విదేశీ కోర్టు సార్వభౌమాధికారాన్ని గౌరవించండి: సుప్రీంకోర్టు

నిఖిల్ గుప్తా కేసును విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విదేశీ కోర్టుల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పిటిషన్ దారులకు ధర్మాసనం సూచించింది.

Update: 2024-01-04 13:18 GMT
భారత సుప్రీంకోర్టు

అమెరికాలో ఉండి నిషేధిత సిఖ్ ఫర్ జస్టిస్ నడుపుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య కుట్రలో అరెస్ట్ అయిన నిఖిల్ గుప్తా కేసు ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై చెక్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. "మేము పెద్దగా ఏమి చేయలేము, వియన్నా కన్వేన్షన్ ప్రకారం కాన్సులర్ యాక్సెస్ కు అర్హులు" అని న్యాయమూర్తులు అన్నారు.

విదేశీ ధర్మాసనం అధికారపరిధిని, సార్వభౌమధికారాన్ని గౌరవించాలని న్యాయస్థానంలో నిఖిల్ గుప్త తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదీ సీఏ సుందరంకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ కేసు మెరిట్ లోకి వెళ్లలేము అని కోర్టు తెలిపింది. " విదేశీ కోర్టు గురించి ఇక్కడ మాట్లాడానికి మేము అనుమతించం" అని సుందరానికి న్యాయమూర్తులు తెలిపారు.

అంతకుముందే ఇదే అంశంపై మాట్లాడానికి ఆయన ప్రయత్నించారు. నిఖిల్ గుప్తాను కలవడానికి వీలులేకుండా చేస్తున్నారని, బలవంతంగా నిర్భంధంలోకి తీసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకూ కాన్సూలర్ యాక్సెస్ లభించలేదని వివరించే ప్రయత్నం చేశారు. ఇది మానవ హక్కుల సమస్య అని, విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ సాయాన్ని పొందడంలో గుప్తా విఫలం అయ్యారని సుందరం కోర్టుముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ అంశం ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే సెప్టెంబర్ 17, 2023న నిఖిల్ గుప్తా కాన్సులర్ యాక్సెస్ పొందారని, అలాగే ఢిల్లీ హైకోర్టు ను సైతం ఆశ్రయించడని ధర్మాసనం వివరించింది.

కాగా జూన్ 30 చెక్ లో నిఖిల్ గుప్తాను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్న గురుపత్వంత్ సింగ్ ను చంపడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా అమెరికా కోర్టులో అక్కడి ప్రభుత్వం అభియోగాలు మోపింది. దీనిపై భారత్ సీరియస్ గా స్పందించింది. దీనిపై ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.


 


Tags:    

Similar News