విద్యా వ్యవస్థలో సామాజిక న్యాయం కొరవరడడంపై రాహుల్ ఆగ్రహం

'నాట్ ఫౌండ్ సూటిబుల్' పేరిట డీయూ పోస్టుల భర్తీ చేయడం లేదని అసహనం..;

Update: 2025-05-27 10:04 GMT
Click the Play button to listen to article

ఉన్నత విద్యా వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలపై కొనసాగుతున్న వివక్షపై కాంగ్రెస్(Congress) నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతులు (OBC)కు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులను 'నాట్ ఫౌండ్ సూటిబుల్' (NFS) పేరుతో కావాలని పక్కన పెడుతున్నారని ఆరోపించారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయ(Delhi University)విద్యార్థి సంఘం సభ్యులతో జరిగిన సంభాషణను షేర్ చేస్తూ.. 60% కంటే ఎక్కువగా ఉన్న రిజర్వ్డ్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా వాటిని 'నాట్ ఫౌండ్ సూటిబుల్' పేరిట ఖాళీగా ఉంచారని మండిపడ్డారు. విద్యా సాధికారతను తూట్లు పొడుస్తున్న మోదీ ప్రభుత్వం, RSS చేస్తున్న ప్రయత్నాలను గాంధీ తీవ్రంగా విమర్శించారు. ‘‘విద్య ద్వారా సమానత్వం సాధ్యమవుతుంది అన్న అంబేద్కర్ కలను బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది," అని పేర్కొన్నారు. ఈ వివక్ష కేవలం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మాత్రమే కాదని ఐఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లోనూ కొనసాగుతోందని ఆరోపించారు.

రాహుల్ క్యాంపస్ సందర్శనను తప్పుబట్టిన డీయూ..

రాహుల్ గాంధీ మే 22న ఆకస్మిక ఢిల్లీ విశ్వవిద్యాలయ సందర్శనను ఢిల్లీ యూనివర్సిటీ తప్పుబట్టింది. ప్రోటోకాల్ ఉల్లంఘనగా అభివర్ణిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

"రాహుల్ గాంధీ ఇలా చేయడం ఇది రెండవసారి... ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఎటువంటి సమాచారం విశ్వవిద్యాలయానికి వచ్చారు" అని ప్రొక్టర్ కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది. 

Tags:    

Similar News