అట్టహాసంగా ప్రారంభమైన ‘ఏరో ఇండియా 2025’

చరిత్రలో తొలిసారి ఒకే వేదికగా అమెరికన్ ఎఫ్ -35, ఎస్ యూ -57;

Update: 2025-02-10 11:58 GMT

భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానాలు ‘‘ ఏరో ఇండియా 2025 ’’ పదిహేనో ఎడిషన్ ప్రారంభం సందర్భంగా ఆకాశంలో యుద్ద విన్యాసాలతో ప్రేక్షకులను అలరించాయి.

బెంగళూర్ లోని యలహంక వైమానికదళం నుంచి ఇవి ప్రారంభం అయ్యాయి. యుద్ద విమానాల గర్జనలు, కళ్లు తిప్పుకోలేని విన్యాసాలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

ఐదురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా పేరు పొందింది. ఇక్కడ అనేక దేశాలు, సంస్థలు పాల్గొని ఏరోస్పేస్ రంగంలో తమ ఉత్పత్తులను, ప్రతిభను ప్రదర్శిస్తాయి.
ఈ బృందానికి నాయకత్వం వహిస్తూ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్వదేశీ తయారీ తేజస్ సార్టీలో పాల్గొన్నారు. ఆయన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారీ చేసిన యుద్ద విమానం తేజస్ లో ప్రయాణించారు.
ఐఏఎఫ్ కి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం వివిధ విన్యాసాలు  ప్రదర్శించగా ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. బీఏఈ సిస్టమ్స్ హాక్ ఎంకే 132 విమానాన్ని ఉపయోగించిన బృందం తొమ్మిది విమానాలను గాల్లోకి ఎగురవేసి తన సత్తాను ప్రదర్శించాయి.
ఎస్కేఏటీ త్రివర్ణ పతాకాన్ని, మన్మథుని బాణంతో గుచ్చబడినట్లు హృదయాన్ని గీసింది. భారత నావికా దళం కూడా వరుణ్ నిర్మాణం, జాగ్వార్ విమానం చేసిన బాణం నిర్మాణం, మూడు సుఖోయ్ విమానాలు చేసిన త్రిశూల్ విన్యాసాలు ప్రశంసలు పొందాయి.
హల్ ఉత్పత్తి చేసిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు కూడా తమ వైమానిక విన్యాసాలతో సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ హెలికాప్టర్లు ఎత్తైన ప్రదేశాలలో మోహరించిన రక్షణ దళాలకు చాలా సహాయకారిగా ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, అమెరికా యుద్ద విమానం లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్ 35, రష్యా కు చెందిన సుఖొయ్ ఎస్ యూ 57 కలిసి ఏరో ఇండియా ప్రదర్శనలో పాల్గొన్నాయి.
ప్రపంచంలో తొలిసారిగా అత్యంత ఆధునాతన ఐదవ తరం రెండు యుద్ద విమానాలైన అమెరికన్ ఎఫ్ 35 లైట్నింగ్ -II, రష్యన్ తయారీ ఎస్ యూ -57 రెండు కూడా ఏరో ఇండియా -2025 లో పాల్గొనడాన్నిప్రపంచం చూస్తోందని అని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది.
ఇది ప్రపంచ రక్షణ సహాకారం, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయిని సూచిస్తుంది. విమానయాన ఔత్సాహికులు, రక్షణ నిపుణులకు ఈ అత్యాధునిక యుద్ద విమానాలను వీక్షించే అసమానమైన అవకాశాన్ని అందిస్తుంది. రక్షణ అధికారుల ప్రకారం.. ద్వైవార్షిక ప్రదర్శనలో ఎఫ్-35 స్టాటిక్ డిస్ ప్లే కోసం ఉంటుంది.
Tags:    

Similar News