మనోజ్ జరాంగేకు నోటీసులు
బాంబే హైకోర్టు ఆదేశంతో వేదిక వద్దకు వచ్చిన పోలీసులు;
మరాఠా (Maratha) సమాజానికి రిజర్వేషన్ల కల్పించాలని ముంబై(Mumbai)లో మరాఠా హక్కుల కార్యకర్త మనోజ్ జరంగే(Jarange) నిరాహార దీక్ష (hunger strike) చేస్తు్న్న విషయం తెలిసిందే. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఆయన 29వ తేదీ నుంచి దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వేల సంఖ్యలో వేదిక వద్దకు చేరుకోవడంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో బాంబే హైకోర్టు జోక్యం చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నాటికి నగరంలోని అన్ని వీధులను ఖాళీ చేయాలని జరంగే మద్దతుదారులను కోరింది. ఈ మేరకు మనోజ్ జరంగే, అతని బృందానికి మంగళవారం (సెప్టెంబర్ 2) ముంబై పోలీసులు నోటీసు జారీ చేశారు.
మరాఠాలను ఓబీసీలుగా పరిగణించడంతో పాటు వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది జారంగే ప్రధాన డిమాండ్. ప్రభుత్వం తన డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని ప్రతిజ్ఞ చేశాడు. జరాంగే నిరాహార దీక్ష మంగళవారానికి ఐదో రోజుకు చేరింది. ఆయన మంచినీళ్లను తాగడం కూడా మానేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని ప్రతిజ్ఞ చేశాడు.