదా ఓల్ చికి( సంథాలి భాష లిపి)కుర్మాలి ఇతర ఆదివాసీ భాషలను జనాభాలో దాదాపు 3 శాతం మంది మాట్లాడతారు. కానీ ఈ భాషలను మాట్లాడే ప్రజలు రాష్ట్రంలోని జంగల్ మహాల్ ప్రాంతంలో ఆధిపత్య సమూహాంగా ఉన్నారు.
ఇది పశ్చిమ మిడ్నాపూర్, జార్గ్రామ్, బంకురా, పురులియా, అటవీ కొండ ప్రాంతాలను కలిగి ఉంది. ఈ ప్రాంతాలలో 35 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో హిందీ మాట్లాడేవారు 5 శాతం మంది ఉన్నారు. వారు ఉత్తర పరగణాలు, హుగ్లీ, హౌరా, దక్షిణ 24 పరగణాలు, పశ్చిమ బుర్ద్వాన్ జిల్లాలోని అనేక ప్రాంతాలలో ప్రధానంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో వీరంతా ఒక సమూహాంగా మారుతున్నారు.
బెంగాల్ త్రిభాషా సూత్రం..
బెంగాల్ ల్ నిర్మాణంలో అనేక భాషా సమూహాలు ఉన్నాయి. అయితే 2017 లో బంగ్లాతో జరిగిన దురదృష్టం నుంచి పాఠాలు నేర్చుకుని, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 2023 లో ఆవిష్కరించబడిన రాష్ట్ర విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని స్వీకరించింది.
ఇది ప్రాథమిక బోధనా భాష పాఠశాల మాధ్యమానికి అనుగుణంగా ఉండాలని నిర్దేశిస్తుంది. బంగ్లా- మీడియం పాఠశాలలకు బెంగాలీ, ఇంగ్లీష్ మీడియా పాఠశాలలకు ఇంగ్లీష్, నేపాలీ మీడియాం పాఠశాలలకు నేపాలీ, ఓల్ చికి మీడియం పాఠశాలలకు ఓల్ - చికి, హిందీ మీడియం పాఠశాలలకు హిందీ మొదలైనవి.
రెండవ భాష ఇంగ్లీష్ కావచ్చు లేదా మొదటి భాష నుంచి భిన్నమైన ఏదైనా భాష కావచ్చు. మూడవ భాష మొదటి, రెండవ భాషలు కాకుండా ఏదైనా ఇతర భాష కావచ్చు. టీఎంసీ రాజ్యసభ ఎంపీ మమతా బాలఠాకూర్ ‘ ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. బెంగాల్ రాష్ట్రంలో మాట్లాడే అన్ని భాషలను గౌరవిస్తుంది.
మూడు భాషల సూత్రం విద్యార్థులు ప్రాంతీయ, జాతీయ భాషలను నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. మనం ప్రతి భాషను గౌరవించాలి. ప్రతి ప్రాంతీయ భాషకు దాని ప్రాముఖ్యతను కూడా ఇవ్వాలి.
Tags:    

Similar News