అదానీ స్వాధీనంతో స్కూల్‌ మానేసిన నన్స్..

పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్కూల్ పారిశ్రామికవేత్త అదానీ స్వాధీనం కావడంతో టీచర్లంతా ఉద్యోగం మానేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే..

Update: 2024-10-03 08:41 GMT

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిమెంట్ నగర్‌లోని మౌంట్ కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌కు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ స్కూల్‌లో పిల్లలకు నన్స్ (Nuns) చక్కగా చదువు చెబుతారన్న పేరుంది. మదర్ ఆఫ్ కార్మెల్ (CMC) ఆధ్వర్యంలో 1972 నుంచి ఈ స్కూల్ నడుస్తోంది. అప్పట్లో అసోసియేటెడ్ సిమెంట్ కో (ACC) సహకారంతో నిర్మించిన ఈ స్కూల్‌లో ప్రస్తుతం దాదాపు 2 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

అయితే 2022లో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ నుంచి ACCని కొనుగోలు చేయడంతో.. ఈ స్కూల్ దేశంలో రెండో అత్యంత సంపన్నుడయిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ స్వాధీనంలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో పాఠశాల పేరు నుంచి "మౌంట్ కార్మెల్"ను తొలగించాలని అదానీ గ్రూప్‌ను CMC కోరింది.

నన్స్ వర్సెస్ అదానీ గ్రూప్..

"వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యనిచ్చే అదానీ గ్రూప్ కింద మేం పని చేయలేం. వారి విధానం, మా విధానం పూర్తిగా భిన్నం. అందుకే స్కూల్ ఆయన స్వాధీనంలోకి వెళ్లిపోయాక సెప్టెంబరు 1న స్కూల్‌కు వెళ్లడం మానేశాం." అని మాజీ ప్రిన్సిపాల్ సిస్టర్ లీనా తెలిపారు. గతంలో ACC ఆహ్వానం మేరకే మహారాష్ట్ర మారుమూల ప్రాంతంలోని పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ఇక్కడకు వచ్చామని ఆమె చెప్పుకొచ్చారు.

మేనేజ్‌మెంట్‌లో జోక్యం చేసుకోవడంతోనే..

కాగా పాఠశాల నిర్వహణలో అదానీ గ్రూప్ జోక్యం చేసుకోవడం వల్లే నన్స్ బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని పాఠశాల  పర్యవేక్షకుడు చందా బిషప్ ఎఫ్రెమ్ నారికులమ్ చెప్పారు.

Tags:    

Similar News