బెదిరింపు నోట్‌తో వచ్చిన పావురం..
చీటిలో రాసి ఉన్న వాక్యాలను చదివి అప్రమత్తమైన భద్రతా బలగాలు..;
భారత భద్రతా బలగాలు(Security forces) ఆగస్టు 18వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ పావురాన్ని పట్టుకున్నాయి. ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు కాట్మారియా ప్రాంతంలో పట్టుకున్న ఈ పావురం(Pigeon) గోళ్లకు ఒక చిన్న చీటి కట్టి ఉండటం గమనించారు. అందులో “కాశ్మీర్ స్వేచ్ఛ” “సమయం వచ్చింది” అనే పదాలు ఉర్దూ, ఇంగ్లీషులో రాసి ఉన్నాయి. IED ఉపయోగించి రైల్వే స్టేషన్‌ను పేల్చివేయమని కూడా రాసి ఉంది.
వెంటనే అప్రమత్తమయిన భద్రతా బలగాలు జమ్ము రైల్వే స్టేషన్(Jammu and Kashmir) వద్ద భద్రతను పెంచారు. ట్రాక్ వెంట డాగ్ స్క్వాడ్, బాంబుస్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు.
పాకిస్తాన్ సరిహద్దు ప్రాంత నుంచి భారత్ వైపునకు వివిధ రకాల బెలూన్లు, జెండాలు, పావురాలను పంపుతుందని..అయితే బెదిరింపు లేఖను తీసుకెళ్లున్న పావురాన్ని పట్టుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. పావురానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, పాక్ సరిహద్దు నుంచి వదిలివేసి ఉండవవచ్చని భద్రతా నిపుణుల అంటున్నారు.
ఇది ఎవరైనా ఆకతాయిగా చేశారా? లేక దీని వెనక కుట్రకోణం దాగి ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు భద్రతా అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను చంపిన తర్వాత భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. "రక్తం, నీరు" కలిసి ప్రవహించలేవని పేర్కొంటూ పాక్‌కు వెళ్లే సింధు జలాలను భారత్ నిలిపేసిన విషయం తెలిసిందే.